Wednesday, January 21, 2009

నెనరు !!(మోహం ,వలపు )

*చెలికాడా !నెనర్లు !(కృతజ్ఞతలు )
నీ ప్రక్కన ఓ నిముషం కూర్చునే ,
చనువుంటే చాలనుకున్నాను .
నీ ముఖాన్ని చేతులలో తీసుకొని ,
నీ నుదుట ముద్దాడ గల్గితే ...
అదే భాగ్యమనుకున్నాను .
ఎన్ని వసంతాల నిరీక్షణిది?
చివరికి ...........నా ప్రేమ ,
నీ వాంఛలో సఫలీకృత మైంది .
నువ్విచ్చిన కాన్క నా చిన్ని
దోసిట చాలక .........
పొంగి పొర్లి పోతోంది .
కాముని చెరకు వింటి నుంచి పుట్టావో ఏమో ....
నాలో నివురు గప్పిన కాంక్షా జ్వాలను ,
నులి వెచ్చని నీ స్పర్శతో రగిల్చావు .
కారు మబ్బులా కమ్మేస్తావ్ ....
వెనువెంటనే వర్షిస్తావ్ .....
నీ తలపుల్ని మాత్రం నాకొదిలి ,
నువ్వు నిష్క్రమిస్తావ్ ......
ప్రియతమా !
ఆ తలపుల వాకిటే నిలుచుని
నీ ఆకస్మిక ఆగమనాన్ని తలుచుకొంటూ,+
కలలు కంటాను ......

7 comments:

  1. *తాడేపల్లిలలితాబాలసుబ్రహ్మణ్యంగారికి కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. mee aalochalni chaala baagaa raastunnaaru

    ReplyDelete
  3. ఆహా.. సరళమైన పదాలతో.. ఎంత మధురంగా చెప్పారండీ..!
    చాలా బాగుంది..!

    ReplyDelete
  4. *కొత్త పాళీ గారూ ,ఆనంద గారూ ,మధుర వాణి గారూ ,వేణూ శ్రీ గారూ ! ధన్యవాదములండీ .

    ReplyDelete
  5. chaala bavundandi! bhavam, bhasha rendu bavunnayi.ee madhya kalam lo intha manchi telugu chadavatam chala santhoshanni ichindi.. -KrishnaGayatri

    ReplyDelete