"బాల్యం ఓ తీపి జ్ఞాపకం" కవిత రాసినపుడు కొత్తపాళీ గారు తల్లితండ్రుల చిన్నతనం గురించి తెలుసా అని అడిగారు .అమ్మా నాన్నల చిన్నతనం గురించి చెప్పాలంటే ...చిన్న నవలవుతుందేమో ( మాకు చెప్పినవి మాత్రం ). తరానికి తరానికి బాల్యం లోని అనుభూతుల్ని కోల్పోతున్నామేమో అనిపిస్తుంది .
అమ్మా నాన్నలు ....వారు మనకు కధలు కధలుగా చెప్పే వారి బాల్యం మన పిల్లల్ని ఆశ్చర్య పరిచే నిజం .కొన్ని తరాల తర్వాతి పిల్లలకు నమ్మలేని నిజం .
మా అమ్మా నాన్నలు చిన్నప్పటి విషయాలు చాలా చెప్పినా .....నేను నాకు నచ్చిన ఒక విషయం ప్రస్తావించ దలచుకున్నాను .అది .....పంచుకోవడం .....అవును ...పంచుకోవడమే ....దానివల్ల పెరిగే ఆప్యాయత ,సాయం చేసే మనస్తత్వం అలవడటం ....వింటూవుంటే ఎంతో బావుండేది .
అప్పట్లో ప్రతీ ఇంట్లోనూ ఐదు లేక ఆరుగురు ...ఇలా అధిక సంఖ్యలో సంతానం ఉండేది .అక్కా చెల్లెళ్ళు పూలను అందరూ కలిసి కట్టుకొని తలా ఓ ముక్క తుంపి పెట్టుకోవడం , అన్నదమ్ములు ,సంతకెళ్ళి కూరగాయలు కొనగా మిగిలిన రెండు పైసలతో తినుబండారాలు కొనుక్కుని సమంగా పంచుకొని తినడం ( ఈ పంపకాల్లో గిల్లి కజ్జాలు సరేసరి ) ఇంట్లో కోడి పెట్టిన గుడ్లను వండి సగం ముక్కలు చేసి పిల్లలందరికీ వేయడం ....ఇలాగన్నమాట .అసలు అమ్మ వాళ్లు ఐదుగురు అక్క చెల్లెళ్ళు .వారం వారం తలంటు పోసుకోవడమే ఓ పండగలా ఉండేదట .ఇక పండగ వస్తే చెప్పక్కర్లేదు .ఇవన్నీ అమ్మా నాన్నలు చెబుతుంటే మాకు కధలాగే ఉండేది .
ఇక మాతరం ..... ఇద్దరు లేక ముగ్గురు ...సౌకర్యాలు కాస్త ఎక్కువగా అందేవి .ఉన్నంతలో ఎవరికీ కావాల్సినవి వారికి అమర్చి పెట్టడంతో ప్రతీది పంచుకునే అవసరం కాస్త తగ్గింది .అయినా పెద్దవాళ్ళ పుస్తకాలు రెండో వాళ్ళూ ఆ తర్వాత తెలిసిన వాళ్ళకి ...ఇచ్చి పుచ్చు కోవడం జరుగుతూ ఉండేది .అలాగే బట్టలూను ...నా చిన్నప్పుడు నా బట్టలు పిన్నికి (మా పిన్ని కూతురు ) ఇచ్చేదాన్ని ,నా తర్వాత నా పుస్తకాలు ఇద్దరు చదువుకునే వారు ,సెలవులకి మా అమ్మమ్మ వాళ్ల వూరు వెళ్తే బెల్లం ఆడేచోట పానకం తాగేవాళ్ళం , పొలానికి వెళ్లి గట్లవెంబడి కన్ది కాయలు కోసుకునేవాళ్ళం ...ఇలా చెప్తే మా పిల్లలు కధలుగానే వినేవాళ్ళు .ఇప్పటి వాళ్ళకీ అనుభవాలు లేవు మరి సెలవులిస్తే సమ్మర్ కేంప్ లు ,కంప్యుటర్ కోచింగ్ లు తప్ప .
