Friday, April 10, 2009

పాటల సందడి - గున్నమామిడి కొమ్మమీద

నాకు చాలా నచ్చిన పాట




చిత్రం : బాలమిత్రుల కధ
గానం : ఎస్. జానకి
రచన : ఆత్రేయ
సంగీతం : సత్యం


గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే
ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే
ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల //గున్న మామిడీ //

ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా
జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా
తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి //గున్న మామిడీ//

* రంగు, రూపు... జాతి, రీతి బేధం లేని నిష్కల్మషమైన స్నేహానికి అద్దం పట్టే ఈపాట అంటే నాకు చాలా ఇష్టం.

20 comments:

  1. e song chala baguntandi. chinnappudu e paata chala sarlu padevallam. e cinemalo hero jaggayya kada?gurthu ledu. e cinemalo a abbayilu iddaru inti nundi paripoyi suryakantam daggara ki cheratharu.antha varaku gurthu undi

    ReplyDelete
  2. ఇవాళ ఏదైనా పాటలకి సంబంధించిన రోజా అండి? చాలా బ్లాగుల్లో పాటలే కనిపిస్తున్నాయి.. ఈ పాట తోనే జానకి నా ఫేవరెట్ సింగర్ అయ్యారు.. అలా ఇది నాకు ప్రత్యేకమైన పాట..

    ReplyDelete
  3. @ శివ ప్రసాద్ గారు ! అదే సినిమా అండీ ! ఆ ఇద్దరు పిల్లల నిష్కల్మషమైన స్నేహం మనసుకి హత్తుకొనేలా ఉంటుంది .ఈ పాట మరీను ..థాంక్స్ .

    @ మురళి గారు , ఈరోజు ప్రత్యేకతంటూ ఏమీ లేదు కానీ స్త్రీ బ్లాగరులం కొంతమంది నచ్చిన పాటను బ్లాగులో పెడదామని అనుకున్నాం .అంతే! ధన్యవాదాలండీ ....

    ReplyDelete
  4. చాలా మంచి పాట అందించారు.. చిన్నారి స్నేహం పై అందమైన పాట ఇది..

    ReplyDelete
  5. ఒక్క వాక్యంలో పాట గొప్పతన్నాన్ని చెప్పేశారే.
    psmlakshmi

    ReplyDelete
  6. అహా ఇలాంటి నిర్ణయాలు అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉండండీ.. :)
    ఈ పాట విని జానకిగారు నా ఫేవరెట్ అయిపొయ్యారు. :))

    ReplyDelete
  7. పరిమళం గారూ..
    బహు చక్కని పాట.!
    చిన్నప్పుడు స్కూల్లో పాట పాడమంటే చాలు పిల్లలందరికీ ఈ పాటే మొదటగా గుర్తొచ్చేది కదూ :)

    ReplyDelete
  8. మా సూరిగాడికి ఈ పాట అంటే మహా ఇష్టం ఒకానొకప్పుడు. వాడిని నిద్రబుచ్చేప్పుడు ఈ పాట పాడేవాణ్ని. మంచిపాట అందించారు. శుభ శుక్రవారం శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. పరిమళం గారు,
    నాకూ ఈ పాట చాలా ఇస్టము

    ReplyDelete
  10. వారెవ్వా, పరిమళం మళ్ళీ గుభాళించారు. మీకు తిరుగు లేదు. నాకీ పాట మొత్తం వచ్చు ఒకప్పుడు. తిరిగీ మధ్యనే జెమిని పిల్లల పాటలపోటిలో ఒక చిన్నారి పాడగా విన్నాను. ఇపుడు నాకు వేవేల పాటలు ఇష్టమైపోయి నేర్చునే ప్రయత్నం మాని వినే ధోరణికి అలవడిపోయాను.

    ReplyDelete
  11. ఎక్కడికో తిసుకెళ్ళిపొయారండి..స్కూల్ పిల్లలందరిని సబ్సిడీ టికెట్ మీద టిసుకెల్లారు.ఈ పాట మాత్రం బాగగుర్తున్నది.

    ReplyDelete
  12. హాయ్... మీకు కుడా పాటల లిరిక్స్ పోస్ట్ చేసే అలవాటు ఉందా... బాగుంది బాగుంది...
    ఈ పాటల కోసమే నాకొక బ్లాగు కుడా ఉంది...
    ఆసక్తి ఉంటే చూడండి... రాగం

    ReplyDelete
  13. చిన్నపుడు school లో ఇదే పాడేవాళ్ళం.మళ్ళీ గుర్తు చేసినందుకు Thanks.

    ReplyDelete
  14. బాల్య మిత్రుల పాటను మెచ్చిన బ్లాగ్ మిత్రులందరికీ ధన్యవాదములు .

    ReplyDelete
  15. చాలా మంచి పాట.గొప్ప సినిమా.ఒక మధురగీతాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.బాలమిత్రుల కధ సినిమా చాలా సామాజికాంశాలను సృశించిన మంచి చిత్రం.బీదాగొప్పా,అంటరానితనం,తీవ్రవాదం,కుల(కుళ్ళు)రాజకీయాలు నిర్మలమైన స్నేహాలను ఎలా విడగొడతాయో,కానీ అన్నిటిని అధిగమించి ఆ సావాసం ఎలా పెనవేసుకుపోతుందో అతిగొప్పగా చూయించిన సినిమా ఇది.బాలనటులు ఇద్దరూ చాలా చక్కగా నటించారు కానీ,తరువాత వారి ఊసు ఎక్కడా వినిపించలేదు అదేం చిత్రమోగాని!!???
    ఈ పాటను ఇక్కడ సి.నారె బొమ్మను చూస్తూ విని ఆనందించండి
    http://www.youtube.com/watch?v=jc4xWRADf1k
    లేదా ఇక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోండి
    http://music.cooltoad.com/music/song.php?id=336234
    లేదా ఇక్కడ రెండు వెర్షన్లనూ వినగలరు
    http://www.chimatamusic.com/kids.php
    33,34 పాట వరుస సంఖ్యలు

    ReplyDelete
  16. ఎంత మంచి పాట! మరిచిపోయిన నాటి మాధుర్యాన్ని మళ్ళీ గుర్తుకుతెచ్చారు. ధన్యవదాలు. ఈమధ్య ఎవరో పుణ్యాత్ముడు 1232 తెలుగు పాత పాటల్ని (బ్లాక్ అండ్ వైట్) torrentz.com లో అప్ లోడ్ చేసాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు డౌన్ లోడ్ చేసికొనండి.

    ReplyDelete
  17. రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికీ,శంకరయ్య గారికీ ధన్యవాదాలు .

    ReplyDelete
  18. పరిమళం మరలా మీ పరిమళాన్ని వెదజల్లారు అనమాట. ఎందుకో ఈ పాట వినకముందు మనసు అంతా ఎంతో బాదగా వుంది కానీ మీ పరిమళాన్ని ఆస్వాదించాగా మనస్సు కుదుటపడింది ధన్యవాదాలండి

    ReplyDelete
  19. శ్రీ సాయి గారు !పాత పాటల్లోని మాధుర్యం అటువంటిది.ధన్యవాదాలండీ !

    ReplyDelete