Saturday, December 13, 2008

మరో దీపావళి

ఎవరెన్ని విధాల తప్పొప్పులెంచినా జరిగిన ఎన్కౌంటర్ చాలా మందికి సంతోషాన్ని కలిగించిందనేది వాస్తవం .ఆ చాలా మందిలో నేను కూడా ఉన్నాను . స్త్రీ శక్తి మరోసారి సత్యభామగా మారి ఈ కలియుగ నరకుడ్ని అంతమొందించక ముందే
పోలీసులే ఆ పని చేసారు .ప్రజలు టపాసులు కాల్చి మరో దీపావళి చేసుకున్నారు .మరోసారి ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా ఈ సంఘటన ఒక కనువిప్పుగా వుంటుందని భావిస్తున్నాను .
***ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే .

4 comments:

  1. సరిగ్గా చెప్పారండి... కానీ ఒక ఆయేషా, ఒక ప్రత్యూష లాంటి విషయాల్లో (పెద్ద వాళ్ళ ప్రమేయం ఉన్న విషయాలు) ఏమీ చేయలేక పోయిన మన రక్షణ వ్యవస్థ కనీసం ఈ సారైనా కళ్ళు తెరిచి ఆ కర్కోటకులకు తగిన శిక్ష విధించింది. ఈ తెగువ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. కానీ ఇటువంటి సంఘటనలు మాత్రం ఇక్కడితో ఆగిపోవాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. సెలవు....

    ReplyDelete
  2. మీ వ్యక్తిగత భావనని అంగీకరించినా, జరిగింది బూటకలు ఎన్కౌంటర్ అయితే మాత్రం పరిస్థితిని హర్షించలేము.

    ReplyDelete
  3. సహృదయత పరిమళించే మీ అభిప్రాయ వ్యక్తీకరణ జన బాహుళ్య భావ వ్యక్తీకరణే కాని మీ ఒక్కరిదే కాదమ్మా. భగవంతుడున్నాడని ఋజువు చేయబడింది. ధర్మమేవ జయతే.

    ReplyDelete
  4. @ సర్ !గుడ్డి కంటే మెల్ల మేలు కదండీ .ప్రజలు అల్ప సంతోషులు .ఇటువంటి అరాచకాలు ఆగినా ,ఆగక పోయినా ,కనీసం
    తగ్గుతాయని ఆశిద్దాం .

    @ మహేష్ గారూ ! బహుశా న్యాయాన్ని చట్ట బద్ధంగా అమలు చేయాల్సి వచ్చి వుండొచ్చు .

    @ రామ కృష్ణారావు గారూ ! నిజమేనండి .ధన్యవాదములు .

    ReplyDelete