నా ఫ్రెండ్ అడిగాడు .....ఎప్పుడూ కవితలేనా ?అని ......మరేం రాయాలని ఆలోచించాను ఒక రోజంతా ......ఐనా ఏం రాయాలో తెలీలేదు .నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది ,అది నా ఇల్లే ...ఏం రాద్దామన్నాసంకోచమే .వాడంటాడు .....నా బాల్యం,నేను తిన్న బాసుంది ,నాకు నచ్చిన సినిమా ఏదైనా రాయొచ్చని .కాని ,కధలు ,కవితలు ,కొటేషన్స్ , పుస్తకాలు ,వంటలు ,సినిమాలూ......ఒకటేవిటి?రాముడి దగ్గర్నుండి ,రాజకీయాల వరకు ,కావేవి బ్లాగుకనర్హం అంటూ అన్నీ అందరూ రాసేస్తుంటే ..నేనేం రాసినా హనుమంతుడి ముందు కుప్పిగంతులా ఉంటుందే మోనన్న భయంతో .....
బిక్కమొహంతో ........ఓ ....బ్లాగిస్ట్..ఐనా ధైర్యం చేసి నాకు నచ్చిన ఓ కవితను మీ ముందుంచుతున్నా.
తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి నుండి
నా భారత ధాత్రి
మూడు సముద్రాల కెరట కెరటాల నీలాల
మోహన వస్త్రం దాలిచి
మౌళి మీద హిమ సుందర కిరీటం ధరించిన
రాజ్ఞి నా భరత ధాత్రి అనుకోవడం ఒక నిజం !
అదొక సుఖం .
మూడు సముద్రాలు మూసిన కోసిన తీరంతో
ముగ్గు బుట్టలాంటి తలమీద కొండంత బరువుతో
ముల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం
మరో నిజం ! అదో దుఖం .
ఇదీ నిజం అదీ నిజం
రెండింటికీ ఋజువులు సమం
శ్రీ రాముడి శ్రీ కృష్ణుడి జన్మ భూమి మరి
కంసునికి , దశకంఠునికీ కాదా ?
మోహన వస్త్రం దాలిచి
మౌళి మీద హిమ సుందర కిరీటం ధరించిన
రాజ్ఞి నా భరత ధాత్రి అనుకోవడం ఒక నిజం !
అదొక సుఖం .
మూడు సముద్రాలు మూసిన కోసిన తీరంతో
ముగ్గు బుట్టలాంటి తలమీద కొండంత బరువుతో
ముల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం
మరో నిజం ! అదో దుఖం .
ఇదీ నిజం అదీ నిజం
రెండింటికీ ఋజువులు సమం
శ్రీ రాముడి శ్రీ కృష్ణుడి జన్మ భూమి మరి
కంసునికి , దశకంఠునికీ కాదా ?
baagundi chaalaa...
ReplyDeletemaa manasuki nachela...
naa aksharaalu vennello aadapillalu anna kavitha edo undaali kadaa tilak gaaridi adi koodaa andistaaraa maaku
ReplyDeleteబాబు గారూ !మీ అభినందన అందింది పుష్ప గుచ్చంలా .....
ReplyDeleteథాంక్స్!సురేష్ గారూ !మీ కోసం .....తిలక్ గారి ...
నా కవిత్వం
నా కవిత్వం కాదొక తత్త్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనిక వాదం ,సామ్య వాదం
కాదయ్యా అయోమయం ,జరామయం .
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజి పువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందన శాలా సుందర చిత్ర విచిత్రాలు .
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మ వీరుల కృత రక్త నాళాలు
త్యాగ శక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు .
:)
ReplyDelete