ఇక ఇప్పుడు ...ఆడైనా , మగైనా ...ఒక్కరే ...( దేశ జనాభా పెరుగుతుందని కాదు )మళ్ళీ ఇద్దర్ని కంటే వార్ని చదివించడం ,ఆస్తిపాస్తులు పంచి ఇవ్వడం కష్టమని ...( తల్లితండ్రులు చివరి వరకూ తోడుండరు .కాబట్టి కనీసం ఇద్దర్ని కంటే కష్టం లోనూ ,సుఖం లోనూ ఒకరికొకరు తోడుగా ఉంటారని నా అభిప్రాయం )
ఒక్కరే కాబట్టి అతి గారాబం ,అవసరానికి మించి అన్నీ అమర్చి పెట్టడం ,అది తాహతుకు మించినదైనా సరే తమ పిల్లల్ని ఎలోటూ తెలియకుండా ఉంచాలన్న ఆలోచన .ఈ పోటీ ప్రపంచంలో నిలదోక్కుకునేలా చేయాలనే తాపత్రయం తో వారి బాల్యాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేసి ,బండెడు పుస్తకాల భారం వారిపై మోపుతున్నారు .బామ్మ ,తాత మాట అటుంచి తల్లి తండ్రుల ప్రేమైనా పూర్తిగా దక్కుతుందా అంటే ....అనుమానమే ,భార్యా భర్తలు ఉద్యోగాలు చేస్తుంటే ..వారితో గడిపే సమయం ఎక్కడుంటుంది ?
నేల బండ , తొక్కుడు బిళ్ళ ,ఒప్పులకుప్పా ....ఇటువంటి ఆటలు ఉంటాయని ఇప్పటి పిల్లల్లో చాలామందికి తెలీనే తెలీదు .అవన్నీ మేమాడుకున్న ఆటలు అని చెప్తే ఇప్పటి చిన్న పిల్లలు వింతగా చూస్తారు ఏదో గ్రహాంతర వాసిని చూసినట్టు (స్వీయానుభవం ) ఇప్పుడు పిల్లలు కంప్యుటర్ గేమ్స్ ఆడటమే ప్రిస్టేజ్ గా భావించే తల్లితండ్రులు కూడా ఉండటం బాధాకరం .
నాకు తెలిసిన వారి పాపను ( వారికి ఒకే పాప ) వారుండే టౌనులో కూడా ఎడ్యుకేషన్ బాలేదని ,సిటీ లో ఓ పేరున్న పెద్ద స్కూల్ లో ,హాస్టల్ లో వేశారు .కొద్దిరోజులకు ఆ అమ్మాయి ఉండనని పేచీ పెడితే ,తండ్రి ఉద్యోగ రీత్యా రాలేడు కాబట్టి తల్లి వచ్చి ఇల్లు తీసుకుని కూతుర్ని చదివిస్తోంది .తండ్రి ఎ నెలకో ఓసారి వస్తాడు .ఈ మధ్య ఆ స్కూల్ కూడా అన్ని యాక్టివిటీస్ కి సమానంగా ప్రాధాన్యత ఇస్తుంది ,ఈ ఈతలూ ,యోగాలూ మనకేం మార్కులు తెచ్చి పెట్టవు అంటూ అచ్చంగా చదువు (??) మాత్రమె చెప్పే (రుద్దేసే ) స్కూల్స్ కొత్తగా పెట్టారటగా దాంట్లో చేర్పిస్తానంటుంటే ...పాపం ఆ పిల్ల మీద జాలేసింది .ఇంతకూ ఆ పాప చదివేది ఆరవ తరగతి .
మన తల్లితండ్రుల బాల్యం మనకు ,మన బాల్యం మన పిల్లలకూ కధగా అనిపించినపుడు ...కొన్ని తరాల తర్వాత కదా చరిత్రగా ఎందుక్కాకూడదు .ఇప్పుడు మన చరిత్ర లో చదువుకోనేవన్నీ ఒకప్పుడు జరిగినవేగా ! అలాగే ముందు ముందు బాల్యం అనే పాఠాన్ని పిల్లలు పుస్తకాల్లో చదువు కుంటారేమో ....
**అన్ని కుటుంబాల్లోనూ ఇలాగే జరుగుతుందని కాదు .మన చుట్టూ పరికిస్తే ఎక్కువ శాతం ఇలాగే ఉంటున్నారని నా ఆవేదన .ఇది నా అభిప్రాయం మాత్రమే .ఎవరి మనసు నైనా నొప్పించి ఉంటే మన్నించగలరు .
Wednesday, March 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
చాల బాగా వివరించారండి ,ప్రస్తుత పరిస్తితి ని అద్దంలో చూపించారు .నిజంగా ఇప్పటి తరం "బాల్యం" భాధాకరం .
ReplyDeleteMe template baagundi.
