Friday, February 27, 2009
మనసుకు రెక్కలు ....
ప్రియతమా !
నీ జ్ఞాపకాలు నాకు చేరువై
నా నిద్రను దూరం చేస్తున్నాయ్
నిన్ను చూడలేని నా కళ్లు
కన్నీళ్లను సైతం మాకొద్దని
బైటకు తోసేస్తున్నాయ్ .....
మనసుకు మాత్రం రెక్కలిచ్చి
ఈ తనువును నిస్సహాయంగా
చేసిన ఆ దేవుడ్ని తిట్టుకుంటూ
నిన్ను కలిసే క్షణాల కోసం
యుగాలు లెఖ్ఖ పెడుతూ
ఎదురు చూస్తున్నా ..........
Subscribe to:
Post Comments (Atom)
చూపులకన్నా ఎదురుచూపులే మిన్న,నిన్నటికంటే రేపేతీయన..అంటూ దూరమైన కొలది పెరుగును అనురాగం..విరహంలోనే వున్నది ఆనందమ్... అని విరహంలోని మాధుర్యాన్ని అభివర్ణించారు మన పూర్వ భావకులు.వారిదారిలో పయనిస్తోది మీ కవిత్వం. సాగించండి.
ReplyDelete-సుబ్బారెడ్డి
"నిన్ను చూడలేని నా కళ్లు
ReplyDeleteకన్నీళ్లను సైతం మాకొద్దని
బైటకు తోసేస్తున్నాయ్ ....."
..ఏం చెప్పాలో అర్ధం కావడం లేదండి.. చాలా చక్కని ఎక్స్ ప్రెషన్..
మనసు చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు కదా పాపం, బాగుంది
ReplyDeleteబాగుంది
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteఇప్పుడే మీ బ్లాగ్ లోకి తొంగి చూసానండి..ఎంతబాగా రాస్తున్నారండి ,ఇలా నేను నా డైరీ లో నా మనస్సుని రాసుకుంటుంటాను,ఎవరైనా చదివి విమర్శిస్తే భరించలేనండి ,చాలావరకు నాకే పరిమితం చేసుకుంటాను.
ReplyDeleteమీ రాతలు మీ పేరులానె పరిమళిస్తూన్నయండి .
"మనసుకు మాత్రం రెక్కలిచ్చి
ReplyDeleteఈ తనువును నిస్సహాయంగా
చేసిన ఆ దేవుడ్ని తిట్టుకుంటూ
నిన్ను కలిసే క్షణాల కోసం
యుగాలు లెఖ్ఖ పెడుతూ
ఎదురు చూస్తున్నా .......... "
........
@ సుబ్బారెడ్డి గారూ! విరహంలో క్షణాలు యుగాలవుతాయ్ ,కలిసిన తర్వాత గంటలు ,రోజులూ ....క్షణాలై సాగిపోతాయ్ .మీ వ్యాఖ్యతో నా కవిత కు మరిన్ని రంగులద్దారు .ధన్యవాదాలు .
ReplyDelete@ మురళి గారూ ! థాంక్సండీ .
@ లక్ష్మి గారూ ! బాగా చెప్పారు ధన్యవాదాలండీ .
@ నరసింహగారూ ! ధన్యవాదాలు సర్ !
@ విజయమోహన్ గారూ ! మీ చేత రూపు దిద్దుకున్న కన్నయ్య కంటే కాదండీ .ధన్యవాదాలు .
@ చిన్ని గారూ !బ్లాగ్ కూడా ఓపెన్ డైరీ లాంటిదే ,అన్నీ కాకపోయినా కొన్ని మీవంటి మిత్రులతో పంచుకునే ప్రయత్నం .అంతే .......ఇలాగే అప్పుడప్పుడూ నా బ్లాగ్ లోకి తొంగి చూడటం మర్చిపోకండీ ....
@ దిలీప్ గారూ ! కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ .
అద్భుతమైన కవిత పరిమళం గారు
ReplyDelete