దేవుడొక అధ్బుతాన్ని సృష్టించాడు
బంగారం కంటే విలువైన ... ( రూపం )
పూలకంటే సున్నితమైన ... ( హృదయం )
తొలి పొద్దువలె వెచ్చనైన ... ( ఒడి )
వెన్నెలకంటే చల్లనైన ... ( చూపు )
తేనె కంటే మధురమైన ... ( మాట )
శిఖరం కంటే ఎత్తైన .... ( వ్యక్తిత్వం )
సముద్రం కంటే లోతైన ... ( గంభీరత )
అంతెందుకు ?
తనకంటే గొప్పదైన ...
అమ్మను ...వరంగా ...
నాకోసం ....
** అమ్మా ! ఎప్పటికీ ఇదే వరాన్నడుగుతా ఆ దేవుడ్ని !!
"శిఖరం కంటే ఎత్తైన .... ( వ్యక్తిత్వం )
ReplyDeleteసముద్రం కంటే లోతైన ... ( గంభీరత " ...బాగుందండి..
పరిమళం గారు,
ReplyDeleteనేను అనుకునట్లుగానే సింపుల్ గా చక్కగా రాసారు.
beautiful!
ReplyDeleteచాలా బాగా చెప్పారు...
ReplyDeleteఅమ్మ గురించి ఎంతో మంది కవులు, రచయితలూ ఎన్నో రకాలుగా వర్ణించారు...
కాని అదేంటో... ఎవరు ఎంత చెప్పినా... ఇంకా ఏదో మిగిలిపోయినట్టే అనిపిస్తుంది!
వెన్నెలకంటే చల్లనైన ... ( చూపు )
ReplyDeleteదేవుడొక అధ్బుతాన్ని సృష్టించాడు నిజం అమ్మ దేవుడు ఎప్పుడూ మనతో ఉండలేక అమ్మను మనకు ఇచ్చాడు ఎంత చక్కగా రాసారు పరిమళం గారు నేను కూడా రాసాను కొంచం చూడగలరు మీ అమూల్యమైన పలకరింపు కోసం ఎదురుచూస్తూ....శ్రీ
అద్భుతమయిన పదచిత్రాలు. ఆఅమ్మకన్న మీకు, ఆమెను ఇంత చక్కగా అక్షరగతం చేసినందుకు అభినందనలు.
ReplyDeleteఅమ్మని చాలా ముచ్చటగా వర్ణించారు. మీ శైలిలో అమ్మకి పరిమళాన్ని అద్దారు.
ReplyDeleteచాలా బాగుంది.
పరిమళం గారు, చాలా బాగా చెప్పారు/రాసారు.
ReplyDeleteఎంత క్లుప్తంగా చెప్పారో అంత అద్భుతంగా చెప్పారు.
ReplyDeletepsmlakshmi
అద్భుతమయిన వర్ణన, నిజంగా అమ్మకి ఇంకెన్ని చెప్పినా చాలవు.
ReplyDeleteచాలా అద్భుతంగా చెప్పారు.
ReplyDeleteచాలా చక్కగా రాసారండి. తక్కువ లైన్ లలోనే గొప్ప భావాన్ని పలికించారు.
ReplyDeleteబాగుందండి... అందుకే కదా అంటారు చెడ్డ తండ్రి, పిల్లలు ఇంకా ఎవరైనా వుండవచ్చు కాని చెడ్డ తల్లి మాత్రం వుండదు అని...
ReplyDeletegood parimalam garu :)
ReplyDeleteఅందరూ అమ్మ ప్రేమను పొందిన వారే ...అమ్మ గొప్పదనాన్ని తెలిసిన వారే ...
ReplyDeleteఅయినా నేను రాసిన ఈ చిన్ని కవితను మెచ్చుకొని నన్ను ప్రోత్సహించిన
మిత్రులందరికీ ...నా వినమ్ర పూర్వక నమస్సులు .
chaalaa baagundi...!
ReplyDelete