Wednesday, February 18, 2009

పరిపూర్ణ పురుషుడు

స్త్రీ ......

కార్యేషు దాసీ ,కరణేషు మంత్రీ ,
రూపేచ లక్ష్మీ ,క్షమయా ధరిత్రీ ,
భోజ్యేషు మాతా,శయనేషు రంభా ,
షడ్ధర్మ యుక్తా కుల ధర్మ పత్నీ .

భర్తకు సేవలు చేసేటప్పుడు దాసీ గాను ,గృహ విషయములందు ,ధర్మ కార్యములలోను మంత్రి వలె సలహాదారు గాను ,రూపములో లక్ష్మీ దేవి వలెను ,సహనము చూపుటలో భూదేవి వలెను ,భర్తకు ,అతిధులకు భోజనం పెట్టునపుడు తల్లి వలెను ,భర్తతో శయనించు వేళ రంభ వలెను ........ఈ ఆరు లక్షణములు ఉన్న స్త్రీని ధర్మపత్నిగా చేసుకో దగిన పరిపూర్ణమైన స్త్రీగా వర్ణించారు .

అలాగే పురుషునికి ఉండాల్సిన ఎనిమిది లక్షణాలు .........

అన్న మదము , అర్ధ మదము ,
స్త్రీ మదము , విద్యా మదము ,
కుల మదము , రూప మదము ,
ఉద్యోగ మదము ,యౌవన మదము .
ఈ అష్ట మదములూ కలిగిన వాడు పరిపూర్ణ పురుషుడని పెద్దలు చెప్తారు .

వీటితో పాటూ ....చతుర్విధ పురుషార్ధములలోనూ ,ధర్మ ప్రవర్తన కలిగి ,ఈర్ష్యా స్వభావము లేక ,దయ ,కరుణ, ఓర్పు కలిగి ,మధుర మైన వాక్కునూ ,సత్ప్రవర్తనను కలిగి ఉండవలెను .శ్రమ పడుటకు వెనుదీయక ,ధైర్య సాహసములు కలిగి కీర్తి ,సంపదలు సంపాదించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నము చేయువాడు ఉత్తమ పురుషుడు .

* పేరు గుర్తు లేదు ఎప్పుడో చదివిన పుస్తకం నుండి ........తప్పులుంటే మన్నించగలరు .

14 comments:

  1. బాగుంది. అందులో సగం లక్షణాలు ఇరువురికీ ఉన్నా సంతోషంగా ఉండవచ్చు.

    అప్రస్తుతమయినా ఒక జోక్ - ఈ కాలపు IT కుర్రాడు ఆ ఆరు లక్షణములు ఉన్న IT అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అంటే పెళ్ళయిన అతడి కొలీగ్ "ఆరుమందిని పెళ్ళి చేసుకోవడానికి చట్టాలు వప్పుకోవు" అన్నదట.

    ReplyDelete
  2. chaalaa baaga chebutunnaaru parimalam gaaru

    ReplyDelete
  3. hmm.. Chaala baaga cheppaaru..

    Nenu Shtree gurunchi chadivaanu, kaani purusha lakshanaalani chaduvaledu. :). thanks for your info/post.

