Tuesday, December 9, 2008

భయం

***ఇది నేను చాలా సంవత్సరాల క్రిందట చదివినది .ఏ పుస్తకమో గుర్తులేదు కాని చాలా నచ్చి వ్రాసుకున్నది .మీ కోసం .....


*భోగములలో - వ్యాధి కలుగునన్న భయం
ఉన్నత జన్మలో - జాతి పోవునన్న భయం
సంపదలో - దొంగల భయం
కీర్తి ప్రతిష్టలలో - అవి పోవుననే భయం
బలములో - శత్రువుల భయం
అందములో - వృద్ధాప్యపు భయం
జ్ఞానములో - అపజయ భయం
మంచి గుణములో - అపనిందల భయం
శరీరంలో - మృత్యు భయం
మనిషి జీవితమంతా భయముల మయమే
వైరాగ్యం ఒక్కటే నిర్భయమైనది .

3 comments:

  1. అయినా వాటిగురించే మనిషి వెంపర్లాడుతున్నాడు

    ReplyDelete
  2. @ మోహన్ గారూ ! ఇన్ని భయాల మధ్య కూడా మనకభయం గోవింద నామ స్మరణం .

    ReplyDelete
  3. చాల బాగుంది పరిమళ గారు ఎవరు రాసారో కాని :)

    ReplyDelete