*పద్మార్పిత గారి "అక్కరకురాని..." టపా చదివాక రాయాలనిపించింది .
అమృతం తాగిన వానికి
నీళ్లివ్వనది ఏల ?
కడుపు నిండిన వానికి
పరమాన్నమేల ?
జీవించి యున్నవానికి
సంజీవని ఏల ?
సాటి మానవునికి చేయని
సేవ మాధవునికేల ?
ప్రత్యక్ష దైవాలకు లేని పూజ
కనిపించని దేవుని కేల?
కనిపించునా కలియుగమున
మానవత్వమున్న మనుజులు ??
*(అరుదుగా కనిపిస్తారు కనుకనే ధర్మం ఒక్క పాదం మీదైనా నిలబడి ఉంది )
Subscribe to:
Post Comments (Atom)
బావుంది.
ReplyDeleteమీ కవితకు స్ఫూర్తి నిచ్చిన పద్మార్క గారి అక్కరకు రాని కవితను కూడా చదివాను. అదీ బావుంది. ఎంతో ఆలోచింప జేసే ప్రశ్నలు....
అర్ధవంతమైన ఆవేదనలు....
అభినందనలు.
నమస్కారం పరిమళం గారూ... :) మీ కవితలు పరిమళాలను వెదజల్లడమే కాకుండా ఆలోచింప చేసేటట్టుగా కూడా ఉంటున్నాయి. అభినందనలు.
ReplyDeleteపరిమళం గారూ..
ReplyDeleteమీ భావుకత జోడించి మంచి మాటలని చెప్పారు. అభినందనలు.
ప్రభాకర్ గారూ , ప్రేమికుడు గారూ , మధురవాణి గారూ ధన్యవాదాలండీ !
ReplyDeletebaagundi :)
ReplyDelete