Tuesday, November 11, 2008

కరిగిన కల

నిదురించే తోటలోకి
కోయిలవై వచ్చావు
నీ తీయని పాటతో
ఎదను మేల్కొలిపావు
రాదనుకున్న వసంతాన్ని
తిరిగి తీసుకొచ్చావు
మోడువారిన మనసులో
ఆశలు చిగురించే వేళ
కన్నుల్లో నీరు నింపి
కలవై కరగి పోయావు

3 comments:

  1. IT WAS WONDERFULL
    AUSOME!!!!!!!!!!!
    SO INSPIRING
    AND KEEP GOING

    ReplyDelete
  2. భావన బాగుంది. గుంటూరు శేషేంద్ర శర్మ గారి ప్రభావం కొంత వున్నట్టుంది. ముత్యాల ముగ్గు చూశారా. " నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది.. .. కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది." చాలా బాగుంటుందా పాట. సుశీల గారి గళం ఆ పాటకు ఇంకాస్త అందానిచ్చింది... ముగింపు మరింత హృద్యం గా వుంటుంది. "కొమ్మల్లో పక్షుల్లారా.. గగనంలో మబ్బుల్లారా .. నది కోసుకు పోతున్న నావను ఆపండి... రేవు బావురుమంటోందని నావకు చెప్పండి.." ఇది పూర్తయ్యే సరికి నా కళ్ళలో నాకు తెలియకుండానే నీరు నిండి పోతుంది. "ట్యాంక్ తిప్పారా..." అంటూ మా ఆవిడ నవ్వించేస్తుంది.

    ReplyDelete