బాల్యం ఓ తీపి జ్ఞాపకం .......
పసితనం కాదది .....పసిడి వనం ....
బడిలో మాష్టారు వల్లెవేయించిన
సుమతీ శతకం ....
ఏడో ఎక్కం లో తప్పు దొర్లినపుడల్లా
ఝళిపించే లెక్కల మాష్టారి బెత్తం ,
చెలులతో కలిసి ఇసుకలో
కట్టుకున్న గుజ్జన గూళ్ళూ .....
బట్టలకంటిన మట్టిచూసి
అమ్మ వేసిన మొట్టికాయలు ,
నాన్న బుజ్జగింపులూ ....
బామ్మ చేతి గోరుముద్దలు
తాతయ్య చెప్పే రాజు రాణి కధలూ ....
ఇవన్నీ నిన్నటి మన తీపి జ్ఞాపకాలు
నాటి మన బాల్యం ....
నేటి పిల్లలకు ......కధైతే .....
రేపటి తరానికి ......
చరిత్రౌతుందేమో .......
బడిలో మాష్టారు వల్లెవేయించిన
సుమతీ శతకం ....
ఏడో ఎక్కం లో తప్పు దొర్లినపుడల్లా
ఝళిపించే లెక్కల మాష్టారి బెత్తం ,
చెలులతో కలిసి ఇసుకలో
కట్టుకున్న గుజ్జన గూళ్ళూ .....
బట్టలకంటిన మట్టిచూసి
అమ్మ వేసిన మొట్టికాయలు ,
నాన్న బుజ్జగింపులూ ....
బామ్మ చేతి గోరుముద్దలు
తాతయ్య చెప్పే రాజు రాణి కధలూ ....
ఇవన్నీ నిన్నటి మన తీపి జ్ఞాపకాలు
నాటి మన బాల్యం ....
నేటి పిల్లలకు ......కధైతే .....
రేపటి తరానికి ......
చరిత్రౌతుందేమో .......
బాల్యాన్ని చక్కగా వర్ణించారు .శుభాకాంక్షలు,పరిమళ గారూ
ReplyDeletesuperb.........
ReplyDeletechaalaabaagaa varnistunnaaru .subhaakaamkshalu
ReplyDelete"గుజ్జన గూళ్ళూ" ఈ పదం విని ఎన్నేళ్ళైపోయిందో! :-(
ReplyDeleteబాల్యపు మధుర జ్ఞాపకాలను మూటకట్టుకున్న మనఆదృష్టానికి మురిసిపోవాలో,ఆధునికతతోకొట్టుకుపోతూ తీపి జ్ఞాపకాలను పొందలేకపోతున్న మనపిల్లల దురదృష్టానికి బాధపడాలోఅర్థంకావడంలేదు.
ReplyDeleteనిజమే. ఇప్పటికే మన బాల్యం మన పిల్లలకు చందమామ కథలా ఉంది. అది వాళ్ళకు అందని అద్భుతం. మీరన్నట్లు రేపటి తరానికి చరిత్రలా మిగులుతుందేమో?
ReplyDeleteమీ ప్రశ్న ఆలోచనలో పడవేసింది.
ఏడేళ్ళు (ఏడు ఇంటు ఏడు) నలభై తొమ్మిది తర్వాత కచ్చితంగా తప్పు వచ్చేది చిన్నప్పుడు. చరిత్ర అవ్వకుండా చూడాల్సింది మనమేనేమో కదండీ.. ఫోటోలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యమ్గా పుస్తకాలమీద కూర్చున్న బుజ్జిది..
ReplyDeleteనిజమే... ముందు ముందు జనరేషన్ వాళ్ళు మీరు చెప్పిన తీపి విషయలేమి వాళ్ళ బాల్యంలో అనుభవించలేరేమో!
ReplyDeleteతర్వాత గేనరషన్ వరకు ఎందుకు... మనకే మన బాల్యం ఏదో పోయిన జన్మ కథలాగా తోస్తుంది గుర్తు తెచ్చుకుంటుంటే...
