Sunday, February 22, 2009

ఆక్రోశం......











నీ
పరిచయానికి ముందు .....
నా ప్రపంచం రంగుల మయం
తర్వాత ఎప్పుడావరించిందో
నా చుట్టూ ఈ శూన్యం
నా ఊహల కోటకు నిన్ను
మహారాజును చేస్తే .....
నా సంతోషానికి సమవర్తివై ,
నన్ను శ్రావణ మేఘాన్ని చేశావ్
నేను కట్టుకున్నది ఇసుక కోటని
తెలుసుకునే సరికి ..........
రెక్కలు తెగిన పక్షినై
నేలకొరిగాను .

9 comments:

  1. సముద్రపు వొడ్డున కట్టుకున్న ఇసుక కోటలు తీరం దాటి వచ్చిన కెరటానికి బలి కావలిసిందే అలాగే పెళ్ళికి ముందే ప్రేయసి అందచందాలు అదే సముద్రపు వొడ్డున వెన్నెల్లో ప్రియుడికి ఆశు కవితలు తెప్పిస్తే పెళ్లయ్య క కనిపించే భాద్యతలు ,తల్లి దండ్రుల తలదూర్చడం వల్ల ,ఆవేశాన్ని తెపిస్తాయి .అదే సముద్రం ,అదే ఇసుక తిన్నె ,అవే పంచుకుని తిన్న పల్లీలు పెళ్ళవగానే అబ్బ ఏం పోతాం లెద్దూ బీచ్ కి కాసేపు క్రికెట్ చూసుకొని లోకి మారి పోయి కోట కూలి పోతుంది,

    ReplyDelete
  2. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ కుటుంబానికి.

    ReplyDelete
  3. @ రవి గారూ ! మీ స్పందనకు ధన్యవాదాలండీ .

    @ పద్మార్పిత గారూ !థాంక్స్ .

    @ విజయ మోహన్ గారూ ! ధన్యవాదాలండీ .మీక్కూడా శివానుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను .

    ReplyDelete
  4. రెక్కలు తెగినాయని తెలుకొనే సమయం లేదేమో? లేక తెగిన రెక్కలతో మరి ఎగలేదన్న ధీమానేమో? ఏదేమైనా విరిగిన మనసును అతికే నేర్పు తనకుందేమో వేచి చూద్దాం. ఇవ్వడమే తెలిసిన మనసుకు ఈ దెబ్బలింతేనేమో? ఒక్కమాటలో తేల్చి చెప్పారండీ, తెలుసుకునేసరికి మరేమి మిగలలేదని. Nice one

    ReplyDelete
  5. పరిమళం గారూ !మహాశివరాత్రి శుభాకాంక్షలు.
    చాలా బాగుంది. Nice :)

    ReplyDelete
  6. "నా ఊహల కోటకు నిన్ను
    మహారాజును చేస్తే .....
    నా సంతోషానికి సమవర్తివై ,
    నన్ను శ్రావణ మేఘాన్ని చేశావ్"
    శ్రావణ మేఘం అనడం చాలా బాగుందండి..

    ReplyDelete
  7. చాలా బాగుంది. ఆ బాధ నాకు తెలుసు .

    ReplyDelete
  8. @ శృతి గారూ ! విరిగిన మనసుకు అతుకులు వేసుకుంటూ ....చితిలోకి వెళ్ళేవరకూ ఎదురు చూడటమే .....ఇవ్వటమే తెలిసిన మనసు కదా !

    @ ఆదిత్య గారూ !థాంక్స్ .

    @ మురళి గారూ ! వర్షించే కళ్ళను (మనసును ) పోల్చడానికి శ్రావణ మేఘమే సరిపోతుందనిపించింది .నచ్చినందుకు ధన్యవాదాలు .

    @ ఆత్రేయ గారూ !చిక్కటి (??) ఓదార్పు ! ధన్యవాదాలండీ .

    ReplyDelete