దైవ కార్య నిమిత్తం మూడు రోజులు అమ్మ వాళ్ల వూరు వెళ్ళా .మనసు నిండా మోసుకొచ్చిన ఆధ్యాత్మిక పరిమళం అంతలోనే ఆవిరైపోతుందనుకోలేదు .మూడు రోజుల తర్వాత వచ్చానేమో ,వచ్చిన దగ్గర్నుంచి నా దృష్టి కంప్యూటర్ పైనే .
త్వర త్వరగా పనులు ముగించుకొని కంప్యూటర్ ముందు కూర్చున్నా .మూడు రోజులకే మిస్ ఐన ఫీలింగ్ .కొద్ది రోజుల్లోనే డ్రగ్ ఎడిక్ట్ లాగా ,బ్లాగ్ ఎడిక్ట్ ఇపోయానేంటా అని నవ్వుకొంటూ బ్లాగ్ ఓపెన్ చేశా .కొత్త టపాల కోసం నా కళ్లు ఆత్రంగా
వెదికాయ్.అంతే.....నిశ్చేష్టురాలినైపోయా .అటువంటి జుగుప్సా కరమైన పదాలతో ఎవరైనా టపా రాయగలరని ,నేనుహించలేదు .నాకసలే కొత్త ....ఏదో మీ అందరి ప్రోత్సాహం వల్ల ధైర్యం చేసి ఏదో మీ మధ్య కొచ్చాను .అంతే కాని .....
నిజానికి కాస్త కష్టానికే ,అది నాకైనా ,ఎదుటి వారికైనా .....వూరికే తడిసిపోయే కళ్ళూ ...కరిగిపోయే గుండే....నా బలహీనత .కాని ,ఆ అజ్ఞాత వ్యక్తి , భాష ,వ్యంగ్యత చూశాక ,ఇంకా ముందు ముందు ఇటువంటి పరిస్థితి మళ్లీ ఎదురౌతుందేమోన్న భయం .కాని తర్వాత క్షమాపణ అడుగతూ వచ్చిన టపా ముందు వ్యక్తి నుండే అంటే నమ్మశక్యంగా లేదు .అంత భాషా బేధముంది మరి .హాయిగా జీవితం సాగిపోతూ వుంటే ,ఏమిటి ఇలా పరిచయమే లేని వ్యక్తుల నుండి వచ్చే అసభ్య కరమైన కామెంట్స్ కి బాధపడుతూ ఈ బ్లాగు కొనసాగించాలా ?అని ....రోజంతా మధనపడి చివరికి కొద్దిపరిచయమే ఐనానన్ను ప్రోత్సహించిన సంస్కార వంతులైన మీతో నా బాధను పంచుకోవాలనిపించింది .పోనీ ఆపేద్దామా అంటే వూరికే బంధాలను అల్లుకోవడమేగా మానవ నైజం . మీ సాహితీ వనంలోకి కొత్త చిగురులా ఆహ్వానించారు నన్ను ........మన పరిచయాన్ని చిరు కాలంలోనే ముగించేయాలా .......లేక చెడును వదిలి ,మీ మంచితనపు ప్రపంచంలో చిరకాలం కొనసాగాలా అని .......నా అంతర్మధనం ........???
Subscribe to:
Post Comments (Atom)
పరిమళం గారు, so sad. ఒక్కటి మాత్రం నిజం. ఎదుటి వ్యక్తి సంస్కారవంతుడు కాదు అనుకున్నప్పుడు మనం బాధపడి ప్రయోజనం లేదు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ భావాలను ధైర్యంగా రాసుకుంటూ వెళ్లండి. అందరి బ్లాగర్ల సహకారం మీకు ఉంటుంది.
ReplyDeleteమరో విషయం మీరు కామెంట్లని మోడరేషన్ లో పెట్టుకోలేదు. ఇలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవడానికి మీ బ్లాగర్ సెట్టింగులలో comments అనే విభాగంలో ఉండే మోడరేషన్ ఆప్షన్ సెట్ చేసుకోండి. ఇకపై ఎవరైనా కామెంట్ రాస్తే ముందు మీకు మెయిల్ పంపించబడి ఆ కామెంట్ మీకు ఆమోదయోగ్యం అయితేనే పబ్లిష్ చెయ్యడానికి వీలవుతుంది.
ReplyDeletesridhergaru!thanks for your support.thank u very much sir!
ReplyDeleteనాకు సరిగా అర్ధం కాలేదు. మీకు జుగుప్సా కరమైన భాషతో కామెంటు వచ్చిందా? అదీనూ ఇంకొక సాటి బ్లాగరునించా? కొన్ని ్సూచనలు:
ReplyDelete1. మీరు వ్యాఖ్యల మీద మాడరేషన్ పెట్టండి.
2. పరుష పదజాలంతో వచ్చే వ్యాఖ్యలు పట్టించుకోక పోవడం మంచిది. మీ బ్లాగులో మీకు నచ్చని వ్యాఖ్యలేవైనా తొలగించే హక్కు మీకుంది.
3. మీరు తెలుగు బ్లాగు గుంపులో ఇప్పటికే అభ్యులు కాకుంటే తప్పకుండా సభ్యులుగా చేరండి. ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు తోటి బ్లాగరులు మీకు తోడుంటారు.
సాధారణంగా సమాజంలో మసలేప్పుడు మర్యాదకరమైన ముసుగు తొడుక్కునే అందరూ ప్రవర్తిస్తారు. కానీ అంతర్జాలంలో తమ నిజస్వరూపాలు యదేచ్చగా బయటపెట్టుకోవచ్చుగనక, అప్పుడప్పుడూ అసలు రూపాలు బయటపడుతూ ఉంటాయి. Being faceless can bring both best and worst within us.
