Saturday, March 21, 2009

క్షణమొక యుగం ....


నువ్వుంటే ప్రతి యుగమూ
ఒక్క క్షణమై కరిగిపోతుంది
లేకుంటే ప్రతీ క్షణమూ ...
ఒక యుగమై నిలిచిపోతుంది
నిన్ను చూడనిదానికంటే
నువ్వు దూరంగా ఉన్నావన్న
భావనే ...నా నిద్దురని తరిమేస్తోంది
ఈ రోజు కూడా నువ్వు రావన్న నిజం
నా పెదవిపై చిర్నవ్వుని చెరిపేస్తోంది
నీక్కూడా ఇలాగే ఉండి ఉంటుందనే
తలంపు నా కంటి చివరి
నీటి చుక్కని ఆపేస్తూంది ...

17 comments:

  1. ఎవరితో పంచుకుంటే నీ సంతోషం ద్విగుణీకృతమవుతుండో,ఎవరితో నీభాధ పంచుకుంటే సగమవుతుందో వరి పట్ల నీకున్నది స్నేహం అని అంటారు ఒక చోట వీరేంద్ర నాథ్.అదే మరి కాస్త దగ్గరితనమైతే అది ప్రేమే అయివింటుంది కాబోలు.మీ కవిత్వం మనసు గాయాలను రేపింది. అయినా మీరు వచనాన్ని మరింత కవిత్వీకరించాల్సి వుంది.
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  2. చక్కని భావన.మంచి కల్పన

    ReplyDelete
  3. "నీక్కూడా ఇలాగే ఉండి ఉంటుందనే
    తలంపు నా కంటి చివరి
    నీటి చుక్కని ఆపేస్తూంది ... "
    ...బాగుందండి...

    ReplyDelete
  4. చాల బాగుంది...

    ReplyDelete
  5. నీవై నిండిన నా ఆలోచనలు...
    దూరాన్ని.. లెక్క పెట్టుకుంటున్నాయి ..
    ఎదురు చూపులు నిండిన కాలాన్ని.. జమ కట్టుకుంటున్నాయి..

    చాల బాగుంది.. :)

    ReplyDelete
  6. "నీక్కూడా ఇలాగే ఉండి ఉంటుందనే
    తలంపు నా కంటి చివరి
    నీటి చుక్కని ఆపేస్తూంది ... "

    ఇందులో అవతలి వ్యక్తి మీద, ఆ వ్యక్తికి మీ మీద ఉన్న ప్రేమ మీద... మీకున్న "నమ్మకం" కనపడు తోంది. అది ఉన్న చోట బంధం దూరమయ్యే కొద్దీ దగ్గరను పెంచుతుంది." ఆ వ్యక్తులు దూరంగా ఉన్నా.. వారి మనసులు దగ్గరగానే ఉంటాయి..."

    చాలా బాగుంది కవిత :)

    ReplyDelete
  7. నిజమేనండి మనకిష్టమైన వారి సమక్షం గంట నిమిషంలానేవుంటది .

    ReplyDelete
  8. @ చైతన్య గారు , థాంక్స్ .

    @ సుబ్బారెడ్డి గారు ,ధన్యవాదాలండీ ...మీ సూచన... తప్పక ప్రయత్నిస్తాను .

    @ దిలీప్ గారూ ! ధన్యవాదాలు .

    @ జయచంద్ర గారు , కవిత నచ్చినందుకు ధన్యవాదములు .

    @ మురళి గారూ !ఆ తలంపే నాచేత పై వాక్యాలు రాయించిందండీ ....

    @ చైతన్య .ఎస్ గారు , థాంక్స్ .

    @ పద్మార్పిత గారూ , ధన్యవాదాలండీ .

    @ శివ గారూ ! కొనసాగింపు చాలా బావుందండీ ...నా మనసులోకి తొంగి చూశారా ఏం ? నాలో భావాన్ని అచ్చంగా రాసేశారు .

    @ విజయ్ గారూ , నా చిన్ని కవితను ఎంతబాగా అర్ధం చేసుకున్నారు ?( మీరు మానసిక విశ్లేషకులా ... :) ) మీ స్పందనకు థాంక్స్ .

    @ చిన్ని గారు , ఎప్పుడోకప్పుడు అందర్లోనూ కలిగే భావాలే ఇవి . నేను రాసిన అతి సామాన్యమైన వాక్యాలకు విలువనాపాదించినవి మీఅందరి అభిమాన పూర్వకమైన స్పందనలే .అందుకు కృతజ్ఞురాలిని .

