Sunday, April 12, 2009

ఎన్నికల వేళ........


లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ...ఒకసారి రైలులో ప్రయాణం చేయవలసివచ్చింది .రైల్వే ఉన్నతాధికారులు ఆయనకు A.c భోగీలో ప్రయాణానికి ఏర్పాటు చేశారు .అప్పుడాయన వారిని వారించి , ఒక పేద దేశాన్ని పాలించే మంత్రి పేదవాడే అయి ఉంటాడు అని జనరల్ భోగీలోనే ప్రయాణం చేశారట .ధనాన్ని , వనరుల్నీ అవసరాల మేరకే ఉపయోగించుకోవాలని శాస్త్రిగారు ఆచరణలో చూపించారు.

మనం ఒక మంచి నాయకుడ్ని ఎన్నుకోవడం దేశాభివృద్ధికి ఏంటో ఉపయోగకరం ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం కూడా ...కనుక జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నాయకుడ్ని ఎన్నుకుందాం .

ఒకవేళ అర్హత గల అభ్యర్ధి లేదని భావిస్తే , ఎన్నికల బరిలో ఉన్న ఏ అభ్యర్ధీ నచ్చలేదని ప్రిసైడింగ్ అధికారి వద్ద లభించే ప్రత్యెక పత్రంలో రాసిచ్చే అవకాశం ఉంటుంది .దీనివల్ల మన ఓటు దుర్వినియోగ మవకుండా ఉంటుంది .

మన స్వప్రయోజనాలకోసం ఎన్నోసార్లు క్యూ లో నిలబడతాం .రేషన్ కార్డూ , డ్రైవింగ్ లైసెన్స్ , బిల్లులు కట్టేందుకు ..సినిమా టిక్కెట్ కోసం కూడా కష్టపడి వరుసలో నిలబడతాం .అలాగే జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల పౌరులుగా ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కును వినియోగించుకుందాం ...ఓటు వేద్దాం ..

10 comments:

 1. చాలా మంచి విషయం చెప్పారు .. ఈ నాటి టెలీ స్కూల్ కార్యక్రమం లో ... నేను ఇంకా క్రమం తప్పకుండ ఓటు వేస్తా .

  ReplyDelete
 2. నేను తప్పకుండా నా వోటు హక్కు వినియోగించుకుంటాను.

  ReplyDelete
 3. మన జీవితం మొత్తం మీద ఎన్ని ఎన్నికల్లో పాల్గొని వోటు వేయగలం అని లెక్క పెట్టుకుంటే వోటు ఎంత విలువైనదో ఇట్టే అర్ధమవుతుంది.. నిజానికి వోటు వేయడమన్నది ఒక ప్రివిలేజ్.. మంచి టపా..

  ReplyDelete
 4. భాద్యత గల దేశ పౌరురాలిగా ...మీ పిలుపు ......ఒక మేలికొలుపు..గుడ్ .

  ReplyDelete
 5. ఏ పార్టీ ఏలినా ఎ౦దుకు ఎన్నికల్లో నెగ్గినా
  ఎన్ని బూతులు ఎదురైనా పగ్గాలు ఏ తీరున దొరికినా
  గడపాలి శేషజీవితము డబ్బుమబ్బుల ప౦దిరి మాటు
  పొగడాలి నా కులమును అన్ని కులాల్లో మిన్న అ౦టూ
  నడవాలి లక్ష్మి నా బానిస వలె నా దారి గొప్పద౦టూ
  రాజకీయపరిభాషలో అజీర్ణము చెడ్డది కాదు మహామ౦చిద౦టూ

  పరిమళగారు, నచ్చిన పార్టీ ఏదీ లేకపోతే ఏ౦చెయ్యలో వివరి౦చిన మీ సూచనలు మహాఅమోఘ౦గా ఉన్నయి. ఓటు హక్కు వినియోగ౦లో కన్నా సద్వినియోగ౦లో చాలా తేడాలొస్తాయి.

  ReplyDelete
 6. వలసజీవిని కనుక ఆ అవకాశంలేదు కానీ మీ మాట మంచి ప్రబోధం.

  ReplyDelete
 7. బాగా చెప్పారు.

  ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండేం, భోగీ కాదు, బోగీ.
  భోగీ అనగా అనుభవించువాడు. బోగీ అనగా పెట్టె అనుకోవచ్చు.

  ReplyDelete
 8. చదువుకొన్నవారు వోటు వేసుంటే ఈదేశం ఏ రోజో బాగుపడి ఉండేది.ఇంకా ఆలశ్యం చేయటం మంచిదికాదు.మనబిడ్డలకైనా మంచి దేశాన్ని అందిద్దాం.

  ReplyDelete
 9. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదములు .

  భాస్కర్ రామరాజు గారూ ! అనుకోవడానికేముందండీ....తప్పులు సరిదిద్దేవారు గురుతుల్యులు .ధన్యవాదాలండీ !

  ReplyDelete
 10. పూణే నుంచి వచ్చీరాంగానే వెళ్ళి నా వోటు వేసి వచ్చా

  ReplyDelete