    ReplyDelete
  4. మీలాంటి భావకులు,ఇలాంటి పురాతన స్త్రీ పీడక సాహిత్యాన్ని ప్రమోట్ చేయరాదు.సృష్టికారిణి ,మహాబల అయిన స్త్రీ ఆధిపత్యాన్ని కొల్లగొట్టె ప్రయత్నంలో పురుషుడు ఆశ్రయించిన ఒకానొక ప్రక్రియ ధర్మశాస్త్ర ప్రచారం.అందులో మనుధర్మ శాస్త్రం పూఊర్తిగా పిత్రుస్వామ్య భావజాలాన్ని పాదు కొల్పేందుకు తయారు చేసిన బలమైన పురుష సామ్య సిద్దాంతగ్రంధం.అందులో నస్త్రీ స్వాతంత్రమనర్హతి అంటూ మొదలు పెట్టి,వంటమనిషిగా,కూలిమనిషిగా,శృంగార ఉపకరణంలా మొత్తం మీద పురుషుది సేవకురాలిగా వ్యక్తిత్వం లేని ఝడురాలిగా తయారు చేయడమే ఆసాహిత్య పరమావధి.కాబట్టి మీకు ఆతరహాప్రచార భాద్యత ఏల. మీకు తెలియదు అని కాదు గాని నాహృదయ ఘోష ఇలా అక్షరాలను వర్శించింది
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  5. స్త్రీ అయినా, పురుషుడయినా అన్నీ ఉత్తమ లక్షణాలే ఉన్నవాళ్ళు ఈ కలియుగంలో దొరకటం సాధ్యమే అంటారా? అలా దొరికినా అంత మంచితనాన్ని తట్టుకోగలిగే శక్తి నిజంగా మనలో ఉందా? ఏంటో నాకన్నీ డౌట్సే, క్షమించండి

    ReplyDelete
  6. ఇందులో మదము కి విశేషార్ధమేమైనా వుండవచ్చేమో. లేక సాధారణ అర్ధమే అయితే అన్ని మదములతో కూడుకున్న పురుషుడిని చేసుకున్న సాధారణ స్త్రీయే కాదు, మీరు పేర్కొన్న పరిపూర్ణ మహిళ కూడా భరించలేదనుకుంటున్నాను.
    psmlakshmi
    psmlakshmi.blogspot.com

    ReplyDelete
  7. స్త్రీ కి ఉండాల్సిన లక్షణాలు ఇలా ఉండాలి అని చెప్పినంత మాత్రాన ఆమెను తక్కువ చేసినట్లు కాదు,
    స్నేహితురాలిగా, మంచి ఆలోచన కర్తగా, తల్లిలా ఆదరించి ఇల్లాలిగా ఆనందిప చేయాలని అర్దం. నిజమే ఇన్ని లక్షణాలు కలిగిన స్త్రీ ని ఏ పురుషుడు వదులుకోడు. మరి ఎక్కువగా గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. అంతేకాని ఇందులో అపార్దం చేసుకోవడానికి, కించ పరిచారనుకోవడనికి నాకైతే ఎమి కనిపించలేదు.

    పరిమళం, మంచి మాట మరోసారి గుర్తు చేసినందులకు ధన్యవాదాలు

    ReplyDelete
  8. ఈ కలియుగంలో దొరకటం సాధ్యమే అంటారా?....అప్పట్లో, యద్దనపూడి సులోచనారాణి గారి నవలల్లో దొరికేవారు.

    ReplyDelete
  9. @ జీడిపప్పు గారూ ! అప్రస్తుత మేముందండీ ! కాలానుగుణమైన జోక్ ! ధన్యవాదాలండీ .

    @ నేస్తం గారు ,థాంక్స్ .

    @ మహేష్ !స్త్రీ గురించి చాలా మంది చదివి ఉంటారనే ఉద్దేశ్యం తోనే టైటిల్ అలా పెట్టాను .నచ్చినందుకు థాంక్స్ .

