అమ్మ పెట్టింది తొలిముద్దు
నాన్న పెట్టారు మలిముద్దు
మళ్లీ ఇన్నేళ్ళకి నువ్వూ .......
నుదుటి పైన ముద్దు అది
నులి వెచ్చని తొలి పొద్దు
బుగ్గ మీది ముద్దు అది
చేయదు ఏ సద్దూ
పెదవి పైన ముద్దు అది
పగడపు రంగును అద్దు
మెడ మీది ముద్దు అది
మోహపు సరిహద్దు
ఆపై నీ కొంటె తనానికి
లేదిక హద్దూ.....పద్దూ .......
Tuesday, December 23, 2008
Subscribe to:
Post Comments (Atom)
ముద్దు ముద్దు gaa undi :P
ReplyDeleteముద్దు ముద్దుగా ముద్దొస్తుంది మీ కవిత........
ReplyDeleteముద్దు ముద్దుగా ఉంది మీ కవిత...
ReplyDelete@ నేస్తం గారూ ! పద్మార్పిత గారూ ! విజయ మోహన్ గారూ ! ముద్దు ముద్దుగా కామెంట్ చేసినందుకు నా ధన్య వాదములు .
ReplyDeleteముద్దొస్తుంది మీ కవిత
ReplyDelete@ shiva gaaru! thank you.
ReplyDeleteWow! chala baagundi.. mudduga..!
ReplyDelete@ sujji!thank you.
ReplyDeleteనుదిటిముద్దు నిద్రలేపి
ReplyDeleteబుగ్గముద్దు గడియతీసి
పెదవిముద్దు సెగలురేపి
మెడమీదకు దారిచూపి
హద్దులంటు సద్దుచేసి
మధ్యలోనె కవితనాపి
వేడిమీద నీళ్ళుజల్లి
సెగలుచూసి మురుస్తావా ... అమ్మా!!
ఆత్రేయ గారూ ! నా బ్లాగ్ లో మీ కవిత !!
ReplyDeleteగరిక మధ్య గులాబి పూచినట్టు !
ధన్యవాదములండీ .
Wow...Its both sweet and hot..
ReplyDelete