Tuesday, May 26, 2009
పునరపి జననం !!( కవిత )
మానవ జన్మం భగవంతుని వరం
వినమ్రుడవై స్వీకరించు ....
జీవితం అంతులేని ప్రయాణం
అలుపెరుగక పయనించు ....
దేవుని సృష్టి ఒక అద్భుతం
ఆ అందాన్ని ఆస్వాదించు...
పరోపకారార్ధ మిదం శరీరం
సాటి ప్రాణులపట్ల దయఉంచు...
మృత్యువొక శాశ్వత సుఖం
ఎదురాడక తలవంచు ....
తప్పనిసరి మరుజన్మం
ఇదేకదా గీతాసారాంశం !
* ఈ కవితకు శీర్షిక సరైనదో ..లేక ఈ శీర్షిక పెట్టె అర్హత కవితకు ఉందొ లేదో ..అన్న సందేహంతో ఈ టైటిల్ పెట్టటం జరిగింది. మీ సూచనలు కోరుతున్నాను .
Subscribe to:
Post Comments (Atom)
గీతా సారాన్ని సులభంగా అందించారు.
ReplyDelete"తప్పనిసరి మరుజన్మం" కాదు
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్
నాప్నువన్తి మహాత్మానస్సంసిద్ధిం పరమాం గతాః 8 అధ్యాయం 15 శ్లోకం
సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరల -దుఃఖనిలయమై అనిత్యమైనట్టి జన్మను ఎన్నటికిని పొందనేరరు.
విజయ మోహన్ గారితో ఏకీభవిస్తున్నా.. 'గీత' జన్మ రాహిత్యం గురించి కూడా చెప్పింది కదండీ..
ReplyDeletethought provoking
ReplyDelete@ విజయమోహన్ గారు , నిజమేనండీ ...కానీ ఇప్పుడు మన సామాజికంగా చూస్తె మోక్షప్రాప్తి పొందగలవాళ్ళు దాదాపు శూన్యం ఏమో అనిపించి ..ఆ ఉద్దేశ్యం తోనే తప్పనిసరి మరుజన్మం అని రాయటం జరిగింది .బహుశా చివరి లైను గీతా సారాంశం అనకుండా ....జీవన సారాంశం అని ఉండాల్సింది . మీ వివరణకు కృతజ్ఞురాలిని .
ReplyDelete@ మురళి గారు ధన్యవాదాలు . వివరణ పైన ఇచ్చాను చూడండి .
@ సకు గారు , థాంక్స్ !
మోక్షప్రాప్తి పొందగలవాళ్ళు దాదాపు శూన్యమని ఎందుకనుకోవాలి ఉన్నారేమో మనకు తెలియదు కదా !
ReplyDeleteఈ జరా మరణ పునరావృతాలు తప్పుకుని ముక్తివెదుక్కుని,మోక్షప్రాప్తి పొందటానికే కదా మానవుని ఆథ్యాత్మిక శొధన. ఇకపోతే "మన సామాజికంగా చూస్తె మోక్షప్రాప్తి పొందగలవాళ్ళు దాదాపు శూన్యం.." - ఈ విషయంలో మీతో ఏకీభవించలేను. బాహ్యస్వరూపానికీ, సామాజిక స్థితిగతుల జీవనానికి వున్న ప్రమాణాలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, మానసిక పరిపక్వతని, ఆథ్యాత్మికతని ఎంచలేవు. ఆ రెండూ సమాతరలు. ఒకరిని ఒకరు అంచనావేయగల అవకాశం, అవసరమూ తక్కువేను. మీ కవితనుండి ఈ చర్చ ప్రక్కకి జరుగుతుందని ఇక ఆపుతున్నాను. మీరు చెప్పిన "జీవన సారాంశం " మాత్రం స్ఫూర్తిదాయకం.
ReplyDelete