Friday, April 3, 2009

శ్రీ రామనవమి శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులకు......
ఎల్లవేళలా శ్రీరామచంద్ర మూర్తి కరుణా కటాక్షములు
మీయందు ఉండాలని కోరుకుంటూ .....
శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

మంగళ హారతి

పాడరే చెలులారా ...
పరిణయ మంగళ గీతి
హాయిగా ...పరిణయ మంగళ గీతి

మహర్షి మాటను జవదాటకనూ
హరివిల్లు విరిచెనే రామ చంద్రుడు
జనకుని కూతురు ఈ జానకిని
పరిణయమాడెనే రఘు రాముడు //పాడరే //

దవుదవ్వున తామరపూవులు
జల్లరే విర జల్లరే .....
చందన సుమము వసంత రజము
చల్లరే ..పై చల్లరే .....// పాడరే //

నవ వధువును సాధించిన
రామునకీయరే జయ హారతీ
కోరిక తీరిన సీతా కన్యకు
ఈయరే శుభ హారతీ ...//పాడరే //

12 comments:

  1. జై శ్రీరాం!!
    పులిహోర!! మరి నాకో..:):)

    ReplyDelete
  2. పరిమళం గారూ..పులిహోర, వడపప్పు పానకం చాలా బాగున్నాయి. మీకు మీ కుటుంబానికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు

    ReplyDelete
  4. శ్రీ రాముడు మిమ్ములను,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. శ్రీ రాముడి కుటుంబం,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. రామాయణం మొత్తం ఒక చిన్న పాటలో ఇమిడిపోయింది!! ప్రసాదం కూడా బాగుందండి..

    ReplyDelete
  7. వావ్.. మీ పాట చదువుతుంటే నాకు ప్రక్కనే అదే పాట ఎవరో కోరస్ పాడుతున్నట్లు వాయిస్ కూడా వినిపిస్తుంది. చాలా బాగుంది.
    www.mahigrafix.com/forum

    ReplyDelete
  8. మీకు కూడా

    శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. మీకు, మీ కుటుంబసభ్యులకి కుడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు :)

    ReplyDelete
  10. స్పందించిన బ్లాగ్ మిత్రులకందరికీ ధన్యవాదములు .

    ReplyDelete
  11. పరిమళం గారు, ఇక మనమంతా పాటల పల్లకీలు కట్టి చలనచిత్ర కోటల రాణులైపోదామా. చాలా చక్కగా అంత లోతు భావన సులభంగా ఇమిడ్చేసారు. కొంచం అస్సొయ తెచ్చుకుందమన్నా కలగటం లేదు, చదివి చెందిన తాదాత్మ్యం నుండి ఇంకా వెలికి రాలేదు మనసు.

    ReplyDelete
  12. @ ఉష గారూ ! క్షమించాలి ...ఈ పాట నా సొంతం కాదు .ఇది చాలా పాత అంటే ఎప్పుడో అమ్మమ్మల చిన్నప్పటి మంగళ హారతి పాట .నోటేడ్ పాటే కదాని వివరణ ఇవ్వలేదండీ ....సీతా రాములకు మంగళమని ఉద్ద్దేశ్యం తో పెట్టాను .మీ పొగడ్తకి అర్హురాలిని కానండీ .

    ReplyDelete