Monday, March 30, 2009

వేటగాడివి నువ్వు ....


నా మనసు ముంగిట పూచిన అందమైన
గులాబీవి నువ్వనుకున్నా ....అందుకే
నిర్లక్ష్యమనే ముల్లుతో ఎప్పుడూ
నా గుండెల్లో గుచ్చుతూ ఉంటావ్

నా కలల వాకిట అల్లరి దొంగవి
నువ్వనుకున్నా .......కానీ
పొద్దస్తమానం నా పెదవుల్ని వీడని
నా చిరునవ్వుని దొంగిలించావ్

నిజానికి ఏమాత్రం దయలేని
వేటగాడివి నువ్వు ....
నా ఆశల పావురాన్ని
నీ మాటల తూటాలతో
కౄరంగా వేటాడి చంపేస్తున్నావ్ !

20 comments:

  1. సూపర్ గా ఉందండి... చాలా బాగా రాసారు...!

    ReplyDelete
  2. చిత్రానికి తగినట్లుగా చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  3. పరిమళం గారూ ....

    ఇక నేనేం చెప్పను
    నేనింకేం చెయ్యను ..

    ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
    ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.
    ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..

    నా మనసు మొక్క మనుగడ కోసం
    చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
    మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
    మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
    నా ఆశ గులాబీలవి.. నా రుధిర జ్ఞాపికలవి
    అవును కేవలం నీకోసం.. విధినేమనను ?

    నా ముళ్ళపైనే నీ కళ్ళు..
    నీ మునివేళ్ళపైనే నా ముళ్ళు..

    నీ నా ల బేధాలున్నాయని
    ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
    నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
    నా మది గాయాలకు నవనీతాలు కావూ .. ?
    నీవన్నీ నావనుకున్నా.. నేనే నీవాడనుకున్నా
    ఆ నవ్వులు నీవంటావా ... ? అబ్బా..
    ఇప్పుడే నా మనసు మీద మరో ముల్లు
    మొలిచింది.. గుండెకు గుచ్చుకుంది..
    చూశావా.. నీకోసం. మరో ఎర్ర గులాబీ పూసింది ?


    వేటగాడినా.. ?
    నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
    గుండె గాయాలు పూడ్చుకుంటూ..
    నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
    విధి వెల్లువలో కొట్టుకు పోతున్న ..
    పండుటాకును నేను...
    నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న
    చకోరాన్ని నేను..
    నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
    దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
    ఆలు చిప్పను నేను.
    నీకై గులాబీలు పూయిస్తున్నా
    నా గత జ్ఞాపకాల కంపను నేను..

    ReplyDelete
  4. చాలా చాలా బాగా రాసారు.

    ReplyDelete
  5. aaa maatala venuka marmamemainaaaa daagundemo... aalochinchaaraa...orikine.. :)

    chakkagaa vundi..

    ReplyDelete
  6. చాలా బాగుంది nice one

    ReplyDelete
  7. బాగుందండి.. నాకెందుకో ఆ ఫోటో మీలో కవితావేశం రగిల్చిందేమో అని సందేహం..

    ReplyDelete
  8. విజయ్ గారు , శ్రీనివాస్ గారు , జయ చంద్ర గారు , చైతన్య గారు , విజయ్ మోహన్ గారు , పద్మార్పిత గారూ ..అందరికీ నా కవిత నచ్చినందుకు ధన్యవాదములు .

    ఆత్రేయ గారు , ఇక నేనేం చెప్పగలను , మది గాయాలకు మీ కవితా నవనీతాన్నద్దుతుంటే ఆస్వాదించడం తప్ప !ముళ్ళ కంపకు కూడా గులాబీలు పూయించగల మాయాజాలం మీ కలం !

    అరుణాంక్ గారు , శివగారు , నేస్తం గారు , పృధ్వి గారు మీ స్పందనకు కృతజ్ఞతలండీ ....

    మురళి గారూ ! కవిత రాసాకే బొమ్మ వెతికాను .అది అతికినట్టు సరిపోవడం అదృష్టం .ధన్యావాదాలండీ !

