Saturday, April 25, 2009

కృష్ణశాస్త్రి కవిత

సుందర లోకం

చుక్కల కావలి దిక్కున
సుందరలోకం !
మిక్కిలి దూరం , ప్రయాణ
మెంతైనా భారం !

అక్కడ నాచిట్టితల్లి
హాయిగానే ఉంటుంది
ఒక్కత్తే వాళ్ల మామ్మ
ఒడిలో కూర్చుంటుంది

అక్కడ ఇంద్ర ధనుస్సులు
అల్లిన పందిళ్ళు ...
అక్కడ వెన్నెల కలాపి
చల్లిన వాకిళ్ళు .....

3 comments:

  1. ఎందుకో అర్ధంతరంగా ఆపేశారనిపించింది.. ఫోటోలు చాలా బాగున్నాయి..

    ReplyDelete
  2. మురళి గారు ! ఈ కవిత కృష్ణ శాస్త్రిగారి బదరిక లోనిది .గూగుల్ లో వేరే బొమ్మ కోసం వెదుకుతుంటే కనిపించాయా చిత్రాలు . వాటిని చూడగానే నాకు గుర్తొచ్చిన కవిత .అలాగే బ్లాగ్ లో పెట్టానండీ ! బొమ్మలు మీకూ నచ్చినందుకు ధన్యవాదాలు .

    ReplyDelete
  3. wow, i felt like becoming that చిట్టితల్లి once again and once for all in life. At least in my dreams I could make that thought come real.

    ReplyDelete