Saturday, November 15, 2008

నీ స్నేహం

సూర్యుడు ఉదయిస్తున్నాడు ,అస్తమిస్తున్నాడు
తిరిగి రేపు ఉదయిస్తాడు
పున్నమి వెన్నెలా ,అమావాస్య చీకటి
ప్రతినెలా వస్తూనే ఉన్నాయ్
తొలకరి జల్లూ,పచ్చని పైరూ
ప్రతి ఏటా పలకరిస్తూనే వున్నాయ్
గ్రీష్మం ,శిశిరం ,
వర్షం ,హేమంతం
శరదృతువులు ,నా జీవితంలో
మళ్లీ మళ్లీ వస్తున్నాయ్
కాని నేస్తం .......
నీ స్నేహం మాత్రం ,
తిరిగి రాని వసంతం ......

9 comments:

  1. పరిమళం గారు, సరళమైన భాషలో నేస్తం యొక్క విలువ చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. పెద్దగా చదువుకోలేదన్నారు కానీ మీకవితలతో ’పెద్దగా‘ అలరిస్తున్నారు.

    ReplyDelete
  3. మీలాంటి వారి ప్రోత్సాహం ,నా అదృష్టమే తప్ప ,అది నా కవితల్లోని ప్రత్యేకత కాదు .శ్రీధర్ గారు ,విజయ్ గారు ధన్యవాదములు .

    ReplyDelete
  4. పరిమళ గారు,

    మీ మొదటి ప్రయత్నమే చాలా అందంగా ఉంది. ఇక హాయిగా మీ ఆలోచనలను అలా బ్లాగుతూ వెళ్లండి. మీకు ఎటువంటి సహాయమైనా అందించడానికి ఎవరైనా సిద్ధమే.

    ReplyDelete
  5. మీకు స్వాగతం. మీ ఆలోచనలతో మరిన్న చక్కటి టపాలు రాస్తారని ఆశిస్తాం

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete