గువ్వలన్ని గూటికి చేరుకునే వేళ
నువ్వు మన గూడు విడిచి వెళ్ళావ్
ఈరోజు నిండు పున్నమి....... ఐనా
తనులేనిదే నేనుమాత్రం
నీకెందుకని చందమామ కూడా
మబ్బుల వెనుక చేరి నన్నుడికిస్తోంది
సీతాకోక చిలుకలా నా సంతోషాన్ని
నీతో తీసుకెళ్ళి పోయావ్ !
నీ వెంట రాలేక నిస్సహాయంగా
నిలుచుండి పోయిన నన్ను
వెదుక్కుంటూ తిరిగి........
త్వరగా వచ్చేయి నేస్తం!
నా కోసం........
శ్రమనుకోకుండా నా నవ్వుల పువ్వుల్ని
నీతో పాటు తిరిగి తెచ్చేయి నేస్తం!
Subscribe to:
Post Comments (Atom)
చాలా బావుందండీ... కీపిటప్... !
ReplyDeletethank you sir!
ReplyDelete`ఈరోజు నిండు పున్నమి....... ఐనా
ReplyDeleteతనులేనిదే నేనుమాత్రం
నీకెందుకని చందమామ కూడా
మబ్బుల వెనుక చేరి నన్నుడికిస్తోంది
ఈ వూహ చాలా బాగుందండి!!!
@kiran garu!thank you!
ReplyDeleteచాలా బాగా వ్రాస్తున్నారు.కొనసాగించండి.
ReplyDelete@narasimha garu!thanks for your support sir!
ReplyDelete