Thursday, April 23, 2009
మరునకుమారునివా ?
ప్రియతమా !
మదనుని వాడి శరములైదూ ఒకేసారి
ఎక్కుపెట్టినట్టుండే నీ కొంటె చూపులెక్కడ ?
అరుణుడిపై కినుకబూని ఉషోదయానికన్నా
ముందే జలజలా రాలే పారిజాతాల్ని
తలపించే నీ చిరునవ్వులెక్కడా ?
మరునికి మారునివన్నానని అలిగి
మనసిజుడే దొంగిలించాడా ?
వెన్నెలంతా రాశి పోస్తే నీవన్నానని
ఆ జాబిల్లే దోచుకెళ్ళాడా ?
ఎవరేం చేసినా ......
మంచున తడిసిన మరుమల్లెలన్నీ
ప్రోగు చేస్తే ....అది నీ మనసు ...
ఆ పరిమళాన్ని నానుండి ఎవ్వరూ
దూరం చేయలేరు ......
Subscribe to:
Post Comments (Atom)
మంచున తడిసిన మరుమల్లెలన్నీ
ReplyDeleteప్రోగు చేస్తే ....అది నీ మనసు ...
ఆ పరిమళాన్ని నానుండి ఎవ్వరూ
దూరం చేయలేరు ......
Sounds good...
వావ్! సూపర్!!!
ReplyDelete" manchuna thadisina marumallelannee " ..nee manau ...chaala baavundi .aa parimalam nannuu...taakindi
ReplyDeleteమంచున తడిసిన మరుమల్లెలన్ని .....,,,,
ReplyDeleteపరిమళాన్ని నా నుంచి వేరు ........................చాల బాగుందండి .
అరుణకిరణ పారిజాతాలతో
ReplyDeleteరాశిగా పోసిన వెన్నెలతో
తడిసిన మరుమల్లెలతో
ఓ ప్రియుణ్ణి కూడా వర్ణి౦చవచ్చని మీ కవిత చెబుతో౦ది.
మగతన౦ గురి౦చి పక్కనపెట్టి
మదనుడి పేరునోసారి పెట్టి
మరులు గొలిపే ప్రక్రియ పట్టి
ప్రేమ అతి సున్నితమని, విరహ౦లో సౌకుమార్యాన్ని మీ కవిత చూపిస్తో౦ది.
మీ కవితకు నా అభిన౦దన!
బాగుందండి.
ReplyDelete@ పద్మార్పితగారు ,ధన్యవాదాలు .
ReplyDelete@ మందాకినీ గారు ,మీక్కూడానండీ !
@ రిషి గారు , బ్లాగ్ లోకి వచ్చి పరిమళాన్ని ఆస్వాదించినందుకు థాంక్స్ .
@ చిన్ని గారు ,మీక్కూడా థాంక్స్ .
@ ఆనంద్ గారూ ! మీ స్పందన నా కవితకి సౌరభాన్ని అద్దిందండీ ! మీ సూచనకు కృతజ్ఞతలు .
@ మారుతి గారు ,,ధన్యవాదాలండీ .
ఇంత అందమైన కవితకు తగినదిగా అనిపించడంలేదు సినీబొమ్మ
ReplyDelete@ విజయ్ మోహన్ గారు ,నిజమేనండీ ..కానీ కొంత దిగులు , నిరాశ ముఖంలో కనిపించే బొమ్మ కోసం చాలా వెదికాను .దొరక లేదు ...అందుకే ఇలా ...ఇదే విషయాన్ని మరో మిత్రులు కూడా సూచించారు . వారికీ ..మీకూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను .
ReplyDeleteకవితకు తగ్గ ఫొటో , ఫొటో కు తగ్గ కవిత :)
ReplyDeletesorry, lack of time prevented me from visiting you blog. Nice kavita, very deeply and tenderly expressed in deed. chaalaa baagumdi.
ReplyDelete