
నేస్తం !
ఎలా ఇలా మారిపోయావ్ ?
ఒకప్పుడు నా చెంగు నిండా నింపుకున్న
నీ నవ్వుల పారిజాతపూలు .....
ఇప్పుడు నిప్పురవ్వలై పోయాయేం ?
ఒకప్పుడు నేను తడిసి మురిసిన ,
నీ చూపుల వెన్నెల కిరణాలు .......
ఇప్పుడు తూటాలై నా గుండెలో
మానని గాయం చేస్తున్నాయ్
నువ్వు రాని ఈ వాకిలీ,
పరిమళించని పారిజాతాలూ,
పూజలేని రాధా కృష్ణులూ,
నిర్జీవమైన నేనూ ........
అన్నీ .......ఇవన్నీ .......
తిరిగి రాని మన స్నేహానికి సాక్ష్యాలు !
విరహము కూడా సుఖమే కాదా ..నిరతము చింతన మధురము కాదా..వియోగవేళల నిలిచే ప్రేమల విలువలు కనలేవా.. అంటూ మన వారు వియోగవేళలను కూడా మధురంగా మార్చుకునే టెక్నిక్ ను భోధించారు.ఏమైతేనేం మీ వియోగ భరిత భావవీచిక బావుంది.
ReplyDelete-సుబ్బరెడ్డి
ohhhhhhhh kekandi.....
ReplyDeletemeee bhaabukata ki naa namskaralu.
chalaa baagundi.
Touch chesaaru!!
ReplyDeleteతీయనిబాధని కవిత చేశారు. ఆనేస్తం తిరిగొచ్చినవేళ ఎలా వర్ణిస్తారో చూస్తాను.:)
ReplyDeleteజ్నాపకాలు పేరుతో నేను నా బ్లాగులో రాసిన కవితకు ఈ కవితకు భావాలు కలవటం ఆనందంగా ఉంది. చాలా బాగా రాశారు. అభినందనలు.
ReplyDelete@ సుబ్బా రెడ్డి గారూ !ధన్యవాదాలండీ ...మీ కామెంట్ కు మాత్రమే కాదు ఇంత మంచి పాటను గుర్తు చేసినందుకు కూడా ..
ReplyDelete@ సుభద్ర గారూ ! బోల్డన్ని థాంక్యు లండీ .
@ పద్మ గారూ మీక్కూడా .....
@ మాలతి మేడం !ధన్యవాదాలు .
@ ఆత్రేయ గారూ ! మీ కవితతో పోలికా ?భావం ఏదైనా రాసే చేతిలో ఉంటుంది మరి మీ కాలంలో ఏ సిరా పోసి రాస్తారో ....భావుకతా .....కాస్త చెబుతారా గురువు గారూ !
మీ జ్ఞాపకాలు చదివాను .భావ ప్రకటన అద్భుతంగా ఉంది .మీ "ఫోటో "చాలా చాలా నచ్చింది .ధన్యవాదాలు .
చాలా బాగుంది పరిమళం గారు :)
ReplyDeletemii prasna ku samaadhaanam naa blaagu lO iccaanu cuuDanDi. naa "Photo" kavita naccinanduku dhanyavaadaalu.
ReplyDeleteమీ కవిత చాలా బావుందండీ! నిరీక్షణ లో అందముంది
ReplyDelete