యుద్ధం చేస్తున్నా ! నా హృదయంతో .....
తన నిండా నింపుకున్న నీ తలపుల్ని
తుడిచెయ్యాలని.......
యుద్ధం చేస్తున్నా ! నా కళ్ళతో
నాలోని నీ రూపుని కన్నీరుగా
తోసెయ్యాలని .......
యుద్ధం చేస్తున్నా ! నా పెదవుల్తో
పలకొద్దని నీ పేరుని
పదే పదే ......
కానీ ప్రతి సారీ ఓడిపోతున్నా
సర్వాంతర్యామివై నన్ను వేధిస్తున్నావ్
ఐనా నేను గెలవాలని ప్రయత్నిస్తున్నా ....
ఓడిపోవాలని కోరుకుంటూనే .........
Friday, January 2, 2009
Subscribe to:
Post Comments (Atom)
బావుంది
ReplyDeleteఐనా నేను గెలవాలని ప్రయత్నిస్తున్నా ....
ReplyDeleteఓడిపోవాలని కోరుకుంటూనే ......... chaalaa baagundi :)
బావుందండి.నేను ఇదే విషయం మీద చాలా రోజుల క్రితం రాసుకున్నాను."నిన్ను మర్చిపోవాలని చేసే ప్రతీ ప్రయత్నం లో మరో జ్ఞాపకమైపోతున్నావు "అని.మరిన్ని కవితలు ఎదురుచూస్తున్నాను.
ReplyDelete@ నేస్తం ! ధన్యవాదములు .
ReplyDelete@ రాధిక గారు !మీ జ్ఞాపకాలు చాలా బావుందండీ !
ఈనాడు లో తెలుగు బ్లాగ్ ల గురించి రాసినపుడు మీ కవితలోని కొన్ని లైన్లు ప్రచురించారు .అవి చాలా నచ్చి బ్లాగ్ ల గురించి తెలుకుని నేను కూడా ఏదో రాసేద్దామని మొదలు పెట్టాను .మీ అందరి ప్రోత్సాహం నా బ్లాగుకు ఊపిరి పోస్తోంది .కృతజ్ఞతలు .
@ everythingisprecious gaaru! thanks.
mee blog open cheyagaane kallaninduga kanapadda mallela parimalam naa yeda ninduga parauchukundi eaa kavitato
ReplyDelete