ReplyDeleteమీకు ఒక చేదు అనుభవం ఎదురయ్యింది.ఇందులోంచీ మరో జీవిత పార్శ్వాన్ని నేర్చుకుని అనుభవజ్ఞుల్లా విజ్ఞుల సూచనల మేరకు కంటిన్యూ అవడమే!మీ బ్లాగుకు మీరే రాజు,రాణి,మంత్రి,సిపాయి. కానివ్వండి మీ బ్లాగు ప్రహారం.
@కొత్తపాళీ గారు !పరుష పద జాలమైతే విమర్శగా స్వీకరించి తప్పులుంటే దిద్దుకునేదాన్ని సర్ !కాని .........
ReplyDeleteమీ సలహాలు ,సూచనలు తప్పక పాటిస్తాను .మీకు నా ధన్యవాదములు .మీకు వీలైతే బ్లాగుల గుంపులో సభ్యులుగా చేరుటకు వివరాలు తెలుప గలరు .
అలాంటి చెత్త గురించి ఆలోచించకండి..మీకు మేమంతా తోడు ఉన్నాము..ధైర్యంతో ముందుకు సాగండి..
ReplyDeleteమూర్ఖులూ, వెధవలూ.. ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటారని మరోసారి అర్ధమౌతుంది. పరిమళ గారూ.. మీ బాధని నేను అర్ధం చేసుకోగలను. తోటి స్నేహితులు చెప్పినట్టుగా ముందు జాగ్రతలు తీసుకోవడమే మనం చేయగలిగిన పని. కానీ, మీరు మనసు బాధపెట్టుకోకండి. అలాంటి వాటిని వెంటనే మర్చిపోయి.. మిమ్మల్ని అభిమానించే మాలాంటి వారి మాటలకి మాత్రమే స్పందించండి..
ReplyDeleteHave a nice day..!
@మహేష్ గారు !మీరు చెప్పింది అక్షరాలా నిజం .మీ ఆదరానికి కృతజ్ఞురాలిని .
ReplyDeleteసంస్కారహీనుల మాటలకు విలువనివ్వకండి. ఎంత కాదనుకున్నా మనల్ని ఒక్కమాట అంటే ఉలికిపడే మనస్తత్వం నాదికూడా. కానీ తాటకుచప్పుల్లకి బయపడి బ్లాగులోకానికి దూరంకానవసరంలేదు. మేమంతా మీవెంట ఉంటాం. ఆలస్యంగా చెబుతున్నందుకు అన్యదాభావించకపోతే తెలుగు బ్లాగులోకానికి స్వాగతం. కూడలి లో మీ బ్లాగుని చేర్చండి. http://muralidharnamala.wordpress.com/
ReplyDeleteశ్రీనివాస్ గారు !మధురవాణి గారు !మురళి గారు !
ReplyDeleteమీ అందరి ఆదరాభిమానం చూస్తుంటే అసహ్యించు కోవాల్సిన ఆ అజ్ఞాత వ్యక్తికే thanks చెప్పాలనిపిస్తుంది .మీ అండ దండలు ,మెండుగా వున్నాయని అతని వల్లేగా తెలిసింది మరి .నా అక్షరాలతో పాటు నా అంతర్మధనాన్ని కుడా పంచుకున్న మీ అందరికి నా వినమ్ర పూర్వకమైన ధన్య వాదములు .
http://groups.google.com/group/telugublog
ReplyDeleteYou will find all the information you need and a link to join membership.
All the best
thank u sir
ReplyDeleteపరిమళం గారు: చదివిన తరువాత నిజంగా బాధ అనిపించింది. నాలురు రోజుల క్రితం నేను ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు. కాని, మనం పట్టించుకొని బాధ పడ్తున్నామని తెలిస్తే సూదితో గుచ్చి మరీ బాధ పెడ్తారు. కాబట్టి వదిలేయండి. కామెంట్స్ moderation పెట్టండి. ఎంతో మంది పెద్దవారు, బ్లాగు మిత్రులు మీకు అండగా ఉన్నారు. కాబట్టి భయం లేకుండా హ్యాపీగా బ్లాగు రాస్తూ ...టపాల పరిమళాలను వెదజల్లండి. ఆస్వాదించడానికి మేమున్నాము. టపా అంటే గుర్తొచ్చింది. నేను ఈ మధ్యే ఈ anonymous ల గురించి టపా రాసాను. చదివి నవ్వేసుకొండి. బాధకి అంతకు మించి ఔషదం లేదు. all the best.
ReplyDelete@ramani garu thanks for your support.
ReplyDeleteబ్లాగర్ లో ఉన్న పెద్ద లోటు ఇది . ఎవరు కామెంట్ చేసారో తెలీదు . అయినా ఇలాంటి కామెంట్లను అస్సలు పట్టించు కోనక్కర్లేదు . వెంటనే డిలీట్ చెయ్యడమే . కామెంట్స్ moderation పెట్టండి. ఎవరో ఒకరిద్దరు కోసం మనం బ్లాగురాయడం ఆపివేయక్కర్లేదు . అలాచేస్తే ఆ అనామక వాఖ్యాత విజయం సాధించినట్లే.
ReplyDeleteనమస్తే, పిరికి సన్నాసులు రాసే కామెంట్స్ ని పట్టించుకోకండి. వాళ్లు కొజ్జా నా కొడుకులతో సమానం. మొన్నామధ్య కూడా ఓ వెధవ ఓ వాగుడు వాగాడు. నా style లో సమాదానం వదిలా. అంతే, కొడుకు కిక్కురుమనలే. మీరు దైర్యంగా ముందుకు సాగిపొండి.
ReplyDelete@ shiva garu! thanks for your suggestions.
ReplyDelete@ krishna garu! thanks for your support.