Friday, January 30, 2009

ఏల ??

*పద్మార్పిత గారి "అక్కరకురాని..." టపా చదివాక రాయాలనిపించింది .

అమృతం తాగిన వానికి
నీళ్లివ్వనది ఏల ?
కడుపు నిండిన వానికి
పరమాన్నమేల ?
జీవించి యున్నవానికి
సంజీవని ఏల ?
సాటి మానవునికి చేయని
సేవ మాధవునికేల ?
ప్రత్యక్ష దైవాలకు లేని పూజ
కనిపించని దేవుని కేల?
కనిపించునా కలియుగమున
మానవత్వమున్న మనుజులు ??
*(అరుదుగా కనిపిస్తారు కనుకనే ధర్మం ఒక్క పాదం మీదైనా నిలబడి ఉంది )

5 comments:

  1. బావుంది.
    మీ కవితకు స్ఫూర్తి నిచ్చిన పద్మార్క గారి అక్కరకు రాని కవితను కూడా చదివాను. అదీ బావుంది. ఎంతో ఆలోచింప జేసే ప్రశ్నలు....
    అర్ధవంతమైన ఆవేదనలు....
    అభినందనలు.

    ReplyDelete
  2. నమస్కారం పరిమళం గారూ... :) మీ కవితలు పరిమళాలను వెదజల్లడమే కాకుండా ఆలోచింప చేసేటట్టుగా కూడా ఉంటున్నాయి. అభినందనలు.

    ReplyDelete
  3. పరిమళం గారూ..
    మీ భావుకత జోడించి మంచి మాటలని చెప్పారు. అభినందనలు.

    ReplyDelete
  4. ప్రభాకర్ గారూ , ప్రేమికుడు గారూ , మధురవాణి గారూ ధన్యవాదాలండీ !

    ReplyDelete