ReplyDeleteపరిమళం! నిజంగా గుండెను తట్టి లేపారు. చహ్దువు మాత్రమే ముఖ్యమనుకుని పిల్లలకు ఆప్యాయత, సహజీవనం అలవాతు లేకుండా చేశారు. ఇప్పుడు చూడండి IT boom down అయ్యేసరికి పిల్లలంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాధ పంచుకోలేక, మరో ఉద్యోగంలో చేరలేక false image తో సతమత మవుతున్నారు. ఇప్పటికైనా తల్లి తడ్రులు కళ్ళూ తెరిస్తే బాగుంటుంది. మీ రన్నట్లు అందరూ అలాగే ఉంటారని అనుకోవడం లేదు.
ReplyDeleteమంచి సందేశం ఇచ్చారు.
చక్కటి విశ్లేషణ
ReplyDeleteచాలా బాగుందండీ మీ టపా... ఒక్కసారిగా అలా చిన్నతనంలోకి వెళ్ళొచ్చినట్టు అనిపించింది...
ReplyDeleteఅమ్మ, నాన్న వాళ్ళ చినతనం గురించిన సంగతులు వింటూ ఉంటే... అవన్నీ మిస్ అయిపోయామే అనిపించేది...ఆ పల్లెటూరి వాతావరణం... అక్కడి పద్దతులు... అవన్నీ.
కానీ అందులో కనీసం కొంత భాగమైనా అనుభవించగలిగినందుకు కాస్త సంతోషంగానే ఉంది. కానీ ఇక మా పిల్లలకి మాత్రం ఇవేమీ తెలియకుండా పోతాయేమో అని బెంగగానే ఉంది... ఒక్కోసారి అనిపిస్తుంది... పిల్లలకి అవన్నీ తెలియటం కోసమైనా... ఇవన్నీ వదిలేసి పల్లెటూరికి వెళ్లిపోవాలి అని.
నా చినప్పటి సంగతులు ,నా పెళ్లి అయినప్పటి సంగతు లు చెబితే నా మనవరాళ్ళు నిజమా అని ఆశ్చర్య పోతారు.ఇంత మంది వాకే ఇంట్లో ఎలా వున్నారు అని అంటారు.గోరంటాకు పండగ,వెన్నెల పండగా అని చేస్తూ ,కథలు చెపుతూ ,ఆడిస్తూ పాత పద్దతులు చెపుతుంటాను.వాళ్లు ఎంజాయ్ చేస్తారు కాని ఎంత ఇయినా ఆ రోజులని,ఆ సర్దాలని తేలేము.
ReplyDeleteమా అమ్మ నాన్న చెప్పిన సంగతులు రాయడానికి నాకు ఒక్క టపా చాలదు.. కొన్ని టపాలు రాయబోతున్నా.. మీరు కొండని అద్దంలో చూపించారు..
ReplyDeletevery nice post.very useful thanks.
ReplyDelete@ చిన్ని గారు ,బాల్యమొక భారం గా మోసే పిల్లలను చూస్తె జాలేస్తుందండీ .
ReplyDelete@ కార్తీక గారు , థాంక్స్ .
@ శృతి గారు , నచ్చినందుకు థాంక్స్ .
@ విజయ మోహన్ గారూ , ధన్యవాదాలండీ .
@ చైతన్య గారు , పల్లెకు వెళ్ళలేక పోయినా కనీసం సెలవులని సద్వినియోగ పరుచుకుంటే కొన్ని మధుర స్మృతులను పిల్లలకు అందించ గలుగుతాం .
@ మాల గారూ ! మీ మాటల వల్ల నైనా వారు తెలుసుకుంటున్నారు .ఇప్పుడు ఓపిగ్గా చెప్పేవారు కూడా కరువయ్యారు .స్పందించినందుకు ధన్యవాదాలండీ .
@ మురళి గారూ ! మీ శైలి ప్రత్యేకం ...మీలా అందంగా రాయలేనండీ ..ఏదో నాకు తోచింది రాస్తున్నా ...మీ పోస్టులకై ఎదురు చూస్తాము .
@ జయచంద్ర గారు , థాంక్స్ .
చాలా బాగా వ్రాశారండీ. పల్లెటూళ్ళు నాకు ఇష్టం కానీ మాకా అదృష్టం లేదు. అయితే ఆటలని మాత్రం ఎప్పుడూ ప్రోత్సహించేదాన్ని.
ReplyDeletepsmlakshmi