నీ నిర్లక్ష్యం వల్ల .....
ఆకాశం విరిగి పడలేదు
భూమి కంపించిపోలేదు
నక్షత్రాలు రాలి పడలేదు
గాలి స్థంభించి పోలేదు .....
సూర్యుడు వెలుగునిస్తూనే ఉన్నాడు ,
చంద్రుడు వెన్నెల వెదజల్లుతున్నాడు ...
బాల్కనీలో పావురాళ్ళూ ,
ఎక్వేరియంలో చేపలూ ,
స్కూలుకెళ్ళే పిల్లలూ ,
ఆఫీసుకెళ్ళే పెద్దలూ ,
గజీ బిజీ ట్రాఫిక్ .....
అంతా మామూలుగానే ఉంది .
కాని
నా మనసే ముక్కలైంది .
నువ్వు మాత్రం వెనుతిరిగి
చూడకుండానే వెళ్లిపోయావ్
నా గుండె పగిలిన చప్పుడు ....
నీకు వినపడ లేదో ....ఏమో .....
Monday, February 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
Hi Anu gaaru, chaala baaga raasarandi..
ReplyDeleteoka maatalo cheppalante, "mose vaadike telustundhi kaavadi baruvu" ani cheppakane chepparu... gud :)
బాగా చెప్పారు నిర్లక్ష్యం ఎంతగా కృంగదీస్తుందో. అభినందనలు.
ReplyDeleteఅబ్బా.. ఎంత చక్కని వ్యక్తీకరణ..!!
ReplyDeleteచాలా బాగుందండి ,...
ReplyDeleteమీ కవితని ఏదో ఇలా కింది ముక్కలతో పూర్తి చెయ్యలనిపించింది !!
....
నీ నిర్లక్ష్యం , నా మనొవేదన, కలసి ,
కాలాన్ని జయించలేకపోయాయి,
నేను ఇప్పుడు ఒక పడిలేచిన కెరటం,
నా లక్ష్యన్ని దరిచేర్చిన ని నిర్లక్ష్యానికి నా జోహార్లు !!!
చాలా బాగా రాసారు మంచి కవిత
ReplyDeleteadirindi.
ReplyDeleteనువు చూసింది నింగి కాదు
ReplyDeleteనీకై నిండిన నా ప్రేమ -- అది విరగదు
నీ లేత పాదాలు కందక
నువు నిల్చున్నది నా అరచేతిలో -- అది కంపించదు
అవి తారలు కాదు రాలడానికి
నీకై నా నిండిన కనుదోయి -- అవి రాలవు
నిను తాకిన గాలులు.. చెలీ
నా శ్వాశలు .. అవి ఆగవు -- నీకై అవి ఆగవు
ఇక పిల్లలు పెద్దలు పావురాళ్ళంటావా
ఎవరి బ్రతుకు వారిది.
మన బ్రతుకులే ఒకరి కోసం ఒకరివి.. కాదంటావా ?
ముక్కలయిన నీ మనసు చూశావు గానీ
నిండిన కన్నులతో వాటినేరుకుంటున్న
నన్నెలా చూడలేదు ?
నీ గుండె నాకెప్పుడో ఇచ్చావుగా..
ఆ పగిలిన శబ్దం నీ గుండెది కాదు చెలీ
వెను తిరిగి అది నీకు చూపలేకే
ఈ నా పరుగు.. నీ నుండి దూరంగా
నీ మనసు ముక్కలు పొదువుకుంటూ
నా గుండె బీటలు కుట్టుకుంటూ..
@ మహేష్ !థాంక్యూ !
ReplyDelete@ మాలతి గారు ,ధన్యవాదాలండీ .
@ రమణ గారు , నిర్లక్ష్యాన్ని లక్ష్యంతో జయించ వచ్చని చక్కగా చెప్పారు.కృతజ్ఞతలు .
@ నేస్తం కవిత నచ్చినందుకు థాంక్స్ .
@ సుభద్ర గారు !ఇదే మొదటిసారనుకుంటా నా బ్లాగ్ కి రావటం .ధన్యవాదాలండీ .
