Wednesday, May 20, 2009
అశ్రువు ...( ఓ బుల్లి కవిత )
నేస్తం !
నీ కన్నుల్లో పుట్టి ...
నీ చెక్కిలిపై జారి ...
నీ పెదవులపై జీవించి ...
హృదయం పై మరణిస్తే .....
క్షణ కాలమైతేనేం ?
నీకు సాంత్వన కలిగితే
నా జన్మ ధన్యం !
Subscribe to:
Post Comments (Atom)
ఎందరో మహానుభావులు, మరెందరో భావకవులు, భావుకులు ఎన్నెన్నో భావాలూ, కవితలు, కొటేషన్స్........ వాటితో పోలిస్తే నా భావాలు......... ఎంత............ ఆకాశం ముందు............ పిపీలికమంత అప్పుడప్పుడు ఏదైనా చదివినప్పుడు విన్నప్పుడు............... ఆ భావుకతకు.... గుప్పెడు మల్లెలు గుభాళించినట్లు మనస్సుప్పొంగుతుంది ఆ పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ............., ఆకాంక్ష
అశ్రువు అద్భుతంగా ఉంది.
ReplyDeleteక్షణ కాలమైతేనేం...?
ReplyDeleteనిజమేనండి ఆ జన్మ ధన్యమే.
very nice nd beautiful post
నా లోగిల్లో ఆనందం అతిధి కావచ్చు కాని బాధ నా సహచరి. బాధలో మనసునూరడిస్తూ నను వీడి వెళ్ళే ప్రతి కన్నీటి చుక్కా తనతో నా కలతని మోసుకుపోతది.
ReplyDeleteఅశ్రువు- small one but carries the ocean.
ReplyDeletealage mee kavita kuDA.....
very nice ... keep going
బాగుందండి..
ReplyDeleteఇధి నేను వ్రాసిన మధురభావం-3 కు దగ్గరగా వుంది.
ReplyDeleteఇంకొక స్టెప్పు క్రిందికెళ్ళిం దంతే!
పరిమళం గారు,
ReplyDeleteఅలా చూస్తూ వుండిపోవాలనిపిస్తూంది.
చాలా బాగుంది.
@ ప్రదీప్ గారు , థాంక్స్ !
ReplyDelete@ శ్రీగారు మీక్కూడా ...
@ ఉషాగారు , మీ కామెంట్ తో అశ్రువుకూడా పరిమళించింది .
@ క్రాంతి గారు , ధన్యవాదాలు .
@ మురళి గారు , థాంక్స్ !
@ జయచంద్రగారు , అవునండీ ...చిత్రాన్ని చూసి రాసాను ...మీరు చెప్పాక గమనించాను . ధన్యవాదములు .
@ మాలాగారు , నాక్కూడా ఆ బొమ్మ ఎంతో నచ్చిందండీ ...
ravi chudanidi kavi gaanchun anna daaniki mee kavita manchi example. chadavagaane gundepai vunna bhaaramedo cheththo teesinattugaa ayindi. Thanks.
ReplyDeleteచాలా బాగుందండీ. ఒక చిన్న సవరణ.. 'సాంత్వన' అని వ్రాయాలి. "స్వాంతన" కాదు. గమనించగలరు.
ReplyDeleteఅభినందనలు!
@ వర్మ గారూ ! మీ స్పందనకు ధన్యవాదాలండీ !
ReplyDelete@ చంద్రమోహన్ గారు , నా పొరపాటును సరిదిద్దినందుకు కృతజ్ఞతలండీ ...సాంత్వన గా మార్చాను .ధన్యవాదములు
పరిమళం గారు
ReplyDeleteమీ అశ్రువు చాలా బాగంది.
చంద్రమోహన్ గారు అన్నట్టు.. సాంత్వన కాదు.
మీరు రాసిన స్వాంతన సరైనది గమనించగలరు.
- మన్నవ65
భళా! అశ్రువుకి మాటనిచ్చారు, చోటునిచ్చారు, క్షణభంగురమైనదైనా మీరే ప్రాణమిచ్చారు! అద్భుతం!
ReplyDelete