
ఇంటి ముంగిట వెలిగే దివ్వెలు ...
ఇల్లాలి మోమున మెరిసే చిర్నవ్వులు
ఇంటి యజమానికవే అష్టైశ్వర్యాలు
చిన్నారులకేమో టపాసులు ....
కొత్తల్లుళ్ళకు అత్తింటి కానుకలు
బీదసాదలకు దానధర్మాలు
కొత్తబట్టలు ...విందువినోదాలు
ఇంతేకాదు పండుగ ....
ఆనాటి శ్రీకృష్ణసత్యల చేతి విల్లు
అసుర సంహారం చేస్తే ....
చెడుపై మంచి సాధించిన విజయం !
ఈనాడు" క్షమ "అనే విల్లునెక్కుపెట్టి
మనలోని అసూయా ద్వేషాలను సంహరిస్తే
మనల్ని మనమే గెలిచిన విజయులం !
ఆర్ధికమాంద్యాల....ప్రకృతి వైపరీత్యాల చీకట్లను
ధైర్యం ...దయ ...అనే దివ్వెలు వెలిగించి పారద్రోలుదాం !
ఆనంద దీపావళిని కలిసికట్టుగా ఆహ్వానిద్దాం !
**బ్లాగ్ మిత్రులందరికీ మరియు వారి కుటుంబసభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !
అనుకోకుండా ఇది నా వందవ టపా కావడం(నాకు :) ) విశేషం!నేను బ్లాగ్ మొదలుపెట్టినప్పటినుండీ నన్ను ప్రోత్సహిస్తూ ,సలహాలిస్తూ , తప్పులు దిద్దుతూ ..నా వెన్నంటి నిలిచిన మిత్రులందరికీ వినమ్ర పూర్వక ధన్యవాదాలు.అలాగే నా బ్లాగ్ ని అనుసరిస్తూ ఫాలోవర్స్ గా ఉండి నన్ను ఉత్సాహపరుస్తూ ...నాలో ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తున్నమిత్రులందరికీ కృతఙ్ఞతలు . మీ ప్రోత్సాహం , మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ ......
-మీ పరిమళం -
రెండు పండుగలకూ శుభాకాంక్షలు... మీ బ్లాగు పయనం పరిమళాలను వెదజల్లుతూ సాగిపోవాలని కోరుకుంటూ...
ReplyDelete"ఈనాడు" క్షమ "అనే విల్లునెక్కుపెట్టి
ReplyDeleteమనలోని అసూయా ద్వేషాలను సంహరిస్తే
మనల్ని మనమే గెలిచిన విజయులం !"
Very true. All the best
డబల్ ధమాకా అన్నమాట!!
ReplyDeleteనూరోపోస్టు సందర్భంగా - అభినందనలు.
చక్కటి కవితలు రాస్తూ అందర్నీ అలరిస్తూ ముందుకెళ్దురుగాక.
మరియూ దీపావళి శుభాకాంక్షలు!!
Congracts.....
ReplyDeleteబాగుందండీ పరిమళం గారు.
ReplyDeleteమీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. నా 100వ టపా గురించి రాస్తూ ఉంటే మీ 100వ టపా కనిపించింది. తమాషాగా ఉంది.
మీకు, మీ కుటుంబానికి మన జగదైక కుటుంబానికి సంతోష దీపావళి.
వంద... వేలను చేరాలని ఆకాంక్షిస్తూ....
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు
శుభాకాంక్షలు మీ వందవ టపాకు,అలాగే దీపావళికీ :)
ReplyDeleteవందటపాల పండుగకు......దీపావళి పండుగకూ....మీకు, మీ కుటుంబ సభ్యులకు సుభాకాంక్షలు
ReplyDeleteపరిమళం గారు,మీరు దీపావళి పర్వదినాన మీ వందవ టపా పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు.
ReplyDeleteమీకు, మీ కుటుంబసభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు.
congrats parimalam gaaru
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు
మీకూ కూడా దీపావళి శుభాకాంక్షలు. అభినందనలు 100 వ టపాకు. ఇంకా ఎన్నెన్నో 100 ల టపాల కోసం ఎదురు చూస్తుంటాము.
ReplyDeleteమీకు నా దీపావళి శుభాకాంక్షలు!
ReplyDelete100 "tapa"sulu kalcharannamaata...congrats
ReplyDeleteఅమ్మో వంద టపాలే...అది కూడా వందవ టపా దీపావళికి రాయటం...భలే కలిసొచ్చాయి..
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలండీ..
మీ 100వ "టపా" కి టపాకాయల మోత తో స్వాగతం పలుకుతున్నాం పరిమళం గారు.. :)
ReplyDeleteరెండింటికీ....శుభాకాంక్షలు.
ReplyDeleteమీ బ్లాగ్ పరిమళాలు ఇలాగే అందరి మనసులనూ ఆనందోల్లాసాలతో నింపుతూ ఉండాలి..!!
thvaralone oka 1000wala kalchalani korukuntu.. oka follower :)
ReplyDeleteమీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!
ReplyDeleteబాగుంది పరిమళం గారు
ReplyDeleteమీ వంద టపాలకు అభినందనలు.
అలాగే దీపావళి శుభాకాంషలు
అభినందనలు..
ReplyDeleteమీకు మనసారా నా దీపావళి శుభాకాంక్షలు.
ReplyDeleteఅంతే కదండి, కక్షలు, కార్పణ్యాలు ఏమీసాధించవని అంత గత చరిత్ర తెలిపాక ఇక ఆ మార్గం మనకెందుకు. మీరన్నదే నిజం. క్షమ ని మించిన బలం లేదు.
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు
మీకు నా అభినందనలు .
ReplyDeleteమీ వందవ టపాకు అభినందనలు .
ReplyDeleteమీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
నాకు శుభాకాక్షలు ,శుభాశీస్సులు అందించిన మిత్రులందరికీ నమస్సులు !
ReplyDeleteపరిమళం అక్క దీపావళి శుభాకాంక్షలతో పాటు వందవ టపా పూర్తయిన సందర్బంగా కూడా శుభాకాంక్షలు ......
ReplyDeleteఅయ్యో నేను చాల లేటుగా వచ్చా........
దీపావళి గురించి మాత్రమే చెప్పకుండా
"ఈనాడు" క్షమ "అనే విల్లునెక్కుపెట్టి
మనలోని అసూయా ద్వేషాలను సంహరిస్తే
మనల్ని మనమే గెలిచిన విజయులం !"
ఇలాంటి మంచి మాటలు కూడా చెప్పారు ....
బావుంది ఈ కవిత
శుబాకాంక్షలు
ReplyDeleteఅభినందనలు
బొల్లోజు బాబా
వందవ టపా - శుబాకాంక్షలు, అభినందనలు
ReplyDelete