@ ఆత్రేయ గారూ !ఏవో కారణాల వల్ల తాత్కాలికంగా చివుక్కు మనిపించిన మనసుకు శాశ్వతమైన ప్రేమతో సేదతీర్చిన మీ కవిత చదివినప్పుడు కన్నీళ్ళా గలేదండీ .అందరిలో కవి వుండక పోవచ్చు ,కాని మీ కవిత లోని భావన ప్రతి ప్రేమించే హృదయం లోనూ ఉంటుంది .అదేగా మరి బంధాన్ని నిలుపుతోంది .మీ కవితతో నా వనాన్ని ,నా హృదయాన్ని కూడా మరింత పరిమళ భరితం చేసినందుకు ధన్యవాదములండీ .
ReplyDeleteఅణువులో ఆకాశమంత భావం!!
ReplyDeleteరమణ గారి ముగింపు కూడా నాకు నచ్చింది.
బాగుంది...
ReplyDeleteచాలా బాగుందండీ... :)
ReplyDeleteపరిమళం గారు
ReplyDeleteమీ కవిత చాలా బాగుంది.
మంచి ఫీల్ ఉంది.
ఆత్రేయ గారు మీ కవితను కొత్త మలుపు తిప్పటం అత్యద్భుతం.
@ మందాకిని గారూ !అవునండీ !రమణ గారి కొనసాగింపు ఉత్తేజ భరితంగా ఉంది .ధన్యవాదాలండీ .
ReplyDelete@ చైతన్య గారూ ! థాంక్యూ !
@ ప్రేమికుడు గారూ !నా టపా నచ్చినందుకు ధన్యవాదాలండీ .
@ బాబా సర్ !చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ లో మీ కామెంట్ !ధన్యవాదాలండీ .ఎంతైనా ఆత్రేయ గారు ఆయనకాయనే సాటి కదండీ .ఆయనకు మరోసారి ధన్యవాదములు .
నిర్లక్ష్యాన్ని నిర్లక్షం చేసి
ReplyDeleteద్వేషాన్ని ద్వేషించి
ప్రేమను ప్రేమించి
జీవితాన్ని జీవిద్దాం
చిన్న చిన్న మాటలతో సముద్రమంత భావాన్ని చెప్పారు. అధ్భుతం
ఇక ఆ సముద్రానికి అవతల ఒడ్డును చూపించిన ఆత్రేయ గారి కవిత కూడా చాలా బాగుంది
మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారూ ! స్వాగతమండీ. ఇంత మంచి కొటేషన్ తో నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదాలండీ .
ReplyDeleteపగిలిన గుండె చప్పుడ్లను పట్టించుకోకున్నా,
ReplyDeleteపరిహసించి ప్రగల్బాలు పలుకుతున్నా,
వెర్రితనం నన్ను వెక్కిరిస్తున్నా,
ఒక క్షణాన నీ నిర్లక్ష్యపు నీడలు నిప్పులా నన్నంటుకున్నా
ముక్కలైన మనసుతో ఇంకా ముచ్చడించుకుంటున్నాను
ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమగోడ కట్టింది నీవేనని.
@ పృథ్వీ గారూ !నాబ్లాగ్ కు స్వాగతమండీ .నా కవితకు అందమైన కొనసాగింపు నిచ్చినందుకు ధన్యవాదములండీ .
ReplyDeleteపరిమళం గారు
ReplyDeleteబాగుంది...
చాలా బాగుంది మీ కవిత..
మీ కవితకు ఇక్కడ ఉన్న వారు ఇచ్చిన అందమైన కొనసాగింపులు కూడా బాగున్నవి..
All the best!..
చాలా బాగుందండి. ఆత్రేయ గారి ఎక్స్టెన్షన్ ఇంకా బాగుంది.
ReplyDelete@ మాధవ్ గారూ !థాంక్స్ !
ReplyDelete@ శ్రీ గారూ !థాంక్సండీ .ఇక ఆత్రేయ గారి కవితతో నా బ్లాగ్ నిజంగానే పరిమళించింది .