Wednesday, May 6, 2009

స్నేహమా ! స్నేహమేనా ??


స్నేహంలో క్షమాపణలు .....
కృతఙ్ఞతలు ఉండకూడదన్నావ్
స్నేహంలో ఎదురుచూపులేగాని
పెదవి విరుపులు ఉండకూడదన్నావ్
స్నేహంలో కమ్మటి కలలేగాని
కలహాలు ఉండకూడదన్నావ్
స్నేహంలో లోకమంతా ....
కాంతివంతమన్నావ్ !
నీకది స్నేహమేనా ??
కాని నాకు మాత్రం ....
మన పరిచయం తర్వాత
ప్రతి రేయీ 'కల ' వరమే !
ప్రతి పగలూ కలవరమే !!
స్నేహమన్న ప్రతి చోటా
ప్రేమనన్వయించుకుంటుందేం ?
పిచ్చి మనసు .......

18 comments:

  1. పిచ్చి మనసు మన మాట వినదు కదా!....దాని గోల దానిదే ... బాగుందండి

    ReplyDelete
  2. పరిమళమా ....నాకాపూలునివ్వవా ...ప్రేమ,స్నేహసౌరభాలు వెదజల్లుతున్నాయి .

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Sorry about the last one. మీ కవిత చాలా బావుంది పరిమళంగారు!

    ReplyDelete
  5. స్నేహమన్న ప్రతి చోటా
    ప్రేమనన్వయించుకుంటుందేం ?
    పిచ్చి మనసు
    chaalaa baagundi

    ReplyDelete
  6. స్నేహానికీ ప్రేమకీ మధ్య ఓ సున్నితమైన రేఖ ఉండనుకుంటానండి నేను.. బాగుంది టపా, ఎప్పటిలాగే ఫోటో కూడా..

    ReplyDelete
  7. ఆనంద్ గారు మీరు రాసిన కామెంట్ నేను పబ్లిష్ చేశాను .కానీ ఎలా తొలగించబడిందో తెలీటం లేదు .నేను డిలీట్ చేయకుండా ఎలా జరిగిందో తెలీదు . క్షమించాలి ...తిరిగి పబ్లిష్ చేస్తుంటే అవడం లేదు . క్షమాపణలతో ...తిరిగి మీ కామెంట్ ని పేస్ట్ చేస్తాను .పొరపాటు నా బ్లాగ్ లో జరిగింది కనుక మన్నించగలరు .మీ కామెంట్ ......

    స్నేహంలో ప్రేమ, ప్రేమలో స్నేహం ఎప్పుడూ కలిసే ఉంటాయి కానీ, జీవితభాగస్వామి విషయంలో మాత్రం ప్రేమ, స్నేహం రెంటినీ విడివిడిగా కోరుకుంటాం కదా. ఏమిటో, రెంటిలో ఏ ఒక్కటి దొరక్కపోయినా నష్టపోయినట్టే. సమయానుసారంగా ప్రేమ, సమయానుసారంగా స్నేహం చెయ్యగలగాలి మానసప్రియ కోసం! నేను చెప్పాలనుకున్నది రాసానని నమ్మకం లేదు. ఎందుకంటే నేను రాసింది నాకే అర్ధం కావట్లేదు. చివరికి చెప్పాలనుకున్నది ఒక్కటే, స్నేహం-ప్రేమ కాన్సెప్ట్ నా వరకు అర్ధంకావడం చాలా కష్టతరమైనది. నాకు తెలిసింది అనుభవించడం మాత్రమే! మీ కవితార్ణవాన్ని అనుభవించినట్టూ!

    ReplyDelete
  8. @ అశ్వినిశ్రీ గారు ,థాంక్స్ !

    @ శేఖర్ గారు ,మీక్కూడానండీ ...

    @ చిన్ని గారూ ! ఆ పసుపు వర్ణపు గులాబీలన్నీ మీవే .....

    @ రాధిక గారు , ఏమీ నాభాగ్యమూ ...

    @ ఆనంద్ గారు , ధన్యవాదాలు .

    @ నేస్తం గారూ ! థాంక్సండీ !

    @ మురళి గారు , నిజమేనండీ ...కాని ఆ గీత దాటి ప్రేమ వైపు పయనించే మనసులూ ఉన్నాయిగా ...ధన్యవాదాలండీ !

    ReplyDelete
  9. ముసుగు వేసుకున్న మనసుకు
    అది స్నేహం,
    అందుకుని ఆస్వాదించే మనసుకు
    తెలియదు కదా పాపం,
    మన్సు చూపకుండా దాచాలని.

    అద్భుతంగా చెప్పారు సుమా! ఎంతైనా పరిమళం కదా

    ReplyDelete
  10. స్నేహంలో ప్రేమ అనేది లేకుండా ఎలా ఉంటాదండి? నా వరకు స్నేహితుల్ని కూడా ప్రేమతో చూస్తాను.ప్రేమ లేని స్నేహం ఉంటాదా !

    ReplyDelete
  11. ఈ విషయంలో నేను చాలా మంది ని చాలా సార్లు కన్విన్స్ చెయ్యగలిగాను.
    స్నేహవీచికలు వెదజల్లే పరిమళాలు వేరు.ప్రేమ చవిచూపే మాధుర్యం వేరు.
    మామిడి పండు తరిగినప్పుడు పనసపండు వాసనరాదుగదా .దేని మాధుర్యం దానిదే.
    దేని పవిత్రత దానిదే .

    ReplyDelete
  12. స్నేహం పరిపూర్ణమైన స్థితే ప్రేమేనని నా స్వానుభవం చెప్పమంటుంది. కనుక పరిచయంతో కాదు కానీ ఒక పరిణామ క్రమంగా ఆ రెండిటి నడుమ గీత చెరిగిపోతుందేమో, ఆపై పరస్పరాకర్షణ, అభిమానం ఉత్ప్రేరకాలుగా దోహదం చేస్తాయి. ప్రేమ వరకు మనసు అక్షయం వంటిది. అది ఒక వ్యక్తితోనో, ఒక దశలోనో ఆగిపోదు. దండలో దారం వలె జీవితంలో అంతర్లీనంగా ఒక భాగం. ఇవి నా భావాలు.

    ReplyDelete
  13. snehamlo kammani kalalekani ....bagundi

    ReplyDelete
  14. "స్నేహమన్న ప్రతి చోటా
    ప్రేమనన్వయించుకుంటుందేం ?
    పిచ్చి మనసు" - Ultimate అండి.
    "స్నేహం పరిపూర్ణమైన స్థితే ప్రేమేనని నా స్వానుభవం చెప్పమంటుంది" అన్న ఉష గారి భావాలతో నేను మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇది నేను కేవలం అక్షరపూర్వకంగా చెప్పేది కాదు, అనుభావపూర్వకంగా తెలుసుకున్నది.
    ఇవి నిజంగా అక్షర సత్యాలు. ఒక పరిణామ క్రమంలో స్నేహానికి - ప్రేమకి మధ్యనున్న సన్నటి గీత మెల్లగా చెరిగిపోతుంది...

    ReplyDelete