Tuesday, February 24, 2009
దాంపత్యం సాఫల్యత ....
** చాలా సంవత్సరాలై ఉంటుంది రంగ నాయకమ్మగారి "అంధకారంలో "అనే నవల చదివాను .దానిలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలని .........
సంగీతాలూ ,చిత్రలేఖనాలూ మాత్రమే కలలనుకుంటాం .కాని హాయిగా జీవించడం కూడా గొప్ప కళే .ఆ కళలో మనం నిష్ణాతులం కావాలంటే జీవితాన్ని గౌరవించి ,ప్రేమించడమే దానికి మార్గం .
పెళ్లి అనేది సాంఘిక బంధమూ ,శారీరక బంధమే కానీ అది మానసిక బంధం కాదు .భార్యని శాశ్వతంగా భర్తతో ఐక్యం చేయగలిగేంత బలీయమైన మధుర స్మృతులు ఏవీ లేకపొతే దాంపత్యం విఫలమౌతుంది . సంసారంలోని మధురిమనూ అనుభవించలేరు .
వివాహం రెండు వ్యక్తిత్వాల కలయిక ,రెండు మనస్తత్వాల కలయిక ,రెండు సంస్కారాల కలయిక .పెళ్ళవగానే సుఖాలూ ,ఆనందాలూ తరుముకుంటూ రావు .భాగస్వామిలో ఏదో నచ్చుతుంది ,మరేదో నచ్చదు .ఎదుట వ్యక్తికోసం తను కొంత మారాలి ,తన కోసం ఎదుటి వ్యక్తిని కొంత మార్చుకోవాలి .సామరస్యంతో ,బాధ్యతతో ......ఇద్దరిదీ ఒకే జీవితంగా చేసుకోవాలి .అప్పుడే దాంపత్యం సాఫల్యం చెందుతుంది .
భార్యా భర్తల మధ్య అనురాగం సంధ్యా రాగం అంత అందంగా .....మల్లెపువ్వంత పరిమళంగా .....పాల వెన్నెలంతా స్వచ్చంగా ఉండాలి .
Subscribe to:
Post Comments (Atom)
ఇంత మంచి వ్యాక్యాలు రాసిన రంగనాయకమ్మగారేనా ప్రేమ బంధాన్ని తెలిపే రామాయణాన్ని విషవృక్షంగా అభివర్ణించినది ???
ReplyDeleteబాగున్నాయండీ..
ReplyDelete"సంగీతాలూ ,చిత్రలేఖనాలూ మాత్రమే కలలనుకుంటాం ..."
ReplyDeleteకళ, కల - రెండూ వేఱు కదా ?
మీరెక్కడో పొఱపడ్దారు. మదమంటే పొగరు. ఈ అష్టమదాల్నీ (పొగర్లనీ) సత్ పురుషులు వదిలించుకోవాలనే పెద్దలు చెప్పారు. అంతేతప్ప వాటిని పెంపొందించుకోమని కాదు. ఇవి పరిపూర్ణ పురుష లక్షణాలు కావు. పరిపూర్ణ దుష్టలక్షణాలు.
ReplyDeleteమంచి విషయాలు.
ReplyDeleteరంగనాయకమ్మ గారు కొన్ని కొన్ని చోట్ల భలేగా రాశారు. ఆవిడ రచనల్లో కథలో ఏం జరిగింది, పాత్రలకి ఏం జరిగింది అనే కంటే ఇటువంటి అబ్జర్వేషన్లే ఎక్కువ విలువ కలిగి ఉంటాయి.
@ వేణు శ్రీ గారూ ! థాంక్స్ .
ReplyDelete@ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారూ !ధన్యవాదాలండీ !అది కళే నండీ .పొరపాటుగా టైపు చేయడం జరిగింది .
తర్వాత మదము అంటే గర్వమే ....కాని ఏవిషయంలోనైనా పరిపూర్ణత్వం ఉంటేనే గర్వం ఉంటుంది అనే అర్ధం తో అలా రాయటం జరిగింది . అష్టమదములూ పురుషునికి ఉండాల్సిన లక్షణాలే కదా !అవి సంసారికి అవసరం కదా !పైగా వాటిని సత్ప్రవర్తనతో వినియోగించుకోవాలని కూడా చెప్పారు .ఇది నేను ఒక పుస్తకంలో చదివి రాసినదే .టపాలో * గుర్తు ఒకసారి చూడగలరు .నిశింత గా గమనించి కామెంట్ రాసినందుకు మరోసారి ధన్యవాదాలండీ .
పెళ్ళంటే సర్దుకు పోవడమే! వివాహం ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులూ కలిసి ఉంటాయని చక్కగా చెప్పారు.
ReplyDelete@ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారూ !
ReplyDelete@ కొత్త పాళీ గారూ !
ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు .ఆవిడ రచన నేను చదివింది ఒక్కటే .అదీ చాలా చిన్న వయసులో .....పేరుకూడా గుర్తు లేదు .నాకు నచ్చి నోట్ చేసుకున్న కొన్ని వాక్యాలు .
@ శ్రీ గారూ ! చక్కటి పోలిక .థాంక్స్ .
