Thursday, April 30, 2009

మహాకవి శ్రీ శ్రీ


ఆవేశం ఆయన సిరా ...
ఆయన కవితలు అక్షర చైతన్యాలు ....
పతితులార భ్రష్టులార , బాధా సర్ప దష్టులార ....అంటూ కవిత్వాన్ని వెన్నెల వాకిళ్ళ లోంచి శ్రామికుడి చెమట చుక్కల్లోకి ఈడ్చుకు వచ్చిన ప్రజాకవి .ఆ మానవీయుని శత జయంతి సందర్భంగా...."సిప్రాలి " నుండి .....

సిరిసిరిమువ్వలు

పాతబడి కుళ్లిపోయిన
నీతులనే పట్టుకుని మనీషుల మంటూ
నూతన జీవిత లహరికి
సేతువు నిర్మింతురేల ?సిరిసిరి మువ్వా !

నీత్యవినీతులలో గల
వ్యత్యాసము తెలిసినట్టి వాడెవ్వడు ?నా
కత్యవసరమొకటే , ఔ
చిత్యం వర్తమునందు, సిరిసిరి మువ్వా !

ప్రాస క్రీడలు

ఈ మంత్రుల హయాం లోన
రామ రాజ్యమెప్పుడు ?
పడమటి దిక్కున సూర్యుడు
పొడుచుకొచ్చినపుడు

ప్రజాస్వామ్య పార్టీల్లో
ప్రజలకు తావెప్పుడు ?
నేటి బీరకాయలోన
నేయి పుట్టినప్పుడు

లిమ క్కులు

నేను
ముసలివాణ్ణి
కాను అసలు వాణ్ణి
పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి
పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి
అందుకున్న ఆకాశపు కొసల వాణ్ణి

ఔను
నిజంగా నేను
ప్రజల కవినేను
ఎంచే తంటేను
వాళ్ళని చదివేను
చదివిందే రాసేను

కదన విహారానికి కత్తి పట్టు
కార్మిక వీరుడవై సుత్తి తిప్పు
ప్రగతి విరోధుల భిత్తి కొట్టు
సామ్య వాదాన్ని నీ గుండెల్లో హత్తి పెట్టు
సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు

సామ్య వాదం
ఈనాటి వేదం
అందరిలో మారుమోగే నినాదం
అందరికీ అందిస్తుంది మోదం
అది సఫలం సుఫలం శ్రీదం

16 comments:

  1. సమయోచితంగా బాగుందండి..

    ReplyDelete
  2. చాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆల సంతోషమనిపించింది మీ టపా చూశాక. శ్రీ శ్రీ గారికి నేనొక ఏకల్య శిష్యురాలను. కాలేజి రోజుల్లో ఆయన మాటలే వేదంలా వల్లిచేదాన్ని( అంటే ఆచరించేదాన్ని ). మరి ఇప్పుడో అని అడగకండి. ఇప్పుడూ అదే దారి.
    మీరందించిన తన కవితలకు కృతజ్ఞతలు .

    ReplyDelete
  3. goodone.sri sri gari kavitvam gutu chesaaru..........thx

    ReplyDelete
  4. చాలాబాగుంది సిరిసిరి మువ్వ
    శ్రీ శ్రీ గారి కవిత్వం కవితా ఆకలికి పెట్టే ఒక కమ్మటి బువ్వ

    ReplyDelete
  5. పరిమళం గారు, ఈ పుస్తకాల డిజిటల్ కాపీ లుంటే నెట్ లో పెట్టి పుణ్యం కట్టుకోరూ !

    ReplyDelete
  6. కావితా గమకాల మహర్షి శ్రీశ్రీ గారికి నా వంతు ప్రణామాలు.

    ReplyDelete
  7. శ్రీ శ్రీ గారు రాసిన మనసున మనసై...బ్రతుకున బ్రతుకై పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎంత మంచి సాహిత్య విలువలు ఉంటాయి..ఆ పాటలో..
    నిన్ననే టీవి9 లో ఆయనపై ఒక ప్రోగాం ప్రసారం చేశారు. ఈ రోజు మీ టపా చూసాను. మురళి గారు చెప్పినట్టు సందర్భోచిత టపా.

    ReplyDelete
  8. శ్రీ శ్రీ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది
    మహా ప్రస్థానం లోని నిప్పు కణికెలు!
    మీరు మాత్రం చాలా అరుదైన వాటిని ఏరి కోరి
    పొందు పరిచారు.
    అన్నీ పరిమళ భరితంగా వున్నాయి.

    ముఖ్యంగా "నేను ముసలి వాణ్ని కాను ...
    పీడితులను వెంటేసుకు తిరుగువాన్ని ..." అన్న మాట
    తీవ్రం గా ఆలోచింప జేసింది
    ఒకప్పుడు "ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి " అని
    ఆయనే అన్నారు. దానికి వివరణెమొ ఇది.
    "కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు ..
    పేర్లకీ ఫకీర్లకీ పుకార్లకీ నిబద్దులు .." అన్నదీ శ్రీ శ్రీ యేగా !!
    మహాకవికి మీ ద్వారా శత కోటి జే జే లు !!

    ReplyDelete
  9. నేను కుడా శ్రీ శ్రీ గారి ఒక పాత పోస్ట్ చేసాను... చూడండి వీలైతే... రాగం

    ReplyDelete
  10. శ్రీశ్రీ కవితల్లో నాకు నచ్చినది బహు చిన్నది-------
    ఆహ్!
    నిప్పులుచెరుగుకొంటూ నింగికినీవెగిరిపోతే
    నిబిడాశ్చర్యంతో వీరే!
    నెత్తురుకక్కుకొంటూ నేలకు నువ్వొరిగిపోతే
    నిర్దాక్షిణ్యంగా వీరే!

    ReplyDelete
  11. న్యాయం గెలుస్తుంది అనమాట నిజమే కాని గెలిజింతి అంతా న్యాయం కాదు
    ............ శ్రీశ్రీ

    ReplyDelete
  12. ఇలా మీరందరు సమయం వెచ్చించి చక్కని టపాలుగా ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ మురళి గారు ,ధన్యవాదాలు .

    @ శ్రుతీ ! ఐతే మీ దారి రహదారన్నమాట :) :)

    @ వినయ్ గారు , థాంక్సండీ ..

    @ పుల్లాయన గారు ,ధన్యవాదాలు .

    @ నేస్తం గారు మీక్కూడా :)

    @ జయ భారత గారు , వహ్వా ...వహ్వా ... :)

    @ మారుతి గారూ ! థాంక్స్ !

    @ భాస్కర రామి రెడ్డి గారూ ! నాదగ్గర సిప్రాలి పుస్తకం మాత్రమె ఉందండీ ! మీ స్పందనకు ధన్యవాదాలు .

    @ శేఖర్ గారు ఆ పాట నాక్కూడా ఇష్టమేనండీ .

    @ ప్రభాకర్ సర్ ! ధన్యవాదాలు .

    @ చైతన్య గారు , మీ రాగం చూశానండీ ...మంచి పాటల సేకరణ .ధన్యవాదాలు .

    @ జయచంద్ర గారు ,అక్షర సత్యాలండీ ! చిన్నదైతేనేం?

    @ శ్రీ గారు , శ్రీ శ్రీ గారి మాటలు ఏ తరానికైనా అన్వయించుకునేలా ఉంటాయి .

    @ ఉష గారు , మీ స్పందనకు ధన్యవాదాలండీ ...

    @ అరుణాంక్ గారూ ! thanks !

    ReplyDelete