Tuesday, October 13, 2009

మన్నించు మీనమా !


ఉష గారి జలపుష్పాభిషేకంలో పాల్గొన్నవారంతా మహామహులే ...
ఐనా ధైర్యంచేసి ఈ చిరుపుష్పాన్ని నావంతు కానుకగా ఇస్తున్నా ....

కవులంతా కన్నె కన్నుల అందం నీతోనే పోల్చేరు
శ్రీహరి వేదాలను కాచింది నీరూపునే అన్నారు
ముత్యాల నగరికి మహారాణి వన్నారు
చిన్నారిపాపలకు కధలల్లి చెప్పేరు
ఆల్చిప్పల మధ్య , ఆత్మీయులమధ్య
ఆనందంగా తిరుగాడే దానవు
నీఇంట నువ్వుంటే వలవేసి పట్టేరు
అద్దాల తొట్టెల్లో అందంగా అమర్చేరు
నీ స్వేచ్ఛ హరించి అంగట్లో అమ్మేరు
ఇంకొందరేమో నీఉసురు తీసి
రుచులు రుచులుగా వండి విందారగించేరు
జలపుష్పానివో ...లేక జలాధిదేవతవో నీవు
మానవ తప్పిదాన్ని మన్నించు మీనమా !

**పై కవిత రాస్తున్నంత సేపూ నామనసు నాఎదురుగా కూర్చుని ( అదేదో సినిమాలోలాగా ) ప్రశ్నిస్తూనే ఉంది నీకిలా రాసే అర్హత ఉందా అని ! ఎందుకంటే చేపలపులుసంటే నాకు చాలా ఇష్టం మరి ! మిత్రులారా మన్నించండి !

14 comments:

 1. వావ్.. చాలా బాగుంది మీ కవిత, ఎంత ఆర్ధ్రతో మా పరిమళపు పూరెమ్మకు... ఎంత ఇష్టమో చేపల పులుసు ఈ సుగంధాల కొమ్మ కు.. ;-) వూరికే అన్నాను లెండీ.. నాకు కూడా చేపల పులుసు ఇష్టమే :-(

  ReplyDelete
 2. ఈ జలచరాల కథ ఎక్కడ మొదలయ్యిందో అర్ధం కాలేదు.. ఉష గారు ప్రారంభించారా? చాలా బ్లాగుల్లో చేప పిల్లలు కనిపిస్తున్నాయండి.. వరుసగా చదవాలి...

  ReplyDelete
 3. పరిమళం, నా మాట మన్నించినందుకు అతి శీఘ్రంగా ఇలా కవిత వెలికి తెచ్చినందుకు ధన్యవాదాలు. భావన మాటె నాదీను.

  నాకే కనుక సాధ్యపడితే అందరినీ శాఖాహారులుగా మారుస్తానంటే, అపుడు కోడిపిల్లే నిన్ను తినేస్తుంది - ఇది ఫుడ్ చెయిన్ లో భాగం అని నా వారసుడే నన్ను పరిహసించాడు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుగా.


  మురళీ గారు, ఇది అన్యాయం. ఇక మీకు నాకు రాం రాం :) మేకలాగా, వూర్లో తిరిగి మైకుతో వూదరగొట్టే రిక్షా బండోడిలాగా ఎన్నాళ్ళనుండీ ఈ గోల పెట్టాను? ఇపుడు అడుగుతున్నారు. శుక్రవారం వరకు ఆగండి. సంకలనం బయటకి వస్తుంది.

  ReplyDelete
 4. కేకో కేక....మీనం కాదు మీ కవితండి!

  ReplyDelete
 5. చాలా బాగుంది.

  ReplyDelete
 6. క్షమించాలి. అధాట్టున మీ టపా టైటిలు మన్నించు మీమా అని చదివాను. పాపం మీ వారి మీసాలు కత్తిరించబోయి మొదటికే మోసం తెచ్చారేమోనని రసవత్తరమైన ఘట్టం చదవడానికి ఆసక్తిగా టపా తెరిస్తే .. ఇంతా చేసి చేపల గురించి .. ప్చ్!

  ReplyDelete
 7. పాపం శమించుగాక ......అద్దలతోట్టేలో భందించాను పదిహేనేల్లనుండి.....నా కూతురి ముచ్చట కోసం తప్పదు .....అవి నాకు నేస్తాలె .....బాగుంది కవిత .

  ReplyDelete
 8. పరిమళం గారు నా బ్లాగు చూచి అందులో కామెంట్ వ్రాసినందుకు కృతజ్ఞతలండి, మీరు పెద్దగ చదువుకోలేధన్నారు కాని మీ కవితలు చాలబాగున్నయండి. ఈ బిజి జీవితంలో ఎవరికివారే తమచుట్టు గీత గీసుకొని బ్రతుకుతున్నారు పక్కవాన్ని పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఇది కంప్యుటర్ కాలం కనుక దానిద్వారనన్న నాకుతెలిసిన మన్చి విషయాలను చెప్పాలని నేను నా బ్లాగులో వ్రాస్తున్నాను. నా బ్లాగులో మిగితా పోస్టులలో కూడా మంచి విషయాలే వ్రాశాను అవికూడా చదివి వాటిపై మీ అభిప్రాయాలూ వ్రాయండి అలాగే మీకు తెలినవారికి చెప్పండి.
  నా బ్లాగుని ప్రమోట్ చేయడానికి ఇతరులకి చెప్పమనటంలేదు కేవలం మంచి విషయాలను అందరికి గుర్తుచేయలన్న ఆలోచనతోనే దయచేసి అర్ధంచేసుకోండి.

  ReplyDelete
 9. మీ కవితతో పాటు మీ నిజాయితీ కూడా నచ్చింది. చేపల పులుసంటే ఇష్టముండదా ఎవరికైనా? కానీ ఈ జలపుష్పాభిషేకం కోసం రాస్తూ మీరు ఒప్పుకొన్న తీరు మహ బాగు.

  ReplyDelete
 10. కుమార్ గారి మాటే నాదీనూ.... మీ నిజాయితీ అభినందనీయం :)

  ReplyDelete
 11. జలపుష్పాభిషేకంలో చోటిచ్చిన ఉషా గారికీ , స్పందించి కామెంటిన మిత్రులకూ ధన్యవాదాలు !

  ReplyDelete
 12. అబ్బ ! అదుర్స్ అండీ (చేపల పులుసు కాదు మీ కవితే)

  ReplyDelete
 13. బ్లాగు ఆగినా చదువరులు ఆగనందుకు సంతోషంగా ఉంది అభిప్రాయం మెచ్చుకోలుకు ధన్యవాదాలు మల్లిఖార్జున్ గారు

  ReplyDelete