Saturday, May 16, 2009

చెలీ .....


చెలీ .....
చూపులా .... అవి నను చూసిన క్షణం
విరి తూపులై మానని గాయం చేశాయ్
తమకంతో నీ నడుమును చుట్టిన కొంగును
చూసి ఈర్ష్యతో నా గుండె భగ్గుమంది ...
చెరకువింటి విలుకాడు నా ఎదలో చేసిన
గాయం చాలదనా .... నీకీ విల్లంబులు ?
నీ నొసట కులుకు నెలవంక నడుగు
సోగ కళ్ళనడుగు .... పాల చెక్కిళ్ళ నడుగు
చిత్రకారుని కుంచెనే కదలనివ్వని
నీ నడుముకున్న ఒంపు నడుగు ....
నా గుండెకు చేసిన గాయం చెబుతాయవి !
ఐనా .... చాలదంటావా ....
నీ శరాఘాతంతో నా హృదయాన్ని చీల్చు ....
నీ కళ్ళ కొసల జాలువారే చిర్నవ్వుకే
తిరిగి పునర్జీవితుడ్నవుతా ....

7 comments:

  1. Superb.... both poem and painting.

    ReplyDelete
  2. అద్భుతమైన చిత్రానికి అంతకన్నా మించిన కవిత.

    ReplyDelete
  3. ఎంతంగా ఎక్కుపెట్టి వేసారు వలపు బాణం! మరి ఎంతటివారైనా విలవిలలాడరా, అబ్బా వెలికి రానీయకుండా ఈ భావాల్లో ముంచేస్తున్నారే, వసంతుడా ఇక మమ్ము వదలవా ఏం? ;) మాటలు చాలని మధురిమ, నిజానికి ఈ ఉదయం ఇదేమాదిరి స్పందన. మీ కవితలో ప్రతిబింబించిందిలా.

    ReplyDelete
  4. నిజం చెప్పండి.. మీరీ బొమ్మ చూసి కవిత రాశారు కదా? అతికినట్టు సరిపోయాయి బొమ్మా, కవితా..

    ReplyDelete
  5. మీ చెలి,చెలికాని భావాలు రెండూ బాగున్నాయి

    ReplyDelete
  6. @ యోనాథ్ గారు ,థాంక్స్ !

    @ పద్మగారు , మీక్కూడా చాలా థాంక్స్ .

    @ విజయమోహన్ గారు !ధన్యవాదాలండీ ..

    @ ఉష గారు , వలపు బాణం అతనికి తగిలింది కాని చెలి కరుణించిందో లేదో మరి !

    @ మురళి గారు , కనిపెట్టేశారుగా ! ఏదో వెతుకుతుంటే ఈ బొమ్మ కనిపించింది చూశాక రాసిందే కవిత .ధన్యవాదాలండీ

    @ మాలాగారూ ! ధన్యవాదాలండీ ..

    ReplyDelete