ప్రియతమా !
నీ నయనమ్ముల అశ్రు ధార లెందుకు ?
దయలేని విధి విడదీసినా ,అది తాత్కాలికమేగా
మనది వియోగం కాదు విరహమనుకో ....
విరహము కూడా సుఖమే కాదా ....అన్నారో కవి
ప్రియతమా !
నా ప్రయాణం బహు దూరం సుమా !
ఆకాశం ,భూమి కలిసే చోటకి ....
అదో సుందర లోకం ...
ఐనా ....అలసిపోక ,
గమ్యం చేరిన వెంటనే ,
ఇంద్ర ధనుస్సు చీర కట్టుకొని
చందమామ సింధూరం ,
చీకటి కాటుక పెట్టుకొని ,
నక్షత్రాల్ని సిగలో ముడుచుకొని
నీ రూపాన్ని కన్నుల నింపుకొని ,
స్వర్గపు వాకిట ఓ వారగా నిలుచుని ....
నిన్ను స్వాగతించటానికి ,
చందనపు పాత్ర చేత బట్టుకొని
ఉద్విగ్నభరిత హృదయంతో
నిరీక్షిస్తూంటా......
Wednesday, December 3, 2008
Subscribe to:
Post Comments (Atom)
Really heart touching
ReplyDeletesee this live story
http://manaanubhoothulu.blogspot.com/
శ్రుతి !ధన్యవాదములు .
ReplyDeleteమీ కవితలో పదాలు చక్కటి పరిమళాలను వెదజల్లుతున్నాయ్... ! రాస్తూనేఉండండి..
ReplyDelete@bhagavaan garu!thank you sir!
ReplyDeletechaalaa baagundi.
ReplyDelete@atreya garu!thank you sir!
ReplyDeleteమీ కవిత చాలా బాగుంది.......
ReplyDeleteమీ రచనల పరిమళాలని మున్ముందు ఇంకా ఆస్వాదించాలని నా ఆశ..
@ padmarpita garu!thank you & welcome.
ReplyDelete