Wednesday, January 28, 2009

శ్మశాన వైరాగ్యం !

వైరాగ్యం ,శ్మశాన వైరాగ్యం .... రెండూ వేరు వేరు .
వైరాగ్యం గురించి మాట్లాడాలంటే నా పరిజ్ఞానం సరిపోదు .కాని
ఒక్క మాటలో చెప్పాలంటే వైరాగ్యం శాశ్వత మైనది .కాని శ్మశాన వైరాగ్యం అలా కాదు .అది తాత్కాలికం .
ఒక మనిషి చనిపోయినపుడు ,అతని అంతిమ యాత్రలో పాల్గొనే వారికి ,శ్మశానం లోపలికి అడుగు పెట్టగానే ........హు ....
ఇంతేకదా జీవితం ....మనిషి ఎంత సంపాదించినా ,కీర్తి ప్రతిష్ఠ లార్జించినా చివరికి అందరూ చేరాల్సింది ఇక్కడికే కదా ! రాజు ,పేదా .....రైతు ,కూలీ బేధం లేకుండా ప్రక్క ప్రక్కనే ,శాశ్వత నిద్ర పోయే చోటు .నేను కూడా ఎప్పటికైనా ఇక్కడికి రావలసిందే .ఈ మాత్రం దానికి బ్రతికిన నాలుగు రోజులూ ఈర్ష్యా ద్వేషాలు ఎందుకు ?ఈ సంపాదన (అక్రమమో ,సక్రమమో )ఎందుకు ? కష్టపడి ,దానధర్మాలైనా చేయక కూడబెట్టిన ఆస్తి నాతో రాదుకదా .చివరికి మిగిలేది ఈ ఆరడుగులే కదా !ఇలా సాగుతాయి వారి ఆలోచనలు .చనిపోయిన వ్యక్తీ దహన సంస్కారాలవగానే ,ఇంటికి వచ్చి తలస్నానం చేయగానే .....మళ్ళీ మామూలే .నా సంసారం ,నాపిల్లలూ ,నాడబ్బూ ,నా స్వార్ధం ...........
మధ్యలో ఆ కాస్సేపూ కలిగేదే శ్మశాన వైరాగ్యం .ఇది అప్పుడప్పుడూ మనక్కూడా కలుగుతుంది .ఉదాహరణకి ,ఏ రాఖీ యో ,భారతీయుడో లేక అపరిచితుడో లాంటి సినిమాలు చూసినపుడు ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళని ,అవినీతి పరుల్నీ చీల్చి చెండాడేద్దాం అనిపిస్తుంది .థియేటర్ నుంచి బైటకి వచ్చేవరకూ ....అలాగే మన పై అధికారి అకారణంగా చివాట్లు పెట్టినపుడూ ,మన శ్రమకు గుర్తింపు లభించనపుడూ ,చివరికి మన పిల్లలు మన మాట విననపుడూ .......ఇలా ....అనేక సందర్భాలలో మనకు శ్మశాన వైరాగ్యం కలుగుతూ ఉంటుంది .దీన్ని పూనకంతో పోల్చవచ్చేమో .దేవుడో ,దెయ్యమో ఒంటిమీదకొచ్చి కాసేపటికి వెళ్లిపోతుంటారు అలాంటిదే ఇదీను .
*ఈమధ్య మా నాన్నగారికి ఇష్టమని కొన్న సత్య హరిశ్చంద్ర సి .డి పెట్టుకొని సినిమా చూసాను .పూర్తయ్యేసరికి బాగా ఇన్స్పైర్ అయ్యి ఎల్లప్పుడూ సత్యమునే పలుక వలెను అని ఘా ....ట్టి గా నిర్ణయించుకున్నా .
ఇంతలో సెల్ రింగ్ అయ్యింది .చూద్దును కదా ,తెలిసిన ఎల్ .ఐ .సి ఏజెంటు .జీవన్ ఆస్థా అని మంచి పాలసీ ఉంది మేడం !మీరు, సార్ ఫ్రీగా ఉంటే వచ్చి కలుస్తా !
అయ్యో !మేం ఇంట్లో లేమండీ ! వీకెండ్ కదా అందరం రిలేటివ్స్ ఇంటికెళ్లాం ??? sengihnampakgigi

11 comments:

 1. పరిమళం గారూ..
  నిజమేనండీ మీరు చెప్పింది.
  ఎవరైనా ఆకస్మికంగా చనిపోయారనే వార్త విన్నప్పుడు నాకు కూడా అలాంటి శ్మశాన వైరాగ్యం వస్తూ ఉంటుంది.
  మీరు చెప్పిన కొసమెరుపు మాత్రం కేక :)))
  మనందరం అసలు అబద్దం చెప్పకుండానా.. సాధ్యమేనంటారా? :)))

