Monday, April 27, 2009

నాన్న చెప్పిన కధ - 1


మంచి మనిషి

అనగనగా ఓ ఊరిలో గొప్ప ధనవంతుడున్నాడు. అతనికి ఎన్నేళ్ళైనా సంతానం కలగలేదు . అనారోగ్యంతో భార్య కూడా చనిపోయింది . తన తరుపు బంధువులు , భార్య తరుపు బంధువులు ఆస్తి కోసం ఇతనెప్పుడు పోతాడా ....అని రాబందుల్లా ఎదురు చూడసాగారు .ఇదంతా చూసిన ధనికునికి విరక్తి కలిగి ఓ గుడిని కట్టించి , ఓ పూజారిని నిత్యమూ పూజ చేసేందుకు నియమించాడు .ఆగుడికి ఎవ్వరు వచ్చినా ఉండటానికి సత్రమూ , భోజన శాలా కట్టించి పేదవారికి నిత్యాన్నదానం జరిగేలా ఏర్పాట్లు చేశాడు .ఖర్చుల నిమిత్తం తనకున్న పొలాలూ ,తోటలూ గుడికి మాన్యంగా రాసిచ్చాడు .

అతనికి వృద్ధాప్యం వచ్చింది . దేవాలయం ఆస్తుల్ని భద్రంగా కాపాడుతూ గుడి వ్యవహారాలన్నీ చూసుకొనే వారెవరికైనా బాధ్యత అప్పగించుదామని చూడసాగాడు . విషయం తెలిసి భూములపై వచ్చే ఆదాయానికి ఆశపడి ,కనీసం మంచిజీతమైనా దొరక్కపోతుందా అని ధనికుని వద్దకు ఎంతోమంది వచ్చేవారు .కానీ ఆ ధనికుడు అందర్నీ తిప్పి పంపేసేవాడు . నాకు మంచి మనిషి కావాలి అతనికే ఈ బాధ్యత అప్పగిస్తాను అని అందరితో అనేవాడు .చాలా మంది అతన్ని మూర్ఖుడనీ , పిచ్చివాదనీ అన్నా ఎవరినీ లెక్కచేసేవాడు కాదు .

రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకూ గుడికి వచ్చి పోయే వారిని గమనిస్తూ ఉండేవాడు .ఓ రోజు ఒక వ్యక్తి దర్శనానికి వచ్చాడు . చిరిగిన బట్టల్లో , పెద్దగా చదువు కున్నట్టు కూడా కనపడని అతడ్ని ధనవంతుడు తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు ." అయ్యా !మీరు ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతని స్వీకరించ గలరా ? "అని అడిగాడు . అతడు ఆశ్చర్యం గా "నేను ఎక్కువ చదువుకోలేదు ఇంత పెద్ద గుడి బాధ్యత నేనెలా నిర్వహినచగలను ?" అన్నాడు .

నాకు పండితుడక్కర్లేదు మంచి మనిషైతే చాలు ఈ బాధ్యత అప్పగించి విశ్రాంతి తీసుకోదలిచాను అన్నాడు .
అప్పుడా మనిషి "నేను మీకు పరిచయం లేదు .ఇంతమందిలో నన్నే మంచివాడిగా ఎందుకు భావించారు " అడిగాడు .
" మీరు మంచివారని నాకు తెలుసు గుడికి వచ్చే దారిలో ఓ రాయి పాతుకుపోయి ఉంది చాలా రోజులుగా దాని మొన బయటికి వచ్చి అందరి కాళ్ళకీ తగులుతూ ఉంది . తగిలిన వారు ముందుకు తూలటమో , లేక పడిపోతే లేచి దుమ్ము దులుపుకు పోవడమో చేస్తున్నారు .నేను చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాను ఎవ్వరూ పట్టించుకోలేదు . కానీ మీ కాలికి ఆ రాయి తగల్లేదు .అయినా మీరు కష్టపడి ఆరాయిని తవ్వితీసివేసి ,అక్కడ నేలంతా చదును చేశారు .అన్నాడా ధనవంతుడు .
అప్పుడా వ్యక్తి " ఇదేమీ పెద్ద పని కాదు మనకు గానీ ఎదుటివారికి గానీ హాని కలిగించే రాళ్ళు , ముళ్ళు లాంటివి తొలగించడం ప్రతీ మనిషి కర్తవ్యం " అన్నాడు .
తన కర్తవ్యాన్ని తెలుసుకొని నడుచుకొనే వాడే మంచిమనిషి .అంటూ ఆ ధనికుడు దేవాలయ బాధ్యతలన్నీ ఆ వ్యక్తికి అప్పగించాడు .

నీతి : మంచివారికి మంచే జరుగుతుంది .

