Friday, December 5, 2008

అవ్యక్తం

మనసు లేని వాడవు నీవు
నాలోని మమత యెరుగకున్నావు
ప్రణయ మూర్తివనుకున్నా
గుండె గుడిలో ప్రతిష్టించుకున్నా
పొంగి పొరలే ప్రేమానురాగాల్ని
మబ్బు వెనక చందమామలా
మనసు వెనక దాచుకున్నా
నా ఆశ ...నా శ్వాసా ....నువ్వేనని ,
నేను తెలుపలేను .....
నువ్వు తెలుసుకోవు .....
శిల వంటి నిను వలచి
శాపగ్రస్త నైనాను .....
శిల ముందరి పూమాలికలా
వడిలి ,వాడి పోయాను
నీ కొరకై వేచి వేచి
నేల కొరిగి పోయాను .

5 comments:

  1. కవిత చాలా బాగుందండి.
    అభినందనలు.
    మీకు వీలైతే ఈ క్రింది లింకులోని నాకామెంటుని చదవండి.

    https://www.blogger.com/comment.g?blogID=1962687827296973401&postID=2046035979951400561

    చదివాకా నన్ను తిట్టుకోవద్దు దయచేసి.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  2. బాగుంది.చిన్న చిన్న తప్పులు సరిచేసుకోండి.

    ReplyDelete
  3. @బాబా గారు !మీ కామెంట్ చదివానండి .పద్మార్పిత గారు చెప్పిన సమాధానం నాక్కూడా వర్తిస్తుందండీ .కాని ఇకపై
    ప్రయత్నిస్తాను .ఎంత మాటండి ,మీరు సలహా ఇవ్వటమే నా అదృష్టంగా భావిస్తున్నాను .కృతజ్ఞతలు .

    @నరసింహ గారు !తప్పులుంటే తప్పకుండా సరిచూసుకుంటానండీ .నాకు అంత భాషా పరిజ్ఞానం లేదండీ .అన్యదా భావించక మన్నించగలరు .మీవంటి వారి కామెంట్సే నాకు ఆశీస్సులు .కృతజ్ఞతలు .

    ReplyDelete
  4. చాలా చాలా బాగుంది పరిమళంలా

    కానీ కవితలోని ప్రేమను చెప్పలేదు అని మీరే అన్నారు కవిత పేరు కూడా అవ్యక్తం. మొదటి లైనులో మనసులేని వాడివి అని అనటమ్ అభాండమేమో.

    ReplyDelete
  5. @ ఆత్రేయ గారూ !ముందుగా మీకు కృతజ్ఞతలు .మనసు తెలుసుకోవటానికి మాటలే కావాలాండి ?కళ్లు చాలవా ?మనసున్న వారే అది తెలుసుకోగలరని నా అభిప్రాయం .నా అభిప్రాయం తప్పని మీకనిపిస్తే లైట్ తీస్కోండి ప్లీజ్ ...

    ReplyDelete