  ReplyDelete
 2. మనసుంటే మార్గం ఉంటుంది. కాస్త ప్రయత్నిస్తే ఆ ఏజంటుకి మాకు ఆశక్తి లేదని నిజమే చెప్పొచ్చేమో..? సత్య వ్రతులవ్వడానికి మీరు ప్రయత్నమైనా చేశారు. మొదటిలో నే వోటమిని వొప్పుకోకండి.
  మనకి గానీ, మరొకరికి గానీ కీడు కలగ కుండా ఉంటే.., మంచి జరుగుతుందంటే అబద్దం చెప్పొచ్చని నా అబిప్రాయం.
  మర్చి పోయా... మొత్తం వైరాగ్యాలు మూడు రకాలనుకుంటా... ప్రసూతి వైరాగ్యం అని మరొకటి ఉందండోయ్... :)

  ReplyDelete
 3. కొస మెరుపు భలెగా మెరిసింది!

  ReplyDelete
 4. బాగుంది .. బాగుంది .. వైరాగ్యం.. మీరిచ్చిన పోలిక బాగుంది...

  ReplyDelete
 5. సెల్లు ఫోనులందు, పైబాసులకుముందు
  ప్రేమ తోన పోవు పార్కునందు
  పరుసు లాగినాన్న జిక్కినక్షణమందు
  బొంకవచ్చు - తప్పు లేదు.

  దీనికి మూలం ఈ సంధర్భము. కాస్త సరదా కోసం పేరడీ రాశనన్నమాట.

  బలి చక్రవర్తి వామనుడికి సముచితాదరమిచ్చి గౌరవించి...వడుగా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావాలి కోరుకొమ్మన్నాడు. "ఒంటి వాడను నేను. నాకు ఒకటి మరియు రెండడుగుల మేర యిమ్ము . అయినను అడుగమంటివి కనుక అడిగితిని. దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు ". ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించాడు. అపుడు బలి, ఆడిన మాట తప్పను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు

  వారి జాక్షులందు, వైవాహికములందు
  ప్రాణ విత్త మాన భంగమందు
  జకిత గోకులాగ్ర జన్మరక్షణయందు
  బొంకవచ్చు.....తప్పు లేదు.

  అది పాపము కాదు. అని శుక్రాచార్యుడు వివరించాట్ట.

  కానీ అది అప్పటి మాట. ఇప్పటి సమయానికి అనుగుణంగా నేను దానికి రాసిన పేరడీ

  ReplyDelete
 6. @ మధురవాణి గారూ !అస్సలు సాధ్యం కాదండీ .కాకపోతే అప్పుడప్పుడు సత్యము పల్కుట కన్నా ,అప్పుడప్పుడు అబద్ధం చెప్పడం మేలు .

  @మందాకినీ గారూ !కొసమెరుపు నచ్చినందుకు థాంక్స్ .

  @శివ గారూ ! ధన్యవాదములండీ .

  @ ప్రేమికుడు గారూ !మీ స్పందనకు ధన్యవాదాలు .అవునండోయ్ !మీరు చెప్పిన మూడో వైరాగ్యం కూడా వుందండీ .ఆ ఏజంటు అంత సులువుగా వదలదండీ బాబూ !మీరు కట్టక పోయినా మావారి ఆఫీసులో మీటింగ్ ఎరేంజ్ చెయ్యమంటాడు .తెలిసిన వారిని పరిచయం చేయమంటాడు .అందుకే అలా చెప్పాల్సి వచ్చింది .వచ్చాక రెండు మూడు గంటలు స్పెండ్ చేయలేక అతన్ని హర్ట్ చేసేకంటే ఎదే మంచిదనిపించింది .

  @ఆత్రేయ గారూ ! పేరడీ భలే రాశారండీ ! పేరడీ మాత్రమే కాకుండా సందర్భాన్ని కూడా వివరించి నందుకు ధన్య వాదాలండీ .

  ReplyDelete
 7. thoroughly enjoyed :)
  BTW, lying to telemarketers does not count as a lie - it was said so in Manu Dharma Sastram!!

  ReplyDelete
 8. meeto poortigaa yekeebhavistunna, ye vyragyamaina continue ayite aihika bandhaalu, blog bandhaalukooda mari vundavu. kaavuna marapu manaku vennato pettina vidya. mari manam saadharana maanvulam kadaa.
  ikkada telugulo elaa raayaali madom

  ReplyDelete