ప్రియతమా !
పగలంతా ఊపిరివై చిర్నవ్వునీ
రేయంతా జ్ఞాపకమై నిద్దురనీ
దోచేయటం నీకు సరదానా ?
ఊహల్లో ఉప్పెనవై మనసునూ
నా ఎదలో కలవరమై నన్నూ
ఉడికించటం నీకు సరదానా ?
గగనంలో జాబిలివై అందక
చేరువైన చెలిమిని పొందక
ఊరించటం నీకు సరదానా ?
Tuesday, April 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
నేనేం చెయ్యలేదు ..... అసలు నేను కాదు ....నాకే పాపం తెలీదు ..
ReplyDeleteచాలా బాగా రాసారు పరిమళం గారు
ReplyDeleteబాగుందండి.. కాకపొతే ఫోటో కొంచం మిస్ లీడ్ చేయడం లేదూ.. ?
ReplyDeleteవిరహపు వేదనను బాగా వ్యక్తపరిచారు
ReplyDeleteకవిత బాగుంధి. ఫోటో చూసి నేను వేరే గా అనుకొన్నాను.
ReplyDelete@ శ్రీనివాస్ గారూ ! చూస్తూనే ఉన్నా మీ అల్లరి ...అయినా మీరుకాదని జి. సువర్ణ చెప్పిందండీ ... :)
ReplyDelete@ నేస్తం ! మీకన్నానా ? ధన్యవాదాలు .
@ మురళి గారు !మీ సూచనకు ధన్యవాదాలండీ . ఫోటో మార్చాను చూడండి .
@ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారు , థాంక్సండీ .
@ జయచంద్ర గారు , థాంక్స్ ....ఫోటో మార్చానండీ ...
చాలా బాగుందండి.. :)
ReplyDeleteచాలా బాగుందండీ!
ReplyDeleteవావ్! వపా గారి బొమ్మ.. ఇప్పుడు మీ కవితకే కొత్త అందం వచ్చిందండి..
ReplyDelete"జ్ఞాపకమయి నిద్దురని దోచేయడం సరదాన".........చాల బాగుంది.
ReplyDeleteఊహు, నేను ఒప్పుకోను, అచ్చంగా నా మనసే మీరు తెలిపారిలా, లేదా మన ఇద్దరం ఒక గూటి పక్షులమైపోయాము. బావుంది.
ReplyDeleteఅలవోకగా జాలువారుతున్నాయి మీనుంచి కవితలు
ReplyDeleteపైంటింగ్ చాలా బాగుంది.చివరి పేర సూపర్ .
ReplyDeleteగగనంలో జాబిలివై అందక
చేరువైన చెలిమిని పొందక
ఊరించటం నీకు సరదానా ?
Very sensitive words Parimalagaru. I love the delicacy in your poetry. Feather lite words, but meaning is as deep as an abyss.
ReplyDelete@ శ్రీ గారూ ! థాంక్స్ ..
ReplyDelete@ చైతన్య గారూ !మీక్కూడా ..
@ మురళి గారు , మీకు ధన్యవాదాలు ..నిజానికి ఆయన బొమ్మ నాకవితకు పెట్టటానికి ధైర్యం సరిపోలేదండీ...
@ చిన్ని గారు , నచ్చినందుకు థాంక్స్ .
@ ఉష గారు , ఈ కామెంట్ మీ అభిమానాన్ని తెలుపుతోంది .అంతేగాని మీ మేడ , నా గూడు ఒకటవుతుందా ? ధన్యవాదాలండీ ...
@ విజయ మోహన్ గారు , మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ .
@ అరుణాంక్ గారు , క్రెడిట్ అంతా వ . పా గారిదేకదండీ ...ధన్యవాదాలు .
@ ఆనంద్ గారు , మీ అభిమానానికి కృతజ్ఞతలండీ .
ఇదేవన్నా సీజనా ఏంటి, జనాలంతా విరహాలు, వేదనలు, నిట్టూర్పుల్లో ఉన్నారు!
ReplyDeleteనువ్వు నాకు తోడుగా ఉంటే
ReplyDeleteఈ వెలితి తీరేదేమో!
తొలకరి నేలని ఊరించినట్టు
నీ జ్ఞాపకాలు నా మనస్సుతో ఆడుకుంటున్నాయి.
నా హృదయపు గదులలో
ఏదో మూలన నీ ఊసుల సాక్షిగా
నువ్వు తిరిగొస్తావని చిన్న ఆశ!
సాయంత్రం -
కొమ్మల చాటున గువ్వలు ఎగురుతూంటే
నీతో గడపలేని వెలితిని ఎత్తిచూపాయి!
నువ్వు నాకు తోడుగా ఉంటే
ఈ వెలితి తీరేదేమో!
kRsNa! thanks !మీ కవితతో నా నా బ్లాగ్ కి కొత్తందాన్ని తెచ్చిపెట్టారు .
ReplyDelete