    ReplyDelete
  9. ఏదో ఓ రోజు నువ్వు, నేనూ నవ్వే క్షణంలో
    అదే నీటి చుక్క ఆనందానుభూతిగా వెలికివస్తుంది..
    - ఈ ప్రేమ, ఆత్మీయులకి దూరంగావుండాల్సిన భావనలు అంతులేనంత వ్యధని, మధురమైన విరహ భావనని ఒకేసారి కలగలపి పంపేస్తాయి.

    మునుపెపుడో నేను వ్రాసుకున్న విరహ భావన తాలూకు ఓ చిన్న వరస ఇది.

    నా మనసు ఆకాశగంగ అంత అమృతంగా, తనువు పాలధార అంత మధురంగా, త్రివేణి సంగమంలో స్నానంచేసి, కళ్యాణ శ్రీనివాసుని సన్నిధిలో, వెదురు పుష్పం మీద పవళించి, నీలో కరగాలి అదీ నువ్వు,
    నా మనసుకి అధిపతి, తనువుకి సర్వాధికారివి, నా ప్రేమకి పిపాసివి, నా చూపుకి బానిసవీ అయిన ఘడియల్లో. చూసావా, తీరకపోయినా ఈ కల ఎంత తీయగా కాలాన్ని కరిగించగలదో. ఏ ధనం ఇస్తుంది ఇంత తృప్తి?

    ReplyDelete
  10. parimaLam gaaru caalaa baagundi mii abhivyaktiikaraNa. abhinandanalu.

    ReplyDelete
  11. చాల చాల బాగుంది

    ReplyDelete
  12. పరిమళ గారు, ఈ విరహావేశ౦ నన్నూ కబళి౦చి౦ద౦డోయ్. నాలోనూ ఓ చిన్న పిల్లకవి ఉన్నాడుగా, ఒరేయ్ అబ్బయ్ నా బాధని ఓ కవితగా రాయరా అన్నానోలేదో, అ౦తే ఠపీమని రాసి పడేసాడు. కాని సున్నితత్త్వ౦లో ఉన్న పరమార్ధ౦, సౌ౦దర్య కఠిన పదాల వాడుకలో ఒక్కోసారి కనిపి౦చదు. ఆ సున్నితత్త్వాన్ని అ౦దరూ స్పృశి౦చలేరు. మీరు చెయ్యగలరు. అ౦దుకు జోహార్లు. ఇ౦తకీ ఉషగారు రాసినట్టూ, నేను రాసి౦ది కూడా మీరు చదవాలి మరి. మీ కవిత చూసాక నా కవిత గుర్తొచ్చి౦ది.

    ఏడిపించే జీవితం దూరాన్ని పెంచింది
    మా మధ్య ప్రతి జ్ఞాపకం కన్నీరు కార్చింది
    లోకాన్ని చూపించి తనకెన్దుకంటుంది
    నన్ను మించిన తోడు ఇంకెవ్వరంటుంది
    తను లేని నా గుండె ఒంటరిగ మిగిలింది
    కనులార చుపుకై ఎదురుచుపె మిగిలింది
    పదిలంగ మురిపెముతో నాలోనె కలసింది
    తన రాకతో బ్రతుకు కలలాగ సాగింది

    ReplyDelete
  13. @ ఉష గారు , ఆనంద్ గారు ....గురుశిష్యులిద్దరూ ( ఇలా అనొచ్చా ? ఆనంద్ గారు ఒకసారి ఉషా గారు ఇన్స్పిరేషన్ అన్నట్టు గుర్తు ) వెదజల్లిన కవితా పరిమళాలతో నా బ్లాగ్ గుభాళించిందండీ .....ధన్యోస్మి ....
    ఆనంద్ గారూ ! మీరు పిల్లకవైతే ....మరి నేనెక్కడుంటానో .....

    @ నేస్తం ! థాంక్స్ .

    ReplyDelete
  14. ఇలా అనచ్చా ఏమిట౦డీ? అని నా స్థాయిని పె౦చేసారు. It is an honor and I must thank you. ఉషగారొక్కరే కారు, నా ఒక్కొక్క కవితనీ అభిమాని౦చి నాకూ నాలోని పిల్లకవికీ ప్రేరణ అయ్యి ప్రాణ౦ పోస్తున్న మీవ్యాఖ్యలూ మీరు కూడా నాగురువులే కదా. ఒకసారి కాదు, నా ప్రయత్నాన్ని మెచ్చి వ్యాఖ్యల౦ది౦చిన ప్రతిసారీ మీరూ ఆవిడా కూడా నాకు ఇన్స్పిరేషనే! మీ అ౦దరి ను౦చి నేను చాలా నేర్చుకున్నాను, ఇ౦కా చాలా నేర్చుకోబోతున్నాను. The more you know, the more you realize how less you know. Right?

    ReplyDelete