ఇక్కడ నిన్న నేనో కామెంట్ రాశానండి..ఏమైందో.. రంగనాయకమ్మ గారి రచనలు కాలం కన్నా ముందు ఉంటాయనిపిస్తుంది..ఆవిడ కమిట్మెంట్ బాగా నచ్చుతుంది.. మంచి టపా..
ReplyDeleteపరిమళం గారూ,
ReplyDeleteచక్కటి మాటల్ని తెలియచేశారు. ధన్యవాదాలు.
ఎంతైనా.. మీకు చక్కటి అభిరుచి ఉంది సుమా..!
అయితే మీరు రంగనాయకమ్మ గారిది ఈ ఒక్క పుస్తకమే చదివారన్నమాట.
నేను ఇది చదవలేదు గానీ.. స్వీట్ హోం -1 చదివాను. చాలా బావుంటుంది. నేను చదివింది కూడా అదొక్కటే.
వీలైతే ట్రై చేయండి. స్వీట్ హోం-2 కూడా పేజీలు తిప్పాను. కానీ, నచ్చలేదు. అసలు కథ కంటే మొత్తం వాదాలు (అవి కమ్యూనిజం ఏమో మరి.. గుర్తు లేదు సరిగ్గా) ఉంటాయి. నేను చదివి ఐదేళ్లు దాటింది.
నేను యండమూరివి తప్ప మిగతావాళ్ళవి మరీ ఎక్కువ చదవలేదు.
కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను క్షమించండి. రంగనాయకమ్మలాంటి గొప్ప మార్క్సిస్ట్ కేవలం పడకకుర్చీ మేధావిగా మిగలడం దురదృష్టకరం. ఆమె మానవసంబంధాలను గొప్పగావూహించారు,విశదీకరించారు.కాని బోధించలేక పోయారు.సకల మానవ దోపిడిని గ్రహించారు,ప్రచురించారు,కాని పోరాటంలోకి రాలేకపోయారు.ఏమైతేనేం మీద్వారా రంగనాయకమ్మ అంతర్జాలిని అయ్యారు.
ReplyDelete-సుబ్బారెడ్డి
@ మురళి గారూ ! మీ కామెంట్ రాలేదండీ .....ఇంత శ్రద్ధగా మళ్ళీ రాసినందుకు ధన్యవాదాలండీ .
ReplyDelete@మధురవాణి గారూ !నేనూ ఎక్కువ చదివింది , ప్రపంచం గురించి కాస్త తెలుసుకున్నదీ యండమూరి గారి రచనలలోనే .థాంక్యూ .
@సుబ్బారెడ్డి గారూ !ఆలస్య మైనా మీవంటి వారి కామెంట్స్ మాకు ప్రోత్సాహాన్నిస్తాయి . మీద్వారా రంగనాయకమ్మgaari గురించి మరికాస్త తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది .ధన్యవాదాలు సర్ .
మీగురి౦చి మీరు పరిచయ౦ చేస్కున్న తీరు చూసి నాకు ఇద్దరు గుర్తొచ్చారు పరిమళగారు. ఒకరు ఈ మధ్యనే పెళ్ళి చేస్కుని ఆన౦ద౦గా కొత్త స౦సారాన్ని అనుభవిస్తున్న మా అక్క. (మా పెద్దమ్మగారి అమ్మాయి). రె౦డు, బాగా ఎదిగి అ౦తగా ఒదిగిన ఓ పేద్ద చెట్టు. మీ ఒదిగినతన౦ మీ పరిచయ౦లోనే కాద౦డీ, మీ కవిత్వ౦లో కూడా కనిపి౦చి వినిపి౦చి మైమరిపిస్తో౦ది. ఎదిగే కొద్దీ ఒదగాలి అ౦టారు. కాని మీలోని కవిత్వ౦ ఒదిగే కొద్దీ ఎదగుతు౦ది. అ౦టే నా ఉద్దేశ్శ్య౦, మీరు ఎ౦త సులువు పదాలతో రాస్తారో, అ౦త భావుకత కనిపిస్తు౦ది మీలో. మీ పదాలవల్ల ఆర్ధ్రతకీ భారీతనానికి తేడా తెలుస్తో౦ద౦డీ. మరో రె౦డు నెలల్లో పెళ్ళి చేస్కోబోయే నాకు మీరు రాసిన ఏమాటలు చాలా ఉపయోగపడతాయి అని నా నమ్మక౦.
ReplyDelete@ ఆనంద్ గారూ ! మీ అక్క గుర్తొచ్చారన్నారు .చాలా సంతోషం .ఆపై మీరన్నవి మీ అందరి అభిమానం ,ప్రోత్సాహం .అంతే కానీ నా గొప్పతనం కానేకాదు .ఇక్కడ ఎందఱో మహామహులున్నారు .వారంతా నేను తెలిసీ తెలియక రాసే పోస్ట్ లను చదివి ,కామెంట్స్ రాసి ప్రోత్సహిస్తున్నారు .మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినే .త్వరలో మీ వివాహమన్నారు .శుభాకాంక్షలు .మీ దాంపత్యం కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను .
ReplyDelete