Saturday, October 24, 2009
ఏడ తానున్నాడో మావ.....
బంగారు నామామ...ఏడ తానున్నాడో
అలకేమో నాపైన ....ఎందు దాగున్నాడో
రెండునాళ్ళాయే అగుపడకనాకు !
నాఎనక తనుజేరి తనవేళ్ళ చితుకులతో
నా ఒళ్ళు రాజేసి ఏమెరగనట్టుగా
జొర్రమొచ్చిందంటు మేలమాడిన మావ
మారిపోయేనీయాల ఏలనో
నీకైనా ఎరుకేనా ఎన్నెలమ్మా ?
ఇసుకతిన్నెంటి ఎదమీదతలవాల్చి
సేదతీరి జిలిబిలి కబురులు నేచెప్పుతుంటే
చిరపుంజి నేనంటూ నాసరి నువ్వంటూ
కోకల్లె నన్నుచుట్టుకున్న మావ
మారిపోయేనీయాల ఏలనో
నీకైనా ఎరుకేనా కోయిలమ్మా ?
గండుతుమ్మెదల్లె ఏ తోటకేల్లాడో
తోటలో పూలన్నీ నాసవతులయ్యేనో
నామోముజూడక అలిగె నామావ
తనజాడ తెలిసినా ఎక్కడగుపడినా
నాకబురు చెప్పవా ఓ చందమామా
Subscribe to:
Post Comments (Atom)
నాకెందుకో నండూరి వారి ఎంకి గుర్తొచ్చిందండీ..
ReplyDeleteపరిమళం గారు, నండూరివారి ఎంకిని మళ్ళీ గుర్తు చేసారండి. చాలా బాగుంది. ఇంతకి, మావ ఎందుకలిగాడో!
ReplyDeleteకొండగాలితిరిగింది, గుండె ఊసులాడింది కదమ్మ...
ReplyDeleteఅలా జాబిలమ్మతో కబుర్లు చెప్పడానికి వెళ్ళిన మామ..
పరిమళాల గుబాళింపులు గుర్తొచ్చి మరలివస్తున్నారు చూడమ్మ..
కలవరపడకని కబురంపెను కదా మామ, ఇంత బేల తనమేలనే భామ!:)
వావ్ పరిమళం గారూ క్లాప్ ..క్లాప్. చాలా బాగుంది.
ReplyDeleteభలే ఎంకి, ఎన్ని ధీర్ఘాలు తీసింది ;)
ReplyDeleteటైప్ చేయలేను కానీ నా మనసిలా పోయినప్పటి నా వూసులివి ...
నేనూ నండూరి ఎంకికేం తీసిపోను http://maruvam.blogspot.com/2009/03/blog-post.html
మావో మనియాద పడకే! http://maruvam.blogspot.com/2008/12/blog-post_6490.html
very good one.. different feeling..
ReplyDeleteఅక్క అద్భుతం మీకు జాన పద భాష(దన్నెమంతారో నాకు తెలియదు) ఇంత బాగా వచ్చా...
ReplyDeleteనండూరి వారి ఎంకి పాట అనుకున్నాను మొదట్లో...
www.tholiadugu.blogspot.com
పరిమళం గారూ !
ReplyDeleteమీలో జానపద గీత రచన పరిమళిస్తోంది. జానపద బాణీలు మర్చిపోతున్న రోజుల్లో, లేక చానల్స్ ద్వారా వ్యాపార ధోరణిలోకి మారిపోతున్న రోజుల్లొ మళ్ళీ జీవం పోసుకున్న జానపదాన్ని చూస్తున్నాను. ఇంకా మరిన్ని జానపద రచనలు మీ నుంచి వస్తాయని ఆశిస్తూ...
శతాధిక టపాలతో బ్లాగులందు పరిమళించినదీ బ్లాగు.
ReplyDeleteచాలా బాగుంది మీ ఎంకి పాట.
బాగుందండీ..
ReplyDeleteఈడనాడ సూడ ఏమి లాభమే యెంకి
ReplyDeleteనీ మదినిండ మామేను అదినిండు ప్రేమేను... :)
nice... very nice!
ReplyDeleteBeautiful!!!
ReplyDeletewow chaalaa chaalaa baagumdi..paataki taggattu gaa bomma ...super anukomdi.
ReplyDeleteచాలా బాగారాశారు
ReplyDeleteఎంకి పాట చాలా చాలా బావుంది పరిమళ్ళం గారు
ReplyDeleteకాస్త నిర్లక్ష్యానికే ఉక్రోష పడిపోయిన మనసు రాసిన ఊసులు ! మీకందరికీ నచ్చినందుకు ధన్యవాదాలు .
ReplyDelete