Wednesday, January 7, 2009

మధురోహలు

నా ఊహల బృందావనంలో విరిసిన
పారిజాతానివి నువ్వని ......
నా మధురోహలు నీతో పంచుకున్న క్షణం ,
నువ్వు పలికిన పసిడి పలుకులు
ఇంకా నా చెవిలో .....
గుసగుసగా వినిపిస్తిన్నాయి .
నీ ధరహాసాలు , పరిహాసాలు ,
నీ చిలిపి గారాలు ,సరాగాలు ...
ఇవన్నీ, క్షణ కాలమేనా ?
నా కలల వాకిట నిలిచిన
నిలువెత్తు శిల్పానివి ...
నిన్నెంత చూసినా
నా నయనాల దాహం తీరదాయే
తొలకరి జల్లులా మెరిసి ,
మాయమై పోయావ్ .....
ఇది కలయో ,వైష్ణవ మాయో .....
తెలిపే౦దుకైనా నీ చిరునవ్వుల
చందనాన్ని మరోసారి ........
నాపై చల్లిపో ........ప్రియా!

3 comments:

  1. పరిమళం గారు, నేనూ ఇదే పనిలో వున్నాను. పదండి మనిద్దరం కాస్త కలిసికట్టుగా పనిచేస్తే కార్య సిద్ధి శీఘ్రంగా అవుతదేమో?

    ReplyDelete