కాలం, విజ్ఞానం చాలా వేగంగా దూసుకుపోతున్నాయి... జ్ఞాపకాలని మరిపిస్తూ... అనుభవాలని చెరిపేస్తూ...!
chaalaa bagundi.
ReplyDeletenijamgaa balyam vaka theepi gyapakame.bagundi.
ReplyDeleteఈ పదం విని ఎన్నేళ్ళైపోయిందో! :( నెనర్లు...
ReplyDelete"దేవుడు(?)ప్రత్యక్షమై ఏంకావాలో కోరుకో అంటే ..దేవుడానాకున్న సమస్థం తీసేసుకుని నాబాల్యాన్ని వాపస్ చేయమని అడుగుతాను"అంటారు ప్రముఖ హిందీ కవయిత్రి సుభద్రకునారి చౌహాన్.ఆమె రాసిన "మేరా నయాబచ్ పన్"బాల్యపు తీపి తెలియజెప్పె కావ్యం.నేను ఆమధు ర కవితను బాల్యంలోనే చదువుకున్నాను.పాపం పుణ్యం ప్రపంచమార్గం..కష్టం..సౌఖ్యం శ్లేషార్తాలు..ఏవితెలియని పాపల్లారా...ఐదారేడుల కూనల్లారా....వానకురిస్తె..హరివిల్లు విరిస్తే..అది మీకోసమని మురిసే.... ఓహ్ అధ్బుతమైన భావన మహాకవి శ్రీశ్రీది. బాల్యం ఓ బహుమతి..యవ్వనం ఓ బ్రాంతి... వార్ధక్యం ఓ శాపం..మరణం ప్రశాంతం.. నన్నూ బాల్యానికి నడిపించారు.
ReplyDelete-సుబ్బారెడ్డి
చాలా బాగుంది.. నేనెప్పుడో రాసిన కవితని గుర్తుచేశారు.. పరికించండి.
ReplyDeletehttp://aatreya-kavitalu.blogspot.com/2007/06/blog-post_3742.html
పరిమళం గారు ఎంత బాగా చెప్పారు ,నేను బాగా ఇష్టపడేది నా బాల్యాన్నే ,జరుగుతున్నదంతా "కల"అయ్యి తిరిగి మేమంతా అమ్మ ,నాన్న లతో వుంటే ఎంత బాగుంటది అన్పిస్తాది.అనుకుంటూ వుంటాము .
ReplyDeleteInteresting theory.
ReplyDeleteLet me ask you, and all the other fine ppl who responded here .. do you have some idea of the childhood of your parents? What do you know about it? What do you think of it? Do you feel nostalgic about it? historical about it?
I am asking very sincerely .. I am very curious. What do you think about your parents' childhood? Please tell me.
కొత్తపాళీ గారు... మా నాన్నగారి చిన్నతనం గురించి అంతగా తెలిదు కానీ... అమ్మ చిన్నతనం గురించి కొంచం తెలుసు నాకు... అప్పుడప్పుడు అమ్మే చెబుతూ ఉంటుంది...
ReplyDeleteఇంట్లో అందరికంటే అమ్మే చిన్నది కావటం వలన ఎలా గారాబం చేసేవారో... ఇంటి నిండా నౌకర్లతో ఎలా ఉండేదో... తను ఇంట్లో ఏ పనీ చేయకుండా ఆటలతో ఎలా కాలక్షేపం చేసేదో... మాస్టారే ఇంటికి వచ్చి పాఠాలు ఎలా చెప్పేవారో... తన స్నేహితురాళ్ళతో కలిసి ఏమేం కొంటె పనులు చేసేవారో... అప్పట్లో వాళ్ళు ఎలాంటి ఫ్యాషన్ ఫాలో అయ్యేవారో (దుస్తుల్లో, hairstyle లో...)... పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అవుతుందేమో అన్న భయముతో పరీక్షే రాయకుండా ఎగ్గొట్టిన సంగతి...
