Monday, December 15, 2008

నువ్వు - నేను

ఉదయించే సూర్యుడు నువ్వైతే
వికసించే పద్మం నేనౌతా
గర్జించే మేఘం నువ్వైతే
చిరుజల్లునై పులకిస్తా
ఎగసిపడే కడలివి నువ్వైతే
ప్రవహించే నదినై చేరుకుంటా
మల్లె వంటి మనసు నీదైతే
పరిమళమై చేరువౌతా
జాబిలి నువ్వైతే
వెన్నెల నేనౌతా
ఇన్ని మాటలేల .........
నువ్వు పురుషుడివి
నేను ప్రకృతిని .

7 comments:

  1. చాలా బాగుందండి. ధన్యవాదములు.

    ReplyDelete
  2. @ మోహన్ గారూ!నరసింహా గారూ!ధన్యవాదములు.

    ReplyDelete
  3. :) చక్కని తలపులు. బాగున్నాయి.

    ReplyDelete
  4. @తెలుగు తూలిక గారూ!కృతజ్ఞతలు.

    ReplyDelete
  5. మీ రచనలన్నీ చాలా బావున్నాయండి

    ReplyDelete
  6. @ బాటసారి గారూ !మీ కామెంట్ కి ధన్యవాదములు .నా కవితలు మీకు నచ్చడం తెలుగుపై మీకున్న అభిమానం కావచ్చు కాని నాకేమంత భాషా పరిజ్ఞానం లేదు .పైగా నేను మీకంటే జూనియర్ నే నండీ .

    ReplyDelete