    @ సుబ్బారెడ్డి గారూ !ముందుగా మీకు ధన్యవాదములండీ . స్త్రీల స్వాతంత్ర్యం ,స్వేచ్ఛను గౌరవిస్తూ రాశారు .మనుధర్మ శాస్త్రం స్త్రీ కి స్వాతత్ర్యం కూడదన్న మాట నిజం . మాతృస్వామ్య వ్యవస్థ నుండి ,పితృ స్వామ్య వ్యవస్థ కు సమాజం వచ్చినా ,దానివల్ల పురుషునికి ఆధిపత్యం తో పాటూ బాధ్యతలూ పెరిగాయి కదా ?స్త్రీ తనవాళ్ళకు చేసే పనులు దాసిగా భావిస్తే ,మరి పురుషుడు తన భార్యా ,పిల్లల కోసం సంపాదించడం వారికి చేసే కూలి ,ఊడిగం అవుతుందా ? నేను చెప్పదలచుకున్నదేవిటంటే స్త్రీ నుండి ఇటువంటి లక్షణాలు ఆశించే పురుషుడు ,తనెలా ఉండాలో తెలుసుకోవాలని .
    ఇప్పుడు స్త్రీలు అక్కడక్కడా వివక్షకు గురవుతున్నా ,మునుపటికంటే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు .పైన చెప్పిన వ్యక్తిత్వం గల పురుషులుంటే ,స్త్రీ తానే మనస్పూర్తిగా అంకితమైపోతుంది .స్త్రీ హృదయం మాతృ హృదయం కదా .ఇక ప్రచారమంటారా ?పురుషులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకొందుకు స్త్రీ ఎలా ఉండాలో ప్రచారం చేశారు తప్ప ,పురుషుదేలా ఉండాలనేది ప్రాచుర్యంలోకి తేలేదు .అందుకే కొద్దిమందైనా తెలుసు కుంటారని ఈ చిన్ని ప్రయత్నం .అందుకే స్త్రీ అని కాకుండా పరిపూర్ణ పురుషుడని టైటిల్ పెట్టాను .మీవంటి విజ్ఞులతో తర్కించే పరిజ్ఞానం లేదు కాని ఈ టపా తో నేనేం చెప్పాలనుకున్నానో తెలియ చేయటం కోసం ఈ తాపత్రయం .మన్నించగలరు .స్పందించి నందుకు ధన్యవాదాలండీ .

    ReplyDelete
  10. @ లక్ష్మి గారూ !మీరన్నట్టు దొరకడం కష్టమే ....కాని కొన్ని వాటిలో కొన్ని లక్షణాలైనా ఇరువురూ అలవర్చుకుంటే బావుంటుంది కదండీ !

    @ దీపతేజ గారూ ! వాటితో పాటు క్రింది లక్షణాలు కూడా ఉంటే భరించడమేవిటండీ ...అదృష్టమైతేనూ .....
    ఇక్కడ మదము అంటే పరిపూర్ణము అనే అర్ధంతో వాడి ఉండొచ్చు .

    @ శృతి గారూ ! నా మనసులో ఉన్నదే మీరు చెప్పారు . అణిచి వేయాలనుకుంటే ,హృదయంలో రాణి గాను ,వివేచనలో మంత్రిగాను ఎందుకు స్థానమిస్తారు ? ధన్యవాదాలు .

    @ శ్రీధర్ గారూ ! థాంక్స్ .

    @కృష్ణా రావు గారూ !మీరన్నది పురుషుల విషయంలో నిజమేనండీ .కాని ఆవిడ నవలల్లోని స్త్రీలు రుద్రకాళి లాగ కోపిష్టులై ఉంటారు .దానికి ఆత్మాభిమానం అని పేరు .నేను చదివింది కొన్నేనండీ .ఒకవేళ మిగిలిన వాటిలో బావుంటారేమో .....మీ స్పందనకు ధన్యవాదాలండీ .

    ReplyDelete
  11. ఆసక్తి కరమైన భావాలూ చర్చానూ.
    యద్దనపూడి నవలల్లో ఈదేశం మాకేమిచ్చింద్ నవల్లో నాయిక మంచి బలమైన వ్యక్తిత్వంతో ఉంటుంది. ఆ పాత్ర పేరు గుర్తు లేదు.

    ReplyDelete
  12. @ కొత్తపాళీ గారూ ! ఆ నవల నేను చదవ లేదండీ . ధన్యవాదములు .

    ReplyDelete
  13. పరిమళం గారు,
    చాలా బాగుందండి.
    నాకేం చెప్పాలో తెలియట్లేదు కానీ... నాకైతే చాలా చాలా నచ్చేసింది.
    ఎప్పటికైనా పనికొస్తుందని ఈ టపాని నా e-లైబ్రరీలో భద్రపరచుకుంటున్నాను.

    మీరు ఇలాగే రాస్తూ ఇంకా మంచి మంచి విషయాలు మాకు తెలియపరుస్తూ ఉండాలని ఆశిస్తున్నాను...

    -ప్రణవ్

    ReplyDelete