Wednesday, May 20, 2009

అశ్రువు ...( ఓ బుల్లి కవిత )


నేస్తం !
నీ కన్నుల్లో పుట్టి ...
నీ చెక్కిలిపై జారి ...
నీ పెదవులపై జీవించి ...
హృదయం పై మరణిస్తే .....
క్షణ కాలమైతేనేం ?
నీకు సాంత్వన కలిగితే
నా జన్మ ధన్యం !

13 comments:

  1. అశ్రువు అద్భుతంగా ఉంది.

    ReplyDelete
  2. క్షణ కాలమైతేనేం...?
    నిజమేనండి ఆ జన్మ ధన్యమే.
    very nice nd beautiful post

    ReplyDelete
  3. నా లోగిల్లో ఆనందం అతిధి కావచ్చు కాని బాధ నా సహచరి. బాధలో మనసునూరడిస్తూ నను వీడి వెళ్ళే ప్రతి కన్నీటి చుక్కా తనతో నా కలతని మోసుకుపోతది.

    ReplyDelete
  4. అశ్రువు- small one but carries the ocean.
    alage mee kavita kuDA.....
    very nice ... keep going

    ReplyDelete
  5. ఇధి నేను వ్రాసిన మధురభావం-3 కు దగ్గరగా వుంది.
    ఇంకొక స్టెప్పు క్రిందికెళ్ళిం దంతే!

    ReplyDelete
  6. పరిమళం గారు,
    అలా చూస్తూ వుండిపోవాలనిపిస్తూంది.
    చాలా బాగుంది.

    ReplyDelete
  7. @ ప్రదీప్ గారు , థాంక్స్ !

    @ శ్రీగారు మీక్కూడా ...

    @ ఉషాగారు , మీ కామెంట్ తో అశ్రువుకూడా పరిమళించింది .

    @ క్రాంతి గారు , ధన్యవాదాలు .

    @ మురళి గారు , థాంక్స్ !

    @ జయచంద్రగారు , అవునండీ ...చిత్రాన్ని చూసి రాసాను ...మీరు చెప్పాక గమనించాను . ధన్యవాదములు .

    @ మాలాగారు , నాక్కూడా ఆ బొమ్మ ఎంతో నచ్చిందండీ ...

    ReplyDelete
  8. ravi chudanidi kavi gaanchun anna daaniki mee kavita manchi example. chadavagaane gundepai vunna bhaaramedo cheththo teesinattugaa ayindi. Thanks.

    ReplyDelete
  9. చాలా బాగుందండీ. ఒక చిన్న సవరణ.. 'సాంత్వన' అని వ్రాయాలి. "స్వాంతన" కాదు. గమనించగలరు.

    అభినందనలు!

    ReplyDelete
  10. @ వర్మ గారూ ! మీ స్పందనకు ధన్యవాదాలండీ !

    @ చంద్రమోహన్ గారు , నా పొరపాటును సరిదిద్దినందుకు కృతజ్ఞతలండీ ...సాంత్వన గా మార్చాను .ధన్యవాదములు

    ReplyDelete
  11. పరిమళం గారు
    మీ అశ్రువు చాలా బాగంది.
    చంద్రమోహన్ గారు అన్నట్టు.. సాంత్వన కాదు.
    మీరు రాసిన స్వాంతన సరైనది గమనించగలరు.
    - మన్నవ65

    ReplyDelete
  12. భళా! అశ్రువుకి మాటనిచ్చారు, చోటునిచ్చారు, క్షణభంగురమైనదైనా మీరే ప్రాణమిచ్చారు! అద్భుతం!

    ReplyDelete