Thursday, December 4, 2008

రియల్ హీరోస్

సామాజిక వైఫల్యాలపై విద్యార్ధుల చిత్ర సంధానం .ఈ రోజు లోకల్ ఎడిషన్ లో వ్రాశారు .యువత అంటే పబ్ లూ ,డిస్కో
లూ ,సినిమాలూ ఇవే అనుకొనేవారికి కనువిప్పు "ప్రేరణ - 2008" సందేశాత్మక డాక్యుమెంటరిల ప్రదర్శన . నేటి యువతలో ఎంజాయ్ చెయ్యటమే కాదు ,సమాజం పట్ల బాధ్యతా ,సామాజిక వైఫల్యాల్ని వెలికి తీసి మార్పు తేవాలన్న చైతన్యమూ ,తపనా కనిపిస్తున్నాయి .అదే పేజ్ లో విద్యార్ధినులు తీసిన లఘు చిత్రాలు కూడా మనం తీసుకునే చిన్న జాగర్తలతో పర్యావరణ పరిరక్షణలో ఎలా భాగస్తులం కావచ్చో ఆచరణలో చూపించారు.
"చేంజ్ "' డాక్యుమెంటరి గురించి చదువుతూ గత ఐదేళ్ళలో చదువుల ఒత్తిళ్ళతో దేశ వ్యాప్తంగా 30 వేల మంది విద్యార్ధులు మరణించారని తెలిసినప్పుడు నా మనసు ఆవేదనతో నిండిపోయింది .ఈ ఉద్విగ్నత మీతో పంచుకోవాలని అనిపించింది .ఈ విషయంలో తల్లి తండ్రులదే పూర్తీ బాధ్యత .కొంత మంది తల్లి తండ్రులు పిల్లలను పాఠాలు వల్లే వేసే యంత్రాలుగా ,తమ స్టేటస్ చూపుకునేందుకు ఒక మార్గంగా భావిస్తున్నారు .నాకు బాగా తెలిసిన వారి పిల్లలు బాగానే చదువుతారు 75 శాతం మార్కులు వస్తుఉంటాయి కానీ వారి తల్లి మాత్రం సెంట్రల్ సిలబస్ చదువుతున్న తన పిల్లల్ని
స్టేట్ సిలబస్ లో చదువుతున్న వాళ్ల బంధువుల పిల్లల మార్కులతో పోల్చి ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది .
స్కూల్ దగ్గర్నుండి ,కాలేజ్ వరకు ఒత్తిడి ....ఒత్తిడి ....
ఎంటర్ టైన్ మెంట్ కి ,ఫిజికల్ ఏక్టివిటీస్ కి ,కళలకు, అస్సలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు .అటువంటి వారున్నా నూటికొక్కరు .
ఎప్పుడైతే విద్య విజ్ఞానం కోసం కాకుండా ఉద్యోగార్జన కోసం ,ధనార్జన కోసం అని విద్యార్ధి ,తల్లి తండ్రులు తాపత్రయ పడుతున్నారో ,అప్పుడే అటువంటి విద్యనందివ్వ టానికి కార్పొరేట్ పాఠశాలలు ,కళా శాలలు పుట్టుకొచ్చాయ్ .
వారికి కావాల్సి నంత డబ్బు అందివ్వడానికి తల్లి తండ్రులు వెనకాడటం లేదు .డబ్బు తీసుకుని పాఠాలు చెప్పే విద్యాలయాలు ,అధ్యాపకులు తప్ప ,విజ్ఞానాన్ని ,వివేకాన్ని జాగృతం చేసి ,మంచి ఆచరణ ,సమాజం పట్ల అప్రమత్తత ,నేర్పుతూ విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే గురువులకు కొరత ఏర్పడింది.
ఇటువంటి సమయంలో మంచి నేపథ్యంతో ,చక్కటి అవగాహనతో ,చూసినవారిలో కొద్దిమందైనా మారతారన్న ఆశావహ దృక్పధంతో ఈ డాక్యుమెంటరి తీసిన విద్యార్ధులు ...... రియల్ హీరోస్ కాదంటారా ??

3 comments:

 1. పరిమళం గారూ,
  ఇదే అంశం మీద తెలుగులో "హోప్..నాకు మార్పు కావాలి" అనే ఒక తెలుగు సినిమా వచ్చింది. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. రామానాయుడు గారు, కళ్యాణి నటించారు. ఆ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసారంట విద్యార్థుల ఆత్మహత్యల మీద. ఆ సినిమా చూసినప్పుడు నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను. చాలా షాక్ అయ్యాను ఇంతమంది పిల్లలు చనిపోయారా చదువుల గురించి అని.. :( అలాంటి సినిమా తెలుగులో రావడం ఒక మంచి పరిణామం. కానీ, ఆర్ట్ సినిమా అని ఎవరూ చూసి ఉండరు :( వీలైతే మీరు తప్పకుండా చూడండి. DVD దొరికే అవకాశం ఉంది.

  ReplyDelete
 2. @మధుర వాణి గారూ !నేను కుడా "హోప్ "చూశానండి .మీరన్నట్టు చాలా మంది చూసి వుండకపోవచ్చు .యువతలో
  ఇటువంటి చైతన్యం రావటం వల్ల తర్వాత తరానికైనా మంచి విద్యా ,వినోదము ,విచక్షణా అందించగలుగుతారన్న ఆశ .

  ReplyDelete
 3. పరిమళ గారు మీరు రాసింది చదివాక చాలా షాక్ అయ్యను అండి. యువత అన్నా తమ బిడ్డలను ఎటువంటి ఒత్తిడి కి గురిచేయకుండా సక్రమంగా పెంచుతారని ఆశిస్తూ

  ReplyDelete