Wednesday, November 11, 2009

దివ్యగుణములు


మానవునికి కావలసిన దివ్యగుణములు పదహారు అని పెద్దలు చెప్తారు అవి .....
1. పరమాత్మునియందు సంపూర్ణ విశ్వాసం
2. ఆత్మలో దృఢత
3. ఆలోచనలో పరిపక్వత
4. మనస్సులో సంతుష్టత
5. బుద్ధిలో దివ్యత
6. సంస్కారములో శ్రేష్టత
7. దృష్టిలో పవిత్రత
8. మాటలో మధురత
9. కర్మలలో కుశలత
10. సేవలో నమ్రత
11. వ్యవహారములో సరళత
12. స్నేహములో ఆత్మీయత
13. ఆహారములో సాత్వికత
14. జీవితంలో సత్యత
15. వ్యక్తిత్వంలో రమణీయత
16. నిద్రలో నిశ్చింతత

పై పదహారు దివ్యగుణములు ప్రతి ఒక్కరూ వీటిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి .
ఎక్కడో చదివినప్పుడు రాసిపెట్టుకున్నవి మీతో పంచుకోవాలని ఈ టపా !

9 comments:

  1. మంచి విషయాన్ని తెలియచేసారు, ధన్యవాదములు!!

    ReplyDelete
  2. 1. పరమాత్మునియందు సంపూర్ణ విశ్వాసం = పరిపూర్ణంగా
    2. ఆత్మలో దృఢత = తెలీదు
    3. ఆలోచనలో పరిపక్వత = బ్రహ్మాండంగా
    4. మనస్సులో సంతుష్టత = తీవ్రంగా
    5. బుద్ధిలో దివ్యత = తెలీదు
    6. సంస్కారములో శ్రేష్టత = అనే అంటారు
    7. దృష్టిలో పవిత్రత = మెండుగా
    8. మాటలో మధురత = అనుమానమే
    9. కర్మలలో కుశలత = అంటే ఏంటి
    10. సేవలో నమ్రత = అవుననుకుంటా
    11. వ్యవహారములో సరళత = కనుక్కోవాలి
    12. స్నేహములో ఆత్మీయత = పుష్కలంగా
    13. ఆహారములో సాత్వికత = స్వచ్చంగా
    14. జీవితంలో సత్యత = కొంతవరకు
    15. వ్యక్తిత్వంలో రమణీయత = సమృద్ధిగా
    16. నిద్రలో నిశ్చింతత = ఎంచక్కా

    అంటే ఇపుడు నేను 80% దివ్య మానవ్ అనమాట

    ReplyDelete
  3. నాకు దైవత్వం మీద నమ్మకం లేకపోయినా మిగిలినవన్నీ వొనగూరాలని కోరుకుంటూన్నా.

    ReplyDelete
  4. ఈ దివ్యగుణాలు చాలా బాగున్నాయి పరిమళ గారు. కాని ఇబ్బందల్లా అనుసరించటంలోనే ఒస్తుంది. ఇది చదువుతూ ఉంటే నాకు బుద్ధుడి 'అష్టాంగిక మార్గాలు ' గుర్తుకు ఒస్తున్నాయి.

    ReplyDelete
  5. పన్నెండు ఖచ్చితంగా, ఓ రెండు కాస్త అటుఇటుగా, కనుక ఫర్వాలేదీ జీవాత్మ సంగతి. :)

    ReplyDelete
  6. బాగుందండీ టపా...

    ReplyDelete
  7. good post...but i must confess my true feelings for you...you are a woman with a "heart of gold"...

    ReplyDelete
  8. @ గణేష్ గారు ,thanks!

    @ శ్రీనివాస్ గారు ,మీరు సూపరండీ ..

    @ వర్మగారు , అల్ ది బెస్ట్ !

    @ జయగారు ,నిజమేనండీ ...కానీ ప్రయత్నించడంలో మనలోపం ఉండకూడదు కదండీ !

    @ ఉష గారు ,అభినందనలు

    @ మురళిగారు ,ధన్యవాదాలండీ !

    @ తృష్ణ గారు , మీరు అభిమానంతో అంటున్నారు కానీ ..నిజానికి ఆ 13, 14 పాటించడం ఎంతకష్టమనుకున్నారు నేనింకా ప్రయత్నించడంలోనే ఉన్నానండీ ....మీ అభిమానానికి ధన్యవాదాలండీ !

    ReplyDelete
  9. chaalaa baagundi mam mi blog keep it up

    ReplyDelete