Friday, November 13, 2009

గండుతుమ్మెదవు!!


నేస్తం ??
నువ్వేం
చేసినా నేను నిన్ను ద్వేషించలేను
నేనేం చేసినా నువ్వు నన్ను ప్రేమించలేవు
పువ్వుపువ్వునీ పలకరించు గండుతుమ్మెదవు నీవు
రేయంతా నీకై వేచి వేచి ......
అలసి రాలిన పారిజాతాన్ని నేను! Add Imageపువ్వు పువ్వునీ తట్టే నీకు
పారిజాతం విలువేం తెలుసు ?
మకరందపు రుచులు తప్ప
పూల పరిమళమెందుకు నీకు?
నువ్వు నిర్లక్ష్యంతో ఎగిరెళ్లిపోతేనేం
దైవసన్నిధిలో నాచోటు పదిలం !


14 comments:

 1. meeru chaduvukuni vunte, thappakunda manchi patala rachayata ayyevaaaru. andhra desaniki antha adrushtam ledu mari.....

  ReplyDelete
 2. అదేమిటండి మా వూరి గండు తుమ్మెద ఇలా చెప్పమంది మీ పారిజాతాని కి:
  సరే సందె వెలుగు ను చందమామ సొంతచేసుకుంటున్నవేళ వొస్తే ముడుచుకునుంటావు
  వెన్నెలమ్మ లేని చీకటి రాత్రి ఒంటరి గా కలుద్దామని ఆశతో ఝుంకారాన్ని కూడా ఆపి నెమ్మది గా వస్తే ఎక్కడుంటావో తెలియదు గుస గుస గా పరిమళాల వూసులు వినిపిస్తావు సరి సరి అని నిరాశ తో నా మనసును వోదార్చుకుని పొద్దుట వచ్చే సరికి వయ్యారి భామ పూల సజ్జలో హొయలొలుకుతు వెక్కిరిస్తావు ఏమి చెయ్యను చెప్పు సరే నువ్వు ఆయన సొంతమని ఒక నిట్టూర్పు ఎండ గాలికి తోడు కలపటం తప్ప.

  ReplyDelete
 3. "రేయంతా నీకై వేచి వేచి ......
  అలసి రాలిన పారిజాతాన్ని నేను!"...చాలా బాగుందండీ...

  ReplyDelete
 4. చాలా బావుంది
  keep it up

  ReplyDelete
 5. ఇంకొంచెం రాసి ఉంటే బాగుండేదేమో అనిపించిందండీ...
  "రేయంతా నీకై వేచి వేచి ......
  అలసి రాలిన పారిజాతాన్ని నేను!"

  "నువ్వు నిర్లక్ష్యంతో ఎగిరెళ్లిపోతేనేం
  దైవసన్నిధిలో నాచోటు పదిలం"
  ఈ వాక్యాలు చాలా చాలా నచ్చాయండీ నాకు...

  ReplyDelete
 6. బాగుంది.

  పువ్వు పువ్వునీ తట్టే నీకు
  పారిజాతం విలువేం తెలుసు ?
  మకరందపు రుచులు తప్ప

  ఈనింద మధుపమునకు సరిపోతుంది కానీ, ఓ పురుషుడిగా చాలా భారంగా ఉంది. అందరూ అలాంటివారు కాదు కదా!? సున్నితంగా కొరడా ఝళిపించారు. కొందరినైనా ఆలోచింప చేయవచ్చు. :)

  ReplyDelete
 7. nee gunde karigetanduku
  ne chestaa naada yagjnam!

  nee manasu gelichetanduku
  raasestaa rasamaya kaavyam!!

  nee anveshana lonE nestam
  balichestaa naa sarwaswam!!

  grahiyiNchavela prEma tatwam
  paarijata parimalame kadaa nitya daivatwam!!

  daivame neevainappudu maratuvela dayaaparatwam !

  bhramara-sumaala bandham brahma srustike satyam shiva sundaram!!!!!

  chanrudiko noolu pogu
  mee kavita ravi kidi kovvotti velugu

  sadaa mee snEhaabhilaashi
  raki

  ReplyDelete
 8. @ అమృత గారు ,thanks!

  @ వంశీ గారు , తెలుగు సంగీతాభిమానులు అదృష్టవంతులండీ బాబూ :)

  @ శేఖరగారు, థాంక్సండీ ..

  @ భావనగారు , తుమ్మేడనే వెనకేసుకొస్తున్నారా .... :( :(

  @ మురళి గారు ,thanks!

  @ హరేకృష్ణ గారు ,మీక్కూడా ....

  @ తృష్ణ గారు , మీరన్నాక నాకూ అనిపించింది ఇంకొంచెం పోడిగించాల్సిందని ..కాని నా ఉక్రోషం అంతటితో ఆగిపోయింది మరి :)

  @ విశ్వప్రేమికుడుగారు , మధుపమునే కదండీ అన్నాను .ఒకవేళ గుమ్మడికాయల దొంగాలేవరైనా ఉంటే భుజాలు తడుముకుంటారు :) మీరే అన్నారుకదండీ అందరూ ఒకేలా ఉండరని !నేనూ ఒప్పుకుంటాను .

  @ కార్తీక్ ,thanks!

  @ రాఖీ సర్ ! ఎంత మాట ! మీ సాహిత్యం ముందు నాబ్లాగ్ ఎప్పుడూ దివిటీయేనండీ ...ధన్యవాదాలు .

  ReplyDelete
 9. నాకు కూడా రెక్కలున్నాయ్ కదా అని
  నేను కూడా నీ తొ ఎగిరితే ఎలా?
  నాకు నేను కాకుండా పొతాను!
  నీకేమీ కాకుండా పొతాను !!

  కలకాలం చెంతనుండవని
  నీతొనాకు సమరం దెనికి?!
  ఒక్క బిందువు చాలు అమృతం
  అమరత్వం పొందదానికి !!

  తిరిగి నిన్ను రమ్మన లేను
  తిరిగి మాత్రం పుట్ట గలను
  అన్మంతా నీకై వెచి
  నీ కోసమే గిట్ట గలను.....
  ......satya

  ReplyDelete
 10. ఏమో పాపం ఏ పువ్వూ ఇంతవరకు తన స్వంతానికి అందక అలా తోటలు పట్టి తిరుగుతున్నాడేమో మీ తుంటరి నేస్తం తుమ్మెద. తుమ్మెదలు లేని నా పూలవనం వుసూరుమంటున్నది. ఇటుగా పంపండి. :) సరదాకే...

  ReplyDelete
 11. బాగుందండీ
  @ఉష
  తుమ్మెదలు వచ్చాయా -:):)

  ReplyDelete