Monday, November 9, 2009

వార్షికోత్సవ శుభవేళ .....


అనుకున్నామని జరగవు అన్నీ ....అనుకోలేదని ఆగవుకొన్ని ....జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషిపని ....అన్నారో మహాకవి ! ఇదెంత నిజం ! బ్లాగ్ అంటే తెలియనితనం నుండి బ్లాగ్ వార్షికోత్సవాన్ని ఉత్సాహంగా మీతో పంచుకోవడం ...పై మాటలు అక్షరసత్యాలని నిరూపించటం లేదూ !

ఒకానొక రోజు ఈనాడు పేపర్ చూస్తుండగా ...e బ్లాగుల గురించి చదవటం ...వాటిలో భావుకత్వంతో నిండిన రాధిక గారి బ్లాగ్ గురించి చదివి సంబరపడిపోతున్న నన్ను చూసి నాస్నేహితుడు మీరు మాత్రం ఎందుకు బ్లాగ్ మొదలుపెట్టకూడదు అంటూ ప్రోత్సహించి కంప్యుటర్ మెట్లైనా తాకని నాచేత బ్లాగ్ మొదలు పెట్టించి తానే నా బ్లాగ్ కు నామకరణం చేసి ఇంతమంది మిత్రుల పరిచయానికి కారణమైన వాడికి మీ సమక్షంలో కృతఙ్ఞతలు తెలుపుకోవడం నా కనీస ధర్మం !

నేను బ్లాగ్ ఓపెన్ చేసింది నవంబర్ ఎనిదవ తేదీన అయినా మొదటి టపా రాసింది మాత్రం ఈరోజే !నెమలికన్ను మురళిగారి ఫిర్యాదు నిజం చేద్దామని కాదుకాని ...కుటుంబ బాధ్యతల వల్ల అప్పుడప్పుడూ బ్లాగ్ కి కొద్దిరోజులు దూరమవ్వాల్సి వచ్చేమాట వాస్తవం ! ఐతే మొదట భార్యగా ,కూతురిగా , తల్లిగా ....నా బాధ్యతల తర్వాతే కదా నా బ్లాగ్ ! దీనికి మీ అందరి సపోర్ట్ నాకే కదూ !

అన్నట్టు ఈ మధ్య టపా లేటవడానికి ఓ మంచి కారణం ఉందండోయ్ ! అనుకోకుండా ఫ్లాట్ తీసుకోవడం ...తర్వాత మంచి లేదన్నారని గృహప్రవేశం చేసుకోవడం ....ఈ హడావుడి అన్నమాట ! ఆహ్వానించలేదని అన్యదా భావించక ఆశీర్వ దిస్తారు కదూ! ఉత్తములకు భగవంతుని అండ ఎల్లప్పుడూ ఉంటుందని అంటారు ....అటువంటి ఉత్తములైన మిత్రుల ప్రోత్సాహం కొండంత అండగా నాకుంటుందని ఆశిస్తూ ......ఇంతవరకూ నేనేం రాసినా నన్ను ప్రోత్సహిస్తూ స్పందించిన వారికీ ...బ్లాగ్ ఫాలోవర్స్ గా ఉంటూనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినవారికీ ......నేను తెలియక తప్పులు రాసినపుడు సరిదిద్దిన వారికీ ....అందరికీ వినమ్ర పూర్వక నమస్సులతో ......మీ పరిమళం !

25 comments:

  1. శుభం. మీ బ్లాగు నూరేళ్లు చల్లగా వర్థిల్లు గాకా... :):)

    ReplyDelete
  2. వార్షికోత్సవ శుభవేళ పరిమళాల అభినందన మాల..అదేంటో మీ టపాలకు అలవాటు పడిపోయాం. తరచూ కనపడకపోతే దిగులొచ్చేస్తుంది. :(

    ReplyDelete
  3. బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు .
    నూతన గృహప్రవేశానికి అభినందనలు .

    ReplyDelete
  4. బ్లాగ్ గృహప్రవేశం చేసిన one ఇయర్ కే నిజ గృహప్రవేశం చెయ్యడం యద్రుచ్చికమే ఆయినా ముదావహం . మీరు ఇకనుంచి గృహానికి , బ్లాగ్ కి కూడా సమాన సమయం కేటాయిస్తారని , మరిన్ని పరిమళాలు అందులో వెద జల్లు తారని ఆశిస్తూ.......

