ఓ ప్రేమికుల రోజు ........
నా ప్రేమను నీముందు పరచాలని ,
మాటల్లో చెప్పలేని భావాల్ని ,
అక్షరాలుగా పొదిగి ....
అందమైన గ్రీటింగ్ కార్డ్ ని
కవర్ నిండా నింపిన గులాబీ రేకులతో
నీకిస్తే ......ఏం చేశావ్ ?
జల జలా రాలిన పూరేకుల్ని
చెత్తబుట్ట పాలు చేశావ్ ,కార్డ్ ని
డెస్క్ లో ఓ మూలకి విసిరేశావ్ .
వాటి మధ్య పదిలంగా అందించిన
నా హృదయాన్ని .......
స్వీకరించావో ....లేదో ....తెలీదు
ఇష్టం లేదో .....లేక ధైర్యం లేదో ....తెలీదు
నీ దృష్టిలో అవి......
కేవలం వాడిపోయే పూలూ ,
చిరిగిపోయే కాగితం కావచ్చు
గాయపడిన నా మనసునడుగు
వాటి విలువెంతో ?
జీవితంలో నీకొక తోడు దొరకొచ్చు
నాకొక నీడా దొరకొచ్చు ......కాని
మన ఈ చిన్న పరిచయం .....
మరువలేని తీపి (???) జ్ఞాపకం !!
Friday, February 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
గులాబిరేకులు అందిచిన చేతికి ముళ్ళు గుచ్చుకోవడం బాధించే విషయం..
ReplyDelete@PRARIMALA:MEEKAVITA BAGUNDI,MEE BAAVUTAA NAA
ReplyDeleteJOHARLU.KAVITALU RAYATAM LO MEEKU MERE SAATI.
@MURALI Garu kavata kanke bagundi mee coment.
నిర్లక్ష్యాన్ని అరాయించుకొవడం చాలా వేదనతో కూడినది. ఈ విషయాన్ని వ్యక్తీకరించడంలో మీరు సఫలమయ్యారు. అభినందనలు.
ReplyDeleteఅర్దం కానిది మన భాషే సుమా, యంత్రాల మధ్య యంత్రంలా బ్రతికే మనసుకు.
ReplyDeleteఅర్దమయ్యె సరికి దగ్గర కాలేనంత దూరం వెళ్ళిపోతామేమో.
చాలా అర్ద్రతో చెప్పారు.