ఇంకా... నాన్నగారు అమ్మకి రాసిన ప్రేమలేఖల గురించి... అవి అమ్మ చేతికి అందటానికి ఆయన పడిన పాటల గురించి...
ఇలా కొన్ని సంగతులు తెలుసు నాకు అమ్మ బాల్యం గురించి. నాన్నగారి బాల్యం అంతగా తెలీదు.
కానీ ఆ సంగతులన్నీ వింటున్నప్పుడు మాత్రం... నేనెందుకు ఆ కాలంలో పుట్టలేదా అనిపిస్తూ ఉంటుంది నాకు... ఆ సరదాలు... ఆ పల్లెటూరి వాతావరణం... ఆ ఆటలు పాటలు... అబ్బా... నేనేం మిస్ అయ్యానో... అవుతున్నానో... ఇంకా మా పిల్లలు ఏం మిస్ అవుతారో తలచుకుంటేనే మాత్రం బాధగా ఉంటుంది!
బాల్యం ఓ తీపి జ్ఞాపకం........
ReplyDeleteయెంతో మధురం.. పరిమళం గారూ.. మంచి కవిత .
@ జయ చంద్ర గారు, ధన్యవాదాలు .
ReplyDelete@ awarnece of indians gaaru ,thanks!
@ దుర్గేశ్వర గారు ,ధన్యవాదాలు .
@ దిలీప్ గారు :) :)
@ సుబ్బా రెడ్డి గారు ,ప్రముఖ రచయితల అమృత తుల్యమైన రచనల్ని ఉదాహరించటమే కాకుండా ,నాలుగు పదాల్లో మనిషి జీవితాన్ని నిర్వచించారు .....మీ స్పందన కు ధన్యవాదాలు .
@ విజయ మోహన్ గారు ,నా ఆవేదన అదేనండీ !
@ శృతి గారూ ,అందరికీ ఇదే ఆలోచన వస్తే ముందు తరాలకు అందమైన బాల్యాన్ని అందించగలం .
@ మురళి గారు ధన్యవాదాలు ...బుజ్జి పాప తరుఫున కూడా :)
@ చైతన్య గారూ మీకు కృతజ్ఞతలు .నా టపాకు మాత్రమె కాదు కొత్తపాళీ గారి కామెంటుకు కూడా స్పందించినందుకు ధన్యవాదములు .
@ మాల గారు ,థాంక్స్ .
@ ఆత్రేయ గారు ,మీ కవిత చదివానండీ .నేనుకోరుకునేదీ అదేనండీ .
@ చిన్ని గారు ,ఊహలకే రెక్కలు వస్తే మరి బాల్యం లోకి ఎగిరిపోమా ...
@ కొత్త పాళీ సర్ !ముందుగా నా పోస్ట్ చదివి స్పందించినందుకు ధన్యవాదాలు .మా తల్లితండ్రుల చిన్నతనం గురించి చెప్పాలంటే చిన్న నవల అవుతుంది :) నేను కవితలో రాసిన ఉద్దేశ్యాన్ని నిన్న -నేడు -రేపు ? అనే టపా గా రాశాను .నా ఉద్దేశ్యం మళ్ళీ కరెంట్ లేని ,ఇంతింత చదువులు లేని ......ఇలాంటి బాల్యం కోరుకుంటున్నానని కాదు .కానీ కనీసం మనం సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపిన ,టెన్షన్ లేని బాల్యాన్ని కొంతవరకైనా ముందు ముందు పిల్లలు అనుభవించాలని నాకోరిక .వెనుకటి తరంలో ఆడ పిల్లలను తక్కువ చదివించటం , బాల్య వివాహాలూ ...ఇటువంటివి దాటి వచ్చినందుకు సంతోషంగానే ఉంటుంది .
@ ఆది శేషారెడ్డి గారూ !ధన్యవాదాలండీ .
చాలా బాగా రాసారు అండి .. ఈమద్య మిస్ అయ్యాను అందరినీ
ReplyDelete