    ReplyDelete
  5. వార్షికోత్సవ శుభాకాంక్షలు... మీ నుంచి మరిన్ని మంచి మంచి టపాలను ఆశిస్తూ...

    ReplyDelete
  6. పరిమళ గారు, మీ బ్లాగ్ వార్షికోత్సవానికి, గృహప్రవేశానికి రెండింటికి కలిపి డబుల్ కంగ్రాట్స్. ఇప్పుడు మీ కొత్త అనుభవాలు అన్నీ మాకు చెప్పేయాలి. ఇంక ఎటువంటి ఆలస్యాలు జరుగవుగా! I wish you all the best.

    ReplyDelete
  7. పరిమళం గారు అభినందనలు..శుభాకాంక్షలు కూడా ..మీ బ్లాగుకి ఇంటికి:)

    ReplyDelete
  8. శుభాభినందనలు... మీ రాతల పరిమళాలు ఇకముందు కూడా, ఎన్నో సంవత్సరాల వరకూ వెదజల్లాలని కోరుకుంటున్నాను :-)

    ReplyDelete
  9. వార్షికోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  10. ఒకేసారి రెండు మంచి విషయాలు చెప్పారు... అందుకోండి శుభాభినందనలు

    ReplyDelete
  11. మీ బ్లాగ్ వార్షికోత్సవానికి శుభాకాంక్షలు!

    అలాగే మీ గృహప్రవేశానికి కూడా శుభాకాంక్షలు!

    మరిన్ని టపాలతో బ్లాగులోకాన్ని అలరిస్తారని అనుకుంటాను.

    ReplyDelete
  12. శుభాకా౦క్షలు మీ నూతన గృహాప్రవేశానికి,మీ నిత్యనూతన బావాల గుభాలి౦పుల బ్లాగు వార్షికొత్సవానికి.
    మిమ్మల్ని ప్రోత్సహి౦చిన మీ స్నేహితునికి నా దన్యవాదాలు.ఆయన మూల౦గానే మీ అముల్యమైన కవితా స౦పద మమ్మల్ని చేరి౦ది కదా!!!నా దన్యవాదాలు వారికి అ౦దచేయ౦డి...
    మీలోని పరిమళి౦చిన అ౦దమైనా భావాల్ని కవితలుగా,కధనాలుగా గుదిగుచ్చి,
    మాకోస౦ మీరు అ౦దిస్తున్న పరిమళ౦ అమెఘ౦,అద్బుత౦..
    మాకోస౦ మీ సమయ౦ కేటాయి౦చమని కోరుకు౦టూ..
    ప్రేమ తో.
    మీ,
    సుభద్ర

    ReplyDelete
  13. గృహప్రవేశ శుభవేళ శుభాకాంక్షలు
    బ్లాగ్ వార్షికొత్సవానికి అభినందనలు

    ReplyDelete
  14. పరిమళం గారు,
    వార్షికోత్సవ శుభాకాంక్షలు...

    ReplyDelete
  15. వార్షికోత్సవ శుభాభినందనలు; నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు.

    మరిన్ని శుభతరుణాలు మీకై ఈ రెండిటా వేచేవుంటాయి. మాకూ చేరనున్నాయి. ఇది నిక్కం. :)

    ReplyDelete
  16. వార్షికోత్సవ శుభాభినందనలు; నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
    నేను కూడా.. మేము అలిగేము మమ్ములను పిలిచి భోజనం పెట్టకుండా గృహ ప్రవేశం చేసేసినందుకు అంతే లెండి చెంగు దోపి మీ వూర్లో వాళ్ళకైతే చక చకా వడ్డించేస్తారు బంతులలో.. మాకైతే పెట్టరు..

    ReplyDelete
  17. ఆశీర్వాదాలు , అభినందనలూ అక్షింతలుగా కురిపించిన మిత్రులందరికీ ....నా నమస్సుమాంజలి!

    ReplyDelete
  18. లేటయినా నా శుభాకాంక్షలుకూడా అందుకుంటారనే ఆశతో

    ReplyDelete
  19. @ కెక్యుబ్ వర్మ గారు ధన్యవాదాలు

    @ తృష్ణ గారు , థాంక్స్ !

    ReplyDelete