కొసమెరుపు : నాన్న గారు చెప్పిన ఈ కధ చిన్నప్పట్నించీ మనసులో ముద్రించుకుపోయి ఇప్పటికీ బయటికెల్లినపుడు రోడ్డు మీద అరటి తొక్కలున్నా , కాళ్ళకి తగిలేలా రాళ్ళున్నా వంగి ఏరేస్తూ మా వారి చేత , నాతో వచ్చినవారిచేతా చివాట్లు తింటూ ఉంటాను :) :)

18 comments:

 1. మీ కధ చాలా బావుందండీ! ఇదే నీతితో నాకో కధ గుర్తు కొచ్చింది.త్వరలో బ్లాగులో పెడతాను.

  ReplyDelete
 2. goodone............ippatinundi nenu ala chestanu...........thx.........

  ReplyDelete
 3. ఇప్పటికీ బయటికెల్లినపుడు రోడ్డు మీద అరటి తొక్కలున్నా , కాళ్ళకి తగిలేలా రాళ్ళున్నా వంగి ఏరేస్తూ మా వారి చేత , నాతో వచ్చినవారిచేతా చివాట్లు తింటూ ఉంటాను :) :)
  oh!chala bagundi. నీతి : మంచివారికి మంచే జరుగుతుంది
  miku ilage jaruguthundi enduku ante meeru manchivaru kabatti.

  ReplyDelete
 4. రాళ్ళు తియ్యటం వరకూ పర్వాలేదు .మరీ అరటితొక్కలు కూడా ఏరుతుంటే తిట్లు తినరటండీ.
  ఇందులో మరో నీతికూడా వుంది. మన మనసుకు అద్దంపట్టేది మన ప్రవర్తనే ఏవంటారూ!

  ReplyDelete
 5. last di bagundi chivatlu thinadam hehehe :)

  ReplyDelete
 6. ఇదే అలవాటు మా నాన్నగారికి కూడా ఉందండోయ్, మాకు కూడా చెప్తుండేవారు.

  ReplyDelete
 7. పరిమళ గారూ, అ౦త సీరియస్ నీతి కథను ఓ మ౦చి నవ్వుతో భలే ముగి౦చారు. నీతి చెప్పడమే కాక పాటిస్తున్నానను మీ శైలిలో చెప్పరు. చాలా బాగు౦ద౦డీ మీ నాన్నగారి కథ.

  ReplyDelete
 8. రాళ్ళను తీయకపోయినా పరవాలేదుకానీ అరటితొక్కలు మాత్రం తప్పక తీయాల్సిందే ఎందుకంటే వాటితో చాలా ప్రమాదంకదా.రోడ్డులో అడ్డమున్న రాళ్ళను వంగి తీయనుగానీ కాలితోనే ప్రక్కకు నెట్టుతుంటానేను,అరటిత్రొక్కలను మాత్రం తప్పకుండా తీసివేస్తుంటా.వాటిపైన కాలువేసి చేతులు విరగ్గొట్టుకున్న ముసలివాళ్ళను చాలామందిని చూశా.

  ReplyDelete
 9. బాగుందండి కథ.. నాన్నగారు చెప్పిన కథల్లో మొదటిది.. అంటే మీరూ సీరియల్ మొదలెట్టేశారుగా.. హమ్మయ్య!

  ReplyDelete
 10. My father is the same in that aspect. He always made us work in the kitchen garden, get the walk ways rid of stones, thorns never let us litter in public places etc. I still carry that principle with me and do teach my kids.

  Nice story - well told and very well remembered.

  ReplyDelete
 11. స్పందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు .

  ReplyDelete
 12. అన్నట్టు నాకు తోడు ఎంతమంది ఉన్నారో మావారికి చూపిస్తా :) :)

  ReplyDelete
 13. Beutiful....

  ఆలస్యం గా వచ్చా ....! ఏమి అనుకోకండి..

  చందమామ .. చదివిన అనుభూతి.. కలిగింది..
  అన్నట్టు..నేనూ కొంచెం మంచివాడినే..(అప్పుడప్పుడు.. రోడ్డు మీద తొక్కలు తీసేవాదినన్న మాట..)

  ఏమైనా మంచి గుడి ఉంటే చెప్పండి... ఈ కార్పొరేట్ ఉద్యోగాలు..చేసి చేసి.. బోర్ కొట్టేస్తోంది..( సరదాగా...హి హి హి...)

  ధన్యవాదాలు...
  శివ చెరువు

  ReplyDelete
 14. మంచి విషయం చెప్పారు.. కాని నాకు గుర్తులేదు నేను దారిలో రాళ్ళను ఏరానో లేదో కాని రోడ్ మీద చెత్త వేస్తే మటుకు భలే కోపం వస్తుంది ..

  ReplyDelete
 15. పరిమళమ్! చాలా చక్కగా చెప్పారు. తిట్లు తిన్నా చేసేది మంచి కదా! పర్వాలేదు సర్దుకుందాం.

  ReplyDelete
 16. నేస్తం , శృతి ధన్యవాదములు .

  ReplyDelete
 17. తమ పని తాము చేస్తూ, తన చుట్టూ ఉన్న వారికి ఇలా సున్నితంగా చెప్పే మీలాటి వారంటే నాకు ఇష్టం. You are doing a great job. Keep it up :)

  ReplyDelete