    ReplyDelete
  9. mottamodataga chaala thanx andee. . . meeru naa `musugu mokhanike` ani raasina vishyaniki response ichhinanduku.
    Aite vishyaanni anta merake raste baaguntundi anukuni raasanu. endukante chadive vaallaki boar kottakoodadu kada.
    Ainappatikee mee soochanani gamaninchanu.
    mee blog baagundandee
    keep it up

    ReplyDelete
  10. పరిమళం గారు,
    మీ కవితలో నిరాశ కూడదు.మన ఆపేక్ష చాలాసార్లు ఎదుటివారి ఉపేక్షగా ఉండవచ్చు,భావకవితలోనైనా సరే మహిళ ఆత్మ గౌరవానికి భంగం కలిగించకండి.మీకవితలో అతని నిర్లక్షానికి కుములుతూనే అతడి సాంగత్యాన్ని వేడుకున్న భావం పలకడం ఓరకంగా స్త్రీని చులకన చేయడమే. కాస్త అలోచించండి.
    ఆత్రేయ గారు,
    మీ సమాధాన కవితలో చివరకు కంపను అంటూ రాసి ముందు రాసిన కవితా ఝరిలో పెద్ద బండ వేశారు.కంప అనే పదం వల్ల కవిత పలుచనయ్యింది. కవిత్వం అంటే పదసంపదనే కదా. అక్కడ సమానార్థ మైన మరో పదం వాది వుండాలి. పదాలలొ రిచ్ నెస్ ను మరిచి పోకండీ
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  11. చాల బాగుందండి ,బాగా రాసారు ,హృదయం నుండి వచ్చాయి.

    ReplyDelete
  12. పరిమళగారూ, మీ కవిత ఎ౦దరి కవులని పరుగులు పెట్టిస్తో౦దో చూసారా? ఆత్రేయగారిలాగా మీ కవితకు నేను ఓ సమాధానమిస్తున్నాను.

    గులాబిన౦తా గుభాళిని౦పి, ముళ్ళూ కుళ్ళును అచేతన౦ చేసి
    మకర౦దమ౦తా నీకై మిగిల్చి, మన సహగమనమ౦తా పూబాటగ మార్చడ౦లో
    మునిగియున్నాను కాని నాది నిర్లక్ష్య౦ కాదు నా ప్రాణమా!

    ప్రయాణమ౦తా ఒ౦టరితనమై, జీవితమే దుర్లభమని భ్రా౦తిని దూర౦చేసి
    మనోతల౦పై మరిగిన భారీవిరహ౦ నెమలిఈక౦త తెలిక చేసి
    నా నడకను నడిపి౦చే౦దుకు నాకు మిగిలిన మ౦త్ర౦ నీ చిరునవ్వే కదా స్నేహమా!

    నా మాటలు తూటాలైతే అవి నన్ను కూడ చ౦పగలవని
    నీ మాటలు ఇలా పేలవమైతే అవి నా రాకకు వేగ౦ నేర్పునని
    నీ కన్నీటిచుక్కే నా గు౦డెకి గుణపమని నమ్మే నా హృదిరొదని చూడలేవా ప్రేమా!

    వేటగాడినే నేనని నీవూ, కాని నీ ప్రేమే నా వేట అని నేను, నమ్మవా నా జీవితమా!

    ReplyDelete
  13. Please go to http://ayodhya-anand.blogspot.com/2009/03/blog-post_31.html

    I took the lenience without your permission. I hope it is okay with you.

    ReplyDelete
  14. పరిమళం గారూ..
    మీ కవిత చాలా చక్కగా ఉంది ఎప్పటి లాగే..బొమ్మ భలే సెలెక్ట్ చేసుకున్నారు.
    మీ కవితకి ఆనంద్ గారు కూడా స్పందింఛి మరో కవిత రాశారు చూశారా?
    http://ayodhya-anand.blogspot.com/2009/03/blog-post_31.html

    ReplyDelete
  15. @ వేద గారూ ! థాంక్స్ .

    @ సుబ్బారెడ్డి గారూ !ఎంత గంభీరతను ఆపాదించుకున్దామన్నా స్త్రీ సహజమైన బేలతనం అప్పుడప్పుడూ బైట పడుతూనే ఉంటుంది ....ధన్యవాదాలు .

    @ చిన్ని గారు ,ధన్యవాదాలు .

    @ ఆనంద్ గారు! ఆత్రేయగారు ,మీరు నా చిన్ని కవితకు స్పందించటం ...అదీ ఇంతందంగా ....నా అదృష్టంగా భావిస్తున్నాను . ధన్యవాదాలండీ .

    @ మధురవాణి గారూ !థాంక్సండీ ....ఆనంద్ గారి స్పందన చూశాను ...నా కవిత కంటే స్పందనలే అధ్బుతం గా ఉన్నాయండీ .

    ReplyDelete