నిన్ను మరచిపోవడమంటే
నానుంచి నేను విడిపోవడమే
నా హృదయం లో నీ జ్ఞాపకాలు
సముద్రంలోని కెరటాలు
ఎంతగా తీరం వైపు తోసేసినా
తిరిగి నాలోనే కలుస్తాయి
నా మదిలోని ఆశలూ
సముద్రంలోని అలలూ ఒక్కటే
అవి ఎగసి ఎగసి నిన్నందుకోవటానికి
ప్రయత్నిస్తూనే వుంటాయి
కాని నేస్తం ....నాకు తెలుసు
నువ్వు అందని ఆకాశానివని
అయినా ....
ఆగిపోని ,అలసిపోని ,
అలను నేను .
|
చాలా బావుంది.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteచాలా బాగుంది....చదువుతుంటె మనసు నన్ను వదిలి పొతుంది....తన ఊహలొకి
ReplyDeleteబాగుంది. మదిని సముద్రం తో పోల్చడం ఇంకా బాగుంది.
ReplyDeletegood one
ReplyDeleteమీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలిపినందుకు ధన్